S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

12/02/2017 - 18:00

లెజెండరీ క్రికెటర్’ సచిన్ తెండూల్కర్ నెలకొల్పిన రికార్డులకు అంతేలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, క్రికెట్‌లో బ్యాటింగ్ రికార్డులన్నీ అతనివే. ఇప్పటివరకూ వనే్డ ఇంటర్నేషనల్స్‌లో ఆడే అవకాశం వచ్చిన క్రికెటర్లలో 99 శాతం మంది సచిన్ సాధించిన పరుగుల్లో సగానికి కూడా చేరలేదంటే, అతని బ్యాటింగ్ ఘనతను ఊహించుకోవచ్చు. దటీజ్ సచిన్.

12/02/2017 - 17:58

ఒక దేశంలో జన్మించి, మరో దేశం తరఫున క్రికెట్ ఆడినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. రెండు వేర్వేరు దేశాలకు ప్రాతినిథ్యం వహించినవారు కూడా లేకపోలేదు. అయితే, పుట్టిన దేశంతో సంబంధం లేకుండా, రెండు దేశాల తరఫున ఆడిన ఏకైక క్రికెటర్ జాన్ క్రైకోస్. ఈజిప్టులో పుట్టిన అతను మొదట దక్షిణాఫ్రికా, ఆతర్వాత జింబాబ్వే తరఫున టెస్టు క్రికెట్ ఆడాడు.

12/02/2017 - 17:56

ఇంగ్లాండ్ స్పిన్నర్ జిమ్ లేకర్ ఒక ఇన్నింగ్స్‌లో పది, ఒకే టెస్టులో మొత్తం 19 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రికార్డు పుస్తకాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించాడు. 1956లో ఆస్ట్రేలియాతో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు సాధించాడు. మిగిలిన ఒక్క వికెట్ టోనీ లాక్ ఖాతాలోకి వెళ్లింది. రెండో ఇన్నింగ్స్‌లో లేకర్ మొత్తం 10 వికెట్లను కూల్చగలిగాడు.

11/25/2017 - 19:42

భారత క్రికెట్‌కు మంచి రోజులు రాబోతున్నాయా? లేక ఎప్పటి మాదిరిగానే మార్పులకు బ్రేక్ పడుతుందా? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుంది. బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం వచ్చేనెల 9న జరగనున్న నేపథ్యంలో, ఫలితం ఏ విధంగా ఉంటుందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నది. సుమారు నాలుగేళ్లుగా నానుతున్న వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చి, ఉత్కంఠను పెంచుతున్నది.

11/25/2017 - 19:39

భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు రామచంద్రన్ వేసిన అద్భుతమైన ఎత్తును అతని ప్రత్యర్థులు చిత్తుచేశారు. ఫలితంగా డిసెంబర్ 14న జరిగే ఎన్నికల్లో ఐఒఎ అధ్యక్ష పదవికి పోటీ చేయడం లేదంటూ అతను ప్రకటించాల్సి వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)లో వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడి, చివరికి అధ్యక్ష పదవి నుంచి వైదొలగాల్సి వచ్చిన శ్రీనివాసన్‌కు రామచంద్రన్ స్వయానా తమ్ముడు.

11/25/2017 - 19:36

చీఫ్ కోచ్ డిడియర్ డెస్‌చాంప్స్‌తో సయోధ్య ప్రసక్తే లేదని, అతనితో ఇకపై చర్చలు జరపబోనని ఫ్రెంచ్ లెజెండరీ ఫుట్‌బాలర్ కరీం బెంజిమా తేల్చిచెప్పాడు. రియల్ మాడ్రిడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బెంజిమా ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడన్న ఆరోపణలపై కేసును ఎదుర్కొంటున్నాడు. దీనిని డెస్‌చాంప్స్ తీవ్రంగా పరిగణించి, అతనితో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నాడు.

11/25/2017 - 19:31

ప్రపంచ ఫార్ములా వన్ చాంపియన్ లూయిస్ హామిల్టన్‌ను కేవలం డ్రైవర్‌గానే తెలిసిన చాలా మందికి అతని ఔదార్యం ఆశ్చర్యం కలిగిస్తున్నది. రేసు కార్లను మెరుపు వేగంతో దూకించే అతను ఇటీవలే పెరూలోని హుయ్నా పిచు పర్వతాన్ని తన స్నేహితులు, సన్నిహితులతో కలిసి అధిరోహించాడు. వీపుకు ఓ బాలుడ్ని కట్టుకొని మరీ అతను ఈ ఫీట్‌ను పూర్తి చేయడం చాలా మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది.

11/25/2017 - 19:29

హంగరీ షూటర్ కారొలీ టకాక్స్‌ను అసాధారణ ప్రతిభావంతుడిగా చెప్పుకోవాలి. 1938లో జరిగిన ఓ ప్రమాదంలో అతను కుడి చేతిని కోల్పోయాడు. పాఠశాలకు వెళ్లే రోజుల్లో ఎడమ చేత్తోనే షూటింగ్ ప్రాక్టీస్ చేశాడు. గురువు లేకుండా కేవలం తనకు ఉన్న శ్రద్ధతో అతను ఎదిగాడు. 1948, 1952 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. 1904లో జార్జి ఐసర్ తర్వాత ఒలింపిక్స్‌లో పాల్గొన్న వికలాంగుడు అతనే.

11/25/2017 - 19:28

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) వనే్డ ప్రపంచ ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్స్ విభాగంలో అగ్రస్థానాన్ని ఆక్రమించిన పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ హఫీజ్‌కు బౌలింగ్ అచ్చిరావడం లేదు. అతని బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉందని ఆరోపణలు రావడంతో, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ అతను బౌలింగ్ చేయడానికి వీల్లేదని ఐసిసి ఆదేశించింది.

11/18/2017 - 18:29

ప్రస్తుతం ‘యాషెస్’ కప్పు ఇంగ్లాండ్ వద్ద ఉంది. ఈ నెల 23 నుంచి జనవరి 8వ తేదీ వరకూ ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్‌లో టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి ఇంగ్లాండ్ సమాయాత్తమైంది. గత పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆస్ట్రేలియా కత్తులు దూస్తున్నది. సాధారణ పరిస్థితుల్లో ఆసీస్‌ను హాట్ ఫేవరిట్‌గా పేర్కోవాలి. అంతేగాక, స్వదేశంలో ఆడడం ఆ జట్టుకు అదనపు బలం.

Pages