S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

04/09/2016 - 23:04

ఐపిఎల్‌లో మొట్టమొదటి మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 2008 ఏప్రిల్ 18న జరిగింది. టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ చెలరేగిపోయింది. బ్రెండన్ మెక్‌కలమ్ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. 73 బంతులు ఎదుర్కొన్న అతను 10 ఫోర్లు, 13 సిక్సర్లతో అజేయంగా 158 పరుగులు సాధించాడు.

04/02/2016 - 19:54

ఆకాశమే హద్దుగా భారత యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ దూసుకుపోతున్నాడు. అద్వితీయ ప్రతిభాపాటవాలతో సంచలనాలు సృష్టిస్తున్నాడు. టెస్టు జట్టు కెప్టెన్‌గా, వనే్డ, టి-20 ఫార్మెట్స్‌లో వైస్ కెప్టెన్‌గా సేవలు అందిస్తున్నాడు. సచిన్ తెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు రాడనుకొని ఆందోళన చెందిన అభిమానులకు కోహ్లీ రూపంలో ఊరట లభించింది.

04/02/2016 - 19:51

రంజీల్లోకి కోహ్లీ 2006లో, తన 19వ ఏట అడుగుపెట్టాడు. కర్నాటకను ఢీకొన్న ఆ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున ఆడిన కోహ్లీ కొండంత విషాదాన్ని తనలోనే దాచుకొని ఇన్నింగ్స్‌ను కొనసాగించడం అందరినీ కలచివేసింది. కర్నాటక తొలి ఇన్నింగ్స్‌లో 446 పరుగుల భారీ స్కోరు సాధిస్తే, అందుకు సమాధానంగా ఢిల్లీ మొదటి ఇన్నింగ్స్‌లో 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో కోహ్లీ బ్యాటింగ్‌కు దిగాడు.

04/02/2016 - 19:49

విరాట్ కోహ్లీ ముద్దు పేరు ‘చిక్కూ’. ఢిల్లీ కోచ్ అజిత్ చౌదరీ పెట్టిన పేరు అది. కోహ్లీ ఒకసారి తలకు నూనె పట్టించి ప్రాక్టీస్‌కు హాజరయ్యాడు. ఎండకు నూనె కరిగి అతని మొహమంతా జిడ్డుగా మారింది. ఆ సమయంలో అతను హిందీ కామిక్ పుస్తకం ‘చంపక్’లో వచ్చే సీనియల్ కథలోని క్యారెక్టర్ ‘చిక్కూ’ మాదిరి కనిపించడంతో చౌదరీ అతనిని అదే పేరుతో సంబోధించాడు.

04/02/2016 - 19:45

కోహ్లీకి కార్లంటే ఇష్టం. వాటిని వేగంగా పరుగులు తీయించడం మరీ ఇష్టం. మైఖేల్ జాక్సన్ స్మృత్యర్థం ప్రదర్శించిన ఒక సినిమా ప్రివ్యూను చూసేందుకు కోహ్లీ ఒక కారులో, ధోనీ, సురేష్ రైనా మరో కారులో బయలుదేరారు. ఎవరు ముందు అక్కడి చేరుకుంటారన్నది చూద్దామంటూ పందేలు వేసుకున్నారు. కానీ, ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన కోహ్లీ అనుకున్న సమయానికి థియేటర్‌కు చేరలేకపోయాడు.

04/02/2016 - 19:43

* చాలా మంది క్రికెటర్లను ఖాళీ సమయంలో ఏం చేస్తారని అడిగితే, సినిమాలు చూస్తామనో, పుస్తకాలు చదువుతామనో చెప్తారు. కానీ, కోహ్లీ మాత్రం తల్లి సరోజ్‌తో కలిసి వంట చేస్తాడు. వివిధ రకాలైన వంటకాలు అతనికి ఇష్టం. అందుకు ఎప్పడు సమయం దొరికినా తల్లి దగ్గర వంట నేర్చుకుంటాడు. తానే సొంతంగా కొన్ని ప్రయోగాలు చేస్తుంటాడు. బ్యాటింగ్‌లోనే కాదు.. వంటలోనూ అతను నంబర్ వనే్న!

04/02/2016 - 19:35

మూడేళ్ల వయసులోనే కోహ్లీ బ్యాట్ పట్టుకున్నాడట. ఈ విషయాన్ని అతనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంత చిన్న వయసులో తాను ఏం చేశాడో తనకే తెలియదని, అయితే, కుటుంబ సభ్యులే బ్యాట్‌తో ఆడడం గురించి చెప్పారని కోహ్లీ అన్నాడు. భవిష్యత్తులో ఏం చేయబోతున్నామనేది బహుశా చిన్నతనంలో మన చేష్టల ద్వారా తెలిసిపోతుందేమోనని వ్యాఖ్యానించాడు. ఏదైతేనేం?

03/27/2016 - 02:45

ఐపిఎల్ 2008 ఏప్రిల్ 18న కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌తో మొదలైంది. మొత్తం 43 రోజులు జరిగిన మొదటి ఐపిఎల్‌లో 59 మ్యాచ్‌లు జరపాలని నిర్ణయించారు. ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో మే 22న జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మిగతా 58 మ్యాచ్‌లు జరిగాయి.

03/27/2016 - 02:42

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వేలంలో ఈసారి ఆస్ట్రేలియా సీనియర్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌కు అత్యధికంగా 9.5 కోట్ల రూపాయలు లభించాయి. భారత ఆటగాడు యువరాజ్ సింగ్‌కు అత్యధిక మొత్తం లభిస్తుందని, అతనే ఈసారి ఐపిఎల్‌లో రికార్డు మొత్తాన్ని పొందుతాడని అందరూ ఊహించినప్పటికీ, అందుకు భిన్నంగా 34 ఏళ్ల వాట్సన్‌కు అత్యధిక ధర పలికింది.

03/27/2016 - 02:40

చాలా మంది స్టార్ క్రికెటర్లకు ఈసారి వేలంలో అవకాశమే దక్కలేదు. అలాంటి వారిలో ఆస్ట్రేలియా టి-20 కెప్టెన్ ఆరోన్ ఫించ్, న్యూజిలాండ్‌కు చెందిన హార్డ్ హిట్టర్ మార్టిన్ గుప్టిల్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జార్జి బెయిలీ, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ హషీం ఆమ్లా, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ఆటగాళ్లు మహేల జయవర్ధనే, మైఖేల్ హస్సీ, బ్రాడ్ హాడిన్ తదితరులు ఉన్నారు.

Pages