S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

12/20/2015 - 04:10

* లాస్ వెగాస్: యుఎఫ్‌సి 194 ఫెదర్‌వెయిట్ టైటిల్‌ను కానర్ మెక్‌గ్రెగర్ గెల్చుకున్నాడు. అందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేకపోయినా, జోస్ ఆల్డోను అతను కేవలం 13 సెకన్లలో నాకౌట్ చేయడం విశేషమే. ప్రేక్షకులు ఇంకా కుర్చీల్లో సరిగ్గా కూర్చోక ముందే, ఫైటర్లు రింగ్‌లోకి అడుగుపెట్టినందుకు కొడుతున్న కేరింతల నుంచి స్టేడియం కోలుకోకముందే ఫైట్ ముగిసింది.

12/20/2015 - 04:08

అజేయుడిగా కెరీర్ నుంచి వైదొలగిన ఫ్లోయిడ్ మేవెదర్ ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రపంచ యాత్ర చేస్తున్నాడు. వివిధ దేశాలను తిరుగుతూ, అక్కడి చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తూ ఆనందిస్తున్నాడు. వ్యక్తిగత సహాయకురాలు కిచీతో కలిసి ఇటీవలే రోమ్‌ను సందర్శించిన అతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి చేరుకున్నాడు. అక్కడ అరబ్ షేక్ దుస్తులు వేసుకొని, వారిలో ఒకడిగా కలిసిపోయాడు.

12/20/2015 - 04:07

భారత జాతీయ సెలక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారన్నది నిన్నమొన్నటి విమర్శకాదు. ఒక రకంగా మన దేశంలో ఇది అనాదిగా వస్తున్న ఆచారం. చాలా మంది ఆటగాళ్లను వివిధ టూర్లకు తీసుకెళ్లడం, వారితో ఒక్క మ్యాచ్‌ని కూడా ఆడించకుండానే ఉద్వాసన పలకడం భారత సెలక్టర్ల అలవాటు. అసమాన ప్రతిభతో రాణించినప్పటికీ ఎన్నోసార్లు ఉద్వాసనకు గురైన మొహీందర్ అమర్‌నాథ్ కడుపుమండి సెలక్టర్లను ‘జోకర్ల గుంపు’గా అభివర్ణించాడు.

12/20/2015 - 04:07

భారత క్రికెట్‌లో బౌలింగ్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది స్పిన్. ప్రపంచానికి స్పిన్ బౌలింగ్ బలాన్ని పరిచయం చేసిన ఘనత భారత్‌కే దక్కుతుంది. ఎంతో మంది మేటి స్పిన్నర్లను మన దేశం క్రికెట్‌కు అందించింది. 1970 దశకంలో ఎర్రాపల్లి ప్రసన్న, భగవత్ చంద్రశేఖర్, బిషన్ సింగ్ బేడీ భారత స్పిన్ సామర్థ్యాన్ని టెస్టు క్రికెట్ ఆడే దేశాలకు రుచి చూపించారు. వీరిని ఎదుర్కోవడానికి మేటి బ్యాట్స్‌మెన్ కూడా భయపడేవారు.

12/12/2015 - 21:55

జిడ్డు బ్యాటింగ్‌తో బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టే బ్యాట్స్‌మెన్ చాలా మందే కనిపిస్తారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జెఫ్ బాయ్‌కాట్‌ను ఈ విషయంలో నంబర్‌వన్‌గా పేర్కొంటారు. కానీ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో అతని కంటే ఘనుడు. 1983-84 సీజన్‌లో శ్రీలంకతో కొలంబోలో జరిగిన టెస్టులో అతను చివరి రోజు రెండో సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసి, కేవలం నాలుగు పరుగులు చేశాడు.

12/12/2015 - 21:48

సాకర్, రగ్బీ వంటి క్రీడలకు పరిమితమైన వీరాభిమానం ఇప్పుడు క్రికెట్‌కు కూడా వ్యాపించింది. అయితే, చాలా దేశాల్లో జట్లకు అభిమానులుంటే, మన దేశంలో ఆటగాళ్లకు ఉన్నారు. క్రికెట్‌లో బ్యాటింగ్ అంటే ముందుగా ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ గుర్తుకొస్తాడు. సచిన్‌కు వచ్చినంత పేరు ప్రఖ్యాతుల్ని అతని వీరాభిమాని సుధీర్ గౌతం చౌదరి కూడా సంపాదించుకోవడం విశేషం.

12/12/2015 - 21:47

సమర్థులైనప్పటికీ వివిధ కారణాలతో ఒక దేశాన్ని విడిచి మరో దేశంలో ఆశ్రయం పొందిన శరణార్థులకు కూడా ఇకపై ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత లభిస్తుంది. ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి) చీఫ్ థామస్ బాచ్ ప్రకటించాడు.

12/12/2015 - 21:40

అవినీతి, అధికార దుర్వినియోగం, భారీగా ముడుపులు చేతులు మారడం వంటి అభియోగాలపై ఫిఫా సీనియర్ ఉపాధ్యక్షుడు ఇసా హయాటౌ (కామెరూన్) సహా మొత్తం 14 మందిని జ్యూరిచ్ పోలీసులు అరెస్టు చేశారు.

12/12/2015 - 21:38

అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అవినీతి ఊబిలో కూరుకుపోయి అల్లాడుతున్నది. తీగ లాగితే డొంక కదిలిన రీతిలో ఒక్కొక్కరిగా బయటపడుతున్న అవినీతిపరుల జాబితా రోజురోజుకూ పెరుగుతున్నది. అధ్యక్షుడు సెప్ బ్లాటర్, ఉపాధ్యక్షులు చుంగ్ మాంగ్ జూన్, మైఖేల్ ప్లాటినీ, ప్రధాన కార్యదర్శి జేరోమ్ వాల్కేపై ఇప్పటికే అవినీతి ఆరోపణల నేపథ్యంలో వేటు పడింది.

12/12/2015 - 21:37

అక్రమాలు, అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈక్వెడార్ ఫుట్‌బాల్ సమాఖ్య చీఫ్ లూయిస్ చిరిబొగా స్థానిక కోర్టులో లొంగిపోయాడు. దక్షిణ అమెరికా కానె్ఫడరేషన్ కార్యవర్గ సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్న అతని పేరు అమెరికా తాజాగా ప్రకటించిన నిందితుల జాబితాలో ఉంది.

Pages