ఆహా! మన మేధావులు!!

ఈ మధ్యే జరిగింది ఈ ముచ్చట. ‘క్రాంతికార్’ అనే హేతువాది ‘ది క్రిసెంట్ ఓవర్ ది వరల్డ్’ అనే పుస్తకాన్ని ప్రచురించాడు. అందులోని అంశాలు తమ మత విశ్వాసాలను, సెంటిమెంట్లను దెబ్బతీశాయని జమాయితే ఉలేమా ఎ హింద్ ప్రతినిధి ఖమ్మం పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే కదిలి ఆ ఊళ్లోనే ఉండే నిందితుడిని ఆ రాత్రికి రాత్రే అరెస్టుచేసి రిమాండుకు పంపించారు. అభ్యంతరకరమైన గ్రంథం ప్రచురణకు సహకరించారన్న అభియోగం మీద పెద్దనోరు ఇన్నయ్య సహా ఇద్దరు సో కాల్డ్ హేతువాదులనూ ఆఘమేఘాలమీద అరెస్టు చేసి, రిమాండు మీద జైలుకు తరలించారు. ఈ సంగతి అన్ని పత్రికలూ రాశాయి. చానెళ్లూ చెప్పాయి. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఏ ఒక్క హేతువాదీ, ఏ ఒక్క మేధావీ పోలీసుల చర్యను తప్పుపట్టలేదు. రచయితల అభిప్రాయ స్వేచ్ఛకూ, భావ వ్యక్తీకరణ స్వాతంత్య్రానికి పుట్టి మునిగిందని ఏ సెక్యులరిస్టూ, ఏ ప్రజాస్వామ్యవాదీ గగ్గోలు పెట్టలేదు. మత విశ్వాసాలు, సెంటిమెంట్లు ఇమిడిన సున్నితమైన అంశంలో, అందునా ఒక మతానికి చెందిన వారికి తీవ్రాగ్రహం కలిగించిన విషయంలో కడు జాగ్రత్తగా వ్యవహరించాలనే లిబరల్, సెక్యులర్ మహా మేధావులందరూ నోళ్లు కుట్టేసుకుని గొప్ప సంయమనం చూపారు. మంచిదే. మెచ్చుకోవలసిందే.
ఇది జరిగిన మూడోరోజునే కర్నాటకలో ఇంకో అగ్గి అంటుకుంది. ముస్లిం రచయిత్రి తస్లీమానస్రీన్ బురఖా సంప్రదాయాన్ని తప్పుబడుతూ ఎప్పుడో రాసిన (?) వ్యాసాన్ని కన్నడ పత్రిక అనువదించి, పునర్ముద్రిస్తే ముస్లింలు మండిపడి, షిమోగ, హస్సన్ పట్నాల్లో భారీ విధ్వంసానికి దిగి, పత్రికా కార్యాలయాలపై దాడిచేసి, ఆస్తులు తగలెట్టి నానా ఆగం చేశారు. దానికీ మన లిబరల్, సెక్యులర్ మేధావిగణం కిమ్మనలేదు. ప్రజాస్వామిక హక్కులు మంటగలిశాయనో, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ప్రమాదం వచ్చిందనో ఎవరూ లబలబలాడలేదు. మత విశ్వాసాలు, సెంటిమెంట్లు గాయపడినప్పుడు ఒక మతవర్గం రెచ్చిపోయి, హింసకు, విధ్వంసానికి దిగడాన్ని అర్థం చేసుకుని, ఒళ్లు దగ్గర పెట్టుకుని మెలగడం మేలని మన మేధావిరత్నాలు తలచాయి. అందుకూ వారికి జేజేలు పలకాల్సిందే.
* * *
ముస్లింల మతపరమైన విశ్వాసాలూ, సెంటిమెంట్ల పట్ల ఇంత చక్కటి నిగ్రహం చూపే మహానుభావులు హిందువుల సెంటిమెంట్ల దగ్గరికి వచ్చేసరికి ఒంటికాలిమీద లేచి ఎగిరెగిరి పడతారు ఎందువల్ల? ఒక్క హిందువులవే కాదు... యావద్భారతీయుల సెంటిమెంట్లనూ దారుణంగా దెబ్బగొట్టిన ఎం.ఎఫ్. హుస్సేన్ అనే ఆకతాయి చిత్రకారుడు ఇండియామీద అలిగి పరాయి దేశం పౌరసత్వాన్ని ఆబగా పుచ్చేసుకుంటే... తెంపరితనమని గర్హించాల్సింది పోయి అది జాతి యావత్తూ సిగ్గుపడవలసిన విషయంగా ఎక్కడెక్కడి మహామేధావులూ, మహా కళాకారులూ గుండెలు బాదుకుంటున్నారు ఎందుచేత? వివాదాస్పదమైన పుస్తకాన్ని ఖమ్మం హేతువాది సొంతంగా రాయలేదు. గతంలో వెలువడ్డ అనేక గ్రంథాల్లో, అనేక పత్రికల్లో ఇస్లామిక్ ఫండమెంటలిజాన్ని తెగనాడుతూ దేశదేశాలకు చెందిన 31 మంది ముస్లిం మేధావులు రాసిన వ్యాసాలను ఒకచోట సంకలించడమే అతగాడు చేసిందల్లా. అదే అభ్యంతరకరమని, విస్తృత హింసకు విధ్వంసానికి దిగక తప్పనంతగా మత సెంటిమెంట్లు గాయపడ్డాయని కొంతమంది ముస్లింలు తలిచారు. లిబరల్, సెక్యులర్ మేధావులూ వౌనం ద్వారా అందుకు అర్ధాంగీకారం తెలిపారు. బాగానే వుంది. మరి ఎం.ఎఫ్. హుస్సేన్ చేసిన దుర్మార్గం మాటేమిటి? కోట్లాది హిందువులు భక్తితో కొలిచే చదువులతల్లి సరస్వతిని, ఆదిశక్తి దుర్గను, మతాలకు అతీతంగా ఈ దేశవాసులు యావన్మందీ పరమ పవిత్రంగా తలిచే భారతమాతను వలువలు వొలిచి దిగంబరంగా చిత్రించిన ఘనుడాతడు. ఆఖరికి సీతమ్మవారిని కూడా రావణుడి చెంత నగ్నంగా ఉన్నట్టు చూపించిన గొప్ప కళ అతడిది. ఒకే బొమ్మలో పిలకబ్రాహ్మడిని దిగంబరంగానూ, కత్తిపట్టిన మహమ్మదీయుడినేమో ఒంటినిండా దుస్తులతోనూ చూపెట్టిన మతపక్షపాతి అతడు. ఇంతటి మతోన్మాదంతో, ఇస్లాం మతానికి చెందిన పవిత్ర వ్యక్తులను అశ్లీలంగా, అసభ్యంగా చిత్రించే ఘాతుకానికి ఏ చిత్రకారుడైనా పాల్పడి ఉంటే ముస్లిం ప్రపంచం భగ్గున మండేది. సదరు కాఫిర్ తల తక్షణం నరకాలని ఫత్వా జారీ అయ్యేది. మొన్న ఖమ్మంలో, షిమోగాలో, హస్సన్‌లో జరిగిన గొడవలు, అల్లర్ల కంటే వందరెట్లు తీవ్రమైన ఆందోళనలు, విధ్వంసాలు సంభవించి ఉండేవి. అదృష్టవశాత్తు హిందువులకు చీము, నెత్తురు లేదు కనుక అలాంటి ఉపద్రవాలేమీ రాలేదు. ఒకటి రెండు చోట్ల దిక్కుమాలిన బొమ్మల ప్రదర్శనపై శివసైనికులు విరుచుకుపడి ఆగమాగం చేయడాన్ని మినహాయిస్తే దేశంలో ఎక్కడ ఎలాంటి అలజడీ తలెత్తలేదు. సల్మాన్ష్ద్రీ శిరచ్ఛేదానికి ఖొమేనీ ఆజ్ఞాపించినట్టు హుస్సేన్‌ను చంపాలనిగాని, దేశంలో ఉండనివ్వరాదనిగాని ఏ హిందూ మత సంస్థా ఫత్వా ఇవ్వలేదు. అడ్డమైన బొమ్మలను గుడ్డల్లేకుండా గీసే కళాత్మక హక్కు హుస్సేనుకు ఉన్నట్టే... సదరు ఆగడానికి చట్టబద్ధంగా అభ్యంతరం తెలిపే ప్రజాస్వామిక హక్కు బాధిత వర్గానికీ ఉన్నది కనుక కొంతమంది పౌరులు దేశంలో అనేక ప్రాంతాల్లో అతడి మీద కోర్టుల్లో కేసు పెట్టారంతే. ఆ మాత్రానికే అలిగి హుస్సేను దేశం విడిచి లండన్‌కూ, దుబాయికీ మకాం మార్చాడు. ఇప్పుడు ఇస్లామిక్ దేశమైన ఖతార్ తనకు పౌరసత్వం ఇస్తామనేసరికి మహాప్రసాదమని ఎగిరి పుచ్చేసుకున్నాడు. సరే! ఆయన నిర్ణయం ఆయనది. మాధురీదీక్షిత్‌లేని దేశంలో ఉండకూడదని, సెక్యులర్, ప్రజాస్వామిక భారతదేశంలో కంటే ఇస్లామిక్ ఖతార్‌లోనే తన కళాస్వేచ్ఛ పురివిప్పి ఆడుతుందని హుస్సేన్ అనుకుంటే చేయగలిగింది లేదు. కాని - సాక్షాత్తూ భారత హోంమంత్రే పూర్తి భద్రత కల్పిస్తాం, దయచేసి తిరిగిరమ్మంటూ ప్రాధేయపడ్డా రానుపొమ్మని హుస్సేన్ మొరాయిస్తున్నప్పుడు, ఆయన వలసపోవటమే దేశానికి అరిష్టమయినట్టు ఉదార సెక్యులర్ మేధావిగణం గుండెలు బాదుకోవటం ఏ రకమైన మనస్తత్వం?

-సాక్షి

వ్యాఖ్యలు

A related item interms of

A related item interms of biased news/actions
--------------------------------------------
A Pakistan scholar issued a Fatwa against terrorism on 3rd of march in London.
http://www.cnn.com/2010/WORLD/europe/03/03/fatwa.against.terror/index.html

I could not find the news in NDTV website.
But IBN live mentioned it.

Not sure if this news was widely telecasted on that day in news channels.

We can easily observe the way a news is given high/low weightage based on the vested interests of the ppl behind the news channels.

Dear Editor, For ages

Dear Editor,

For ages together, we bragged about our attitude towards the thugs who looted India and raped Indian women (at least since 16th century..) This is nothing but the result of that lack back bone nature.

Today, realizing it and trying to express our anguish is hurting some (look up comments made by few fellow readers).

We are not supporting extremists but need awake and arise and make people like that painter sort of people (of any religion) pee in the pants any time they think of hurting other religion's feelings.

Regards

Seetharam

there is no wrong with mf

there is no wrong with mf hussain's artistic approach but he doesnt know the feeling of devotion towards the Devi , he also doesnt know anything about the feeling of Mother which the Hindus have towards Devi .
the naked beauty which mf hussain knows is not the view which a true devotee of Devi has .The devotee becomes a little baby before Devi ..

its ok if hussain is not a devotee , but he failed to be sensible .and he hasnot cared for the emotions of devotees , what happens when one sees his mom being painted by a devotionally blind person in that way..

the secularists should be asked this question - " would you like to welcome a painter who painted ur mom naked ?"

I know nothing of Islam, but

I know nothing of Islam, but the spelling. Does that entitle me to draw a naked man with a topi on his head and interpret it as Prophet Md?

Regards

Seetharam

Dear Sastry Garu, You are

Dear Sastry Garu,

You are 100% right. Most unfortunate thing is Hindus need to think with cool ming about the events took place in this country for the past 1200 years and if it continues in the same way as to day what will be the future.

We lost our culture, Tradition, wealth and dignity in the hands Moghuls and Britishers, now in the hands of so called Psedo-Secularists and politicians.

If we don't awake and help ourselves, even God cannot help us.

Thanks for your contrinution.
Regards
RD

Really excellant article,

Really excellant article,

ముహమ్మద్ ప్రవక్త కూతురు బొమ్మ

ముహమ్మద్ ప్రవక్త కూతురు బొమ్మ ఒంటి నిండా బట్టలతో వేసి, హిందూ దేవతల బొమ్మలు నగ్నంగా వేసినవాడు ఎలాంటి వాడో మన సూడో సెక్యులరిస్టులకి తెలియదా? తెలిసి తెలిసి నాటకాలు ఆడుతున్నారు ఈ మహనీయులు.

హి౦దూ మూర్ఖత్వ౦

హి౦దూ మూర్ఖత్వ౦ పుట్టడానికి,పెరగడానికి కారణ౦ కుహనా లౌకిక వాదమే. ఉన్మాదమ౦టూ హి౦దూ మత౦లో పుడితే మిగతావారికి పుట్టగతులు౦డవు, దానికి ఎవరి బాధ్యత వారిదేఅవుతు౦ది.

నిజమ్ గా వ్యాస కర్త అభినమ్ద

నిజమ్ గా వ్యాస కర్త అభినమ్ద నీయుదు. ఇలా అలొఛిన్ఛ గలిగిన వరు సమజమ్ లొ ఎన్థ మన్ది? మనసులొ భవలు ఉన్న కుద బయతకు తెలపదనికి ఎన్త మన్ది హిన్దువులు వస్తరు?
హిదువె కాక ప్రఅథి భరథీయుదూ అలొఛిన్ఛ వలసిన విషయము

మీ రాతలు తప్ప అన్ని

మీ రాతలు తప్ప అన్ని ముర్ఖంగానే ఉంటాయి లెండి కత్తి గారు.

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

More information about formatting options

CAPTCHA
This question is for testing whether you are a human visitor and to prevent automated spam submissions.
2 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.

స్వర్ణాక్షరి

జిల్లాలు