S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

10/21/2017 - 18:58

వనే్డ క్రికెట్‌లో ఎక్కువసార్లు నాటౌట్‌గా నిలిచిన బ్యాట్స్‌మన్ రికార్డు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీదే. దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ షాన్ పొలాగ్, శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ చామిందా వాస్ 72 ఇన్నింగ్స్‌లో నాటౌట్‌గా ఉండగా, ఆ రికార్డును ధోనీ అధిగమించాడు. వికెట్‌ను కోల్పోకుండా ఇన్ని వనే్డలు ఆడడం అసాధ్యమని చెప్పలేకపోయినా, సులభం మాత్రం కాదు.

10/14/2017 - 19:10

చాలాకాలంగా వాయదాపడుతూ వస్తున్న బిసిసిఐ ప్రక్షాళన అంశం చివరి మజిలీకి చేరింది. లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడంలో తలెత్తుతున్న అవరోధాలను అధిగమించడానికి నిబంధనావళిని సవరించడం ఒక్కటే మార్గమని నిర్ధారణకు వచ్చింది.
తగిన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా బిసిసిఐ అధికారులను అదేశించిన కోర్టు

10/14/2017 - 19:08

నమ్మకస్తుడు కదా అని బాధ్యతను అప్పచెప్తే, నిర్మాణాల నుంచి టికెట్ల వరకూ ఎక్కడబడితే అక్కడ, అందినకాడికి దోచుకున్న ఓ అధికారి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. నిధుల దుర్వినియోగానికి, మోసానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రియో ఒలింపిక్ కమిటీ చైర్మన్ కార్లొస్ నుజ్మన్‌ను బ్రెజిల్ అధికారులు అరెస్టు చేశారు. గత ఏడాది రియో డిజెనీరోలో సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి.

10/14/2017 - 18:49

డక్‌వర్త్ లూయిస్ విధానంపై మళ్లీ విమర్శలు తెరపైకి వచ్చాయి. అసలు ఈ విధానం తనకు ఏమాత్రం అర్థం కావడం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన మొదటి టి-20 మ్యాచ్‌కి సుమారు గంటన్నరపాటు వర్షం కారణంగా ఆటంకం ఏర్పడిన విషయం తెలిసిందే.

10/14/2017 - 18:45

ఈ ఏడాది అత్యుత్తమ అథ్లెట్ అవార్డు కోసం అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) సిద్ధం చేసిన జాబితాలో పురుషుల స్ప్రింట్ డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ జస్టిన్ గాట్లిన్‌కు చోటు దక్కలేదు. లండన్‌లో ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ పురుషుల 100 మీటర్ల పరుగును గాట్లిన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

10/14/2017 - 18:43

అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు ఆర్జించిన స్టార్లు జాతీయ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో, దూకుడుగా ముందుకెళ్లాలని నిర్ణయంచుకున్న భారత బాడ్మింటన్ సంఘం (బాయ్) విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ‘టాప్-50’లో చోటు దక్కించుకున్న వారికి రాబోయే 82వ జాతీయ చాంపియన్‌షిప్స్‌లో నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడే అవకాశం కల్పించాలన్నది ఈ నిర్ణయాల్లో ప్రధానమైనది.

10/14/2017 - 18:37

అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఏడాది వరుసగా మూడేసి సిక్సర్ల చొప్పున నాలుగు పర్యాయాలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా అరుదైన రికార్డు భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య పేరుమీద ఉంది. ఇంగ్లాండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై అతను రెండు పర్యాయాలు వరుసగా మూడేసి సిక్సర్లు కొట్టాడు. శ్రీలంకతో జరిగిన పల్లేకల్ టెస్టులో అదే ఫీట్‌ను పునరావృతం చేశాడు.

10/14/2017 - 18:35

వనే్డల్లో వంద స్టంపింగ్స్ చేసిన ఏకైక వికెట్‌కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ. ఈ ఏడాది శ్రీలంకతో కొలంబోలో జరిగిన వనే్డలో అకిల ధనంజయ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మెరుపు వేగంతో బెయిల్స్‌ను పడగొట్టి, స్టంపింగ్స్ సెంచరీ పూర్తి చేశాడు. ఆడం గిల్‌క్రిస్ట్, మార్క్ బౌచర్ వంటి మేటి కీపర్లకు కూడా అందని స్టంపింగ్స్ సెంచరీ ధోనీ ఖాతాలో చేరింది.

10/14/2017 - 18:33

ఆనందాన్ని ఒకొక్కరూ ఒక్కోరకంగా ప్రదర్శిస్తారు. డాడ్జెర్స్ ఆటగాడు ట్రేస్ థాంప్సన్ అందరికంటే భిన్నంగా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఎన్‌ఎల్ వెస్ట్ టైటిల్ పోరులో శాన్‌ఫ్రాన్సిస్కోను ఓడించి టైటిల్ సాధించిన తర్వాత సహచరుడు ఆస్టిన్ బర్నెస్‌పై షాంపైన్ చల్లడానికి థాంప్సన్ పరుగులు తీశాడు.

10/07/2017 - 19:54

ఇటీవలి కాలంలో యుద్ధ భూములను తలపిస్తున్న క్రికెట్ మైదానాలు ఇకపై అసలు సిసలైన క్రీడా వేదికలుగా దర్శనం ఇవ్వనున్నాయి. క్రికెట్‌లో చోటుచేసుకుంటున్న పెడధోరణులపై కొత్త నిబంధనల ‘గుగ్లీ’ విసిరిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) సమూల మార్పులకు తెరతీసింది. వీటిని పకడ్బందిగా అమలు జరిపితే 3‘జంటిల్మన్ గేమ్’ క్రికెట్ తన ఉనికిని కాపాడుకుంటుంది. భావి తరాలకు అత్యవసరమైన క్రీడాస్ఫూర్తిని అందిస్తుంది.

Pages