S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

01/03/2016 - 07:48

ఇరు జట్లలో టాప్ బౌలర్‌గా ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీని పేర్కోవాలి. అతను 32 వనే్డల్లో 55 వికెట్లు పడగొట్టాడు. కపిల్ దేవ్ 41 మ్యాచ్‌ల్లో 45 వికెట్లు కూల్చి రెండో స్థానంలో ఉన్నాడు. 27 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు పడగొట్టిన మిచెల్ జాన్సన్‌ది ఈ జాబితాలో మూడో స్థానం.
ఉదారుడు వినయ్

01/03/2016 - 07:47

ఈ ఏడాది జనవరి 18న మెల్బోర్న్‌లో జరిగిన వనే్డలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. స్టార్క్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 267 పరుగులు చేసింది. రోహిత్ శర్మ వీరోచిత ఇన్నింగ్స్ ఆడి 138 పరుగులు చేసి, భారత్‌ను ఆదుకున్నాడు. సురేష్ రైనా (51) అర్ధ శతకంతో రాణించగా, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు.

01/03/2016 - 07:51

కామనె్వల్త్ బ్యాంక్ ముక్కోణపు వనే్డ సిరీస్ మొదటి ఫైనల్‌లో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ చెలరేగిపోవడంతో భారత్‌కు ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధ్యమైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. మాథ్యూ హేడెన్ 82 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, మైక్ హస్సీ 45 పరుగులు చేశాడు.

01/03/2016 - 07:50

కళాత్మక ఆటకేగానీ పవర్ ప్లేకు ఏమాత్రం పనికిరాడన్న ముద్ర పడిన హైదరాబాద్ స్టయిలిస్టు బ్యాట్స్‌మన్ వివిఎస్ లక్ష్మణ్ తనదైన రోజున వనే్డల్లోనూ విజృంభించగలనని నిరూపించుకున్న మ్యాచ్ 2004 జనవరి 18న బ్రిస్బేన్‌లో జరిగింది. అతను అజేయంగా 103 పరుగులు చేయగా, సచిన్ తెండూల్కర్ 86, రాహుల్ ద్రవిడ్ 74 పరుగులతో భారత్‌కు అండగా నిలిచారు.

01/03/2016 - 07:44

రవి శాస్ర్తీ స్పిన్ మాయాజాలం ఏమిటో ఆస్ట్రేలియాకు బాగా అర్థమైన మ్యాచ్ 1991 డిసెంబర్ 8న పెర్త్‌లో జరిగింది. ఫాస్ట్ బౌలింగ్‌కు బాగా అనుకూలించే పిచ్‌పై ఆసీస్ బౌలర్లు చెలరేగిపోయారు. అయితే, కృష్ణమాచారి శ్రీకాంత్ ఒంటరి పోరాటాన్ని కొనసాగించి 60 పరుగులు చేయడంతో, భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 208 పరుగుల స్కోరును సాధించగలిగింది.

01/03/2016 - 07:43

భారత జట్టుకు 2008లో ఆస్ట్రేలియా కూడా పాల్గొన్న కామనె్వల్త్ బ్యాంక్ ట్రై సిరీస్‌లో నాయకత్వం వహించిన మహేంద్ర సింగ్ ధోనీ విజయాన్ని అందించాడు. అప్పటి నుంచి ఇంత వరకూ అతను ఆస్ట్రేలియాపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఏడాది కాలంలోనే భారత జట్టు రెండోసారి ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. 2014-15 సీజన్‌లో, వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు చాలా ముందుగానే భారత జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది.

12/26/2015 - 22:15

సానియా మీర్జా టెన్నిస్‌లో ‘నంబర్ వన్’గా ఎదిగిన సంవత్సరమిది. మన దేశం తరఫున మహిళల డబుల్స్ విభాగంలో గ్రాండ్ శ్లామ్ టైటిల్ సాధించిన తొలి టెన్నిస్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. అంతేగాక, మహిళల డబుల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని అధిరోహించింది.

12/26/2015 - 22:14

ఈ ఏడాది భారత క్రీడా రంగంలో చెప్పుకోదగ్గ విజయాలను సాధించి,దేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేసిన ఘనత ఇద్దరు హైదరాబాదీలకు దక్కుతుంది. ఒకరు బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కాగా, మరొకరు టెన్నిస్ బ్యూటీ సానియా మీర్జా. వివిధ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రీడాకారుల్లో సగానికిపైగా హైదరాబాదీలే కావడం విశేషం.

12/26/2015 - 22:11

ఫార్ములా వన్ రేస్‌లో లూయిస్ హామిల్టన్ వరుసగా మూడోసారి ప్రపంచ నంబర్ వన్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. మెర్సిడిజ్‌కు ప్రాతిథ్యం వహిస్తున్న ఈ 30 ఏళ్ల బ్రిటిషర్ తన జట్టుకే చెందిన నికో రోజ్‌బెర్గ్‌ను పలు రేసుల్లో ఉద్దేశపూర్వకంగా ఓడించే ప్రయత్నం చేయడం, క్రీడాస్ఫూర్తికి, యాజమాన్యం ఇచ్చిన సూచనలకు భిన్నంగా ప్రవర్తించడం వివాదానికి కారణమైంది.

12/26/2015 - 22:10

ఈఏడాది భారత బాక్సర్లు కొత్త పుంతలు తొక్కారు. కానీ, బాక్సింగ్ సమాఖ్య సస్పెన్షన్‌కు గురై పరువు కోల్పోయింది. ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ అనూహ్యంగా ప్రొఫెషనల్ బాక్సర్‌గా అవతారం ఎత్తడం భారత బాక్సింగ్ చరిత్రలో కొత్త అధ్యాయం. ప్రొఫెషనల్ బాక్సర్‌గా అతను మొదటి మూడు ఫైట్స్‌లోనూ విజయాలను సాధించి హ్యాట్రిక్ నమోదు చేయడం విశేషం.

Pages