S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/26/2018 - 23:28

దేవరకొండ, జూన్ 26: నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము తహశీల్దార్ రవిశంకర్‌పై మంగళవారం నేరెడుగొమ్ము మండల కేంద్రానికి చెందిన రైతులు పల్స రాములు, అతని కుటుంబ సభ్యులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే పల్స రాములుకు సంబంధించిన వ్యవసాయ భూమి దాదాపు 3 దశాబ్దాల క్రితం చెరువు కోసం అధికారులు భూసేకరణ జరిపారు.

06/26/2018 - 23:28

జగిత్యాల, జూన్ 26: రైతుబంధు ప్రతిష్టాత్మకమైన పథకం అని చెబుతున్నా సగానికి పైగా అవకతవకలు దొర్లాయని.. రైతు బీమా పథకం అన్ని వర్గాల రైతులకు వర్తింపజేసి ధీమా కల్పించకుండా రైతుల పట్ల సీఎం కేసీఆర్ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

06/26/2018 - 23:27

ధర్మపురి, జూన్ 26: జగద్గురు దక్షిణామ్నాయ శృంగేరీ పీఠాధీశ్వర శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ తీర్థ స్వామికి ధర్మపురి క్షేత్రంలో అశేష జనం నీరాజనాలు పలికారు. మంగళవారం రాత్రి క్షేత్రానికి అరుదెంచిన స్వామి వారికి భారీ వర్షంలో నంది విగ్రహ కూడలిలలో పూర్ణకుంభ యుక్త అఖండ స్వాగతం పలికారు.

06/26/2018 - 05:44

వరంగల్, జూన్ 25: కాళేశ్వరం ప్రాజెక్టు, మన కాలపు మహా ప్రాజెక్టు.. కాలం కాని కాలంలో నిర్మితమవుతున్న అతి భారీ ప్రాజెక్టు. ఒకటి కాదు, రెండు కాదు నిర్మాణ విశిష్టతలు, అనేక ప్రయోజనాలను సమకూర్చబోతున్న ఒక ఆధునిక అద్భుతం, ఈ ప్రాజెక్టు ఇంకా జలకళను సంతరించుకోక ముందే ఇక్కడ ‘జనకళ’ ఉట్టిపడుతోంది. ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతమంతా ప్రజల సందర్శనలతో ఒక జాతరను తలపిస్తోంది.

06/26/2018 - 05:40

గోదావరిఖని, జూన్ 25: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌లో నెలకొన్న కహా నీ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెంతకు చేరింది. ఇక్కడ రాజకీయ పరిణామాల నేపథ్యమం తా కూడా ఆయన దృష్టికి వెళ్లింది. దీంతో రామగుండం కార్పొరేషన్‌లో అధికార పార్టీకి సంబంధించి తలెత్తుతున్న విభేదాలు ఒక్కసారిగా రాజధానిలో గుప్పుమన్నట్లు తెలుస్తోంది.

06/26/2018 - 06:05

నల్లగొండ: ముందస్తు ఎన్నికలకు టీజే ఎస్ సిద్ధమేనని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయడం రాజకీయ పార్టీలకు సహజమేనని దీనిపై సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు సవాళ్లను విసరడం ఆయన వికృత, పిల్ల చేష్టలకు, అహంభావానికి నిదర్శనమని విరుచుకు పడ్డారు. సోమవారం నల్లగొండలో జిల్లా టీజేఎస్ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

06/26/2018 - 06:00

కరీంనగర్: ఎరువుల ధరలు దరువేస్తున్నాయి. అన్నింటిపై 15శాతానికిపైగా ధరలు ఎగబాకాయి. ఇప్పటికే నానా తంటాలు పడుతూ సాగును నెట్టుకొస్తున్న అన్నదాతలకు ఎగబాకిన ఎరువుల ధరలు మరింత భారం కానున్నాయి. ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు,నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల ధరలు రైతులను బాధిస్తున్నా య.

06/26/2018 - 05:20

హైదరాబాద్, జూన్ 25: ప్రతి ఉపాధ్యాయుడికి వారి అర్హతల మేరకు న్యాయం జరిగేందుకు , బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం వెబ్ కౌనె్సలింగ్‌ను చేపట్టిందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు.

06/26/2018 - 05:18

హైదరాబాద్, జూన్ 25: నగరంలోని బంజారాహిల్స్‌లో నిర్మాంలో ఉన్న పోలీస్ కమాండ్, కంట్రోల్ సెంటర్ నిర్మాణం వేగంగా జరుగుతుండడంపై ముఖ్యమంత్రి కెసిఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యంత ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. సోమవారం సిఎం కెసిఆర్ కమాండ్ సెంటర్‌ను ఆకస్మికంగా సందర్శించారు.

06/26/2018 - 05:16

హైదరాబాద్, జూన్ 25: పచ్చదనంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచేలా అధికారులు పూర్తి తోడ్పాటును అందించాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, జోగు రామన్నలు స్పష్టం చేశారు. సోమవారం దూలపల్లిలోని తెలంగాణ అటవీ అకాడమీలో గ్రామీణాభివృద్ధి, అటవీ, వ్యవసాయ, ఉధ్యానవన అధికారుల రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను మంత్రులు ప్రారంభించారు.

Pages