S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

04/30/2016 - 22:04

* ఈ రోజుల్లో బాక్సింగ్ పోటీలు పది రౌండ్లను మించవు. ప్రత్యర్థిని మళ్లీ లేవకుండా చిత్తుచేస్తే ‘నాకౌట్’ విజయం దక్కుతుంది. అలాగాక, ఇద్దరూ హోరాహోరీగా పోరాడితే, వారికి న్యాయమూర్తులు ఇచ్చిన పాయింట్ల ఆధారంగా విజేతను ఎంపిక చేస్తారు. అయితే, 1900 సంవత్సరానికి ముందు బాక్సింగ్ ఫైట్స్‌కు ఖచ్చితమైన నిబంధనలు ఉండేవికావు. పందాలుకాసి నిర్వహించే బాక్సింగ్ పోటీలు 100 రౌండ్ల వరకూ జరిగేవి.

04/30/2016 - 22:01

సీల్ హాప్’ లేదా ‘నకుల్ హాప్’ అనే వింత ఆట ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రచారంలో ఉంది. పోటీదారులు రెండు పిడికిళ్లు బిగించాలి. కాలి వేళ్లను కూడా చేతుల మాదిరిగానే వంచాలి. అప్పుడు పిడికిలి బిగించిన చేతులు, కాలివేళ్లు మాత్రమే నేలకు తగులుతుండగా ముందుకు దూకాలి. ఈ విధంగా ఎవరు ఎక్కువ దూరం వెళితే వారిదే గెలుపు. ఎంతో అనుభవం ఉంటేగానీ ఈ ఆటకు ప్రయత్నించకూడదు.

04/23/2016 - 23:46

చరిత్ర మొత్తం యుద్ధాలమయమని, రక్తసిక్తమని అన్నాడో కవి. రాజుల కాలం అంటే ముందుగా గుర్తుకొచ్చేవి యుద్ధాలే. యుద్ధాలంటే శిరస్త్రాణం, కవచాలను ధరించిన వీరులు కళ్ల ముందు మెదులుతారు. పాత, కొత్త రాతి యుగాల్లో రాళ్లే ఆయుధాలైతే, లోహ యుగం ఆరంభం నుంచి కత్తులే ప్రధాన ఆయుధాలయ్యాయి. పరాక్రమానికి ప్రతీకగా కత్తి యుద్ధాన్ని పేర్కోవడం ఆనవాయితీగా మారింది. బాణాలు, శూలాలు, ఇతర ఆయుధాలను దూరం నుంచి ప్రయోగిస్తారు.

04/23/2016 - 23:40

టెస్టు క్రికెట్‌లో వికెట్ వేటలో పడి, ఎక్కువ బంతులు వేసిన బౌలర్ల జాబితాలో ఇంగ్లాండ్‌కు చెందిన లెన్ హాప్‌వుడ్‌ది అగ్రస్థానం. కెరీర్‌లో అతను 1934లో ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌లో రెండు టెస్టులు ఆడి, 462 బంతులు వేసి, ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 38 ఓవర్లు బౌల్ చేసిన అతను 46 పరుగులిచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లు వేసి 16 పరుగులిచ్చాడు.

04/23/2016 - 23:35

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని బోర్డులోని ఒక వర్గం అసంతృప్తితో ఉంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న కారణంగా మనోహర్ కీలక నిర్ణయాలను కూడా ఎవరితోనూ సంప్రదించకుండా తీసుకుంటున్నాని సభ్య సంఘాలు గుర్రుగా ఉన్నాయి.

04/16/2016 - 23:38

ఇ ంగ్లీష్ కౌంటీ క్రికెట్ నిత్యనూతనంగా వర్ధిల్లుతున్నది. 125 వసంతాలను పూర్తి చేసుకున్నప్పటికీ వనె్న తగ్గకుండా అభిమానులను అలరిస్తునే ఉంది. వనే్డ, టి-20 ఫార్మెట్స్ పుట్టుకొచ్చినప్పటికీ నాలుగు రోజుల కౌంటీ క్రికెట్ నేటికీ క్రికెటర్లకు పాఠాలు నేర్పిస్తూ వారిని మేటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతున్నది.

04/16/2016 - 23:34

వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా ఇంగ్లీష్ కౌంటీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. 1994లో ఎడ్జిబాస్టన్‌లో జరిగిన దర్హంతో జరిగిన మ్యాచ్‌లో వార్విక్‌షైర్ తరఫున ఆడిన అతను అజేయంగా 501 పరుగులు సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోనూ ఇదే అత్యధిక స్కోరు. హనీఫ్ మహమ్మద్ 499 పరుగులతో నెలకొల్పిన రికార్డును లారా బద్దలు చేశాడు.

04/16/2016 - 23:29

మొత్తం మీద క్రికెట్ స్వరూపమే మారిపోయింది. కానీ, కౌంటీ క్రికెట్ ఇప్పటికీ ఒక అద్భుత దృశ్యకావ్యంగానే మన కళ్ల ముందు కదలాడుతున్నది. మైదానంలో దిగే ఇరు జట్ల ఆటగాళ్లు తెల్ల దుస్తులే వేసుకుంటారు. సంప్రదాయ సిద్ధంగా ఎర్ర బంతులతోనే మ్యాచ్ ఆడతారు. ఒకప్పుడు కౌంటీ మ్యాచ్‌లను శని, ఆదివారాల్లో కాకుండా వర్కింగ్ డేస్‌లోనే నిర్వహించేవారు. ఆ మ్యాచ్‌లకు అభిమానులు భారీ సంఖ్య లో తరలివచ్చేవాళ్లు.

04/16/2016 - 23:28

మహమ్మద్ అజరుద్దీన్ ఇంగ్లీష్ కౌంటీల్లో ఆడిన భారత ఆటగాళ్లలో ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు సంపాదించాడు. అతను ఎనిమిది శతకాలు సాధించాడు. కాగా, ఎక్కువ అర్ధ శతకాలు ఫరూఖ్ ఇంజనీర్ పేరుమీద ఉన్నాయి. అతను 22 హాఫ్ సెంచరీలు చేశాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు సాధించిన భారతీయుల జాబితాలో నవాబ్ ఆఫ్ పటౌడీ సీనియర్‌ది అగ్రస్థానం. అతని అత్యధిక స్కోరు 231 (నాటౌట్).

04/16/2016 - 23:27

వనే్డ ఇంటర్నేషనల్స్, ట్వంటీ-20 మ్యాచ్‌ల రంగ ప్రవేశంతో ప్రాభవం కోల్పోయి, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న టెస్టు క్రికెట్‌ను బతికించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)తోపాటు వివిధ దేశాల క్రికెట్ బోర్డులు ఈ దిశగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించాలి. ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు తమతమ ప్రతిపాదనలతో టెస్టు క్రికెట్‌కు కొత్త ఊపిరి పోయడానికి ప్రయత్నిస్తున్నారు.

Pages