S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

11/18/2017 - 18:28

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల యాషెస్ సిరీస్ శత్రుత్వం కేవలం పురుషుల విభాగానికి మాత్రమే పరిమితం కాలేదు. మహిళల యాషెస్ కూడా అదే స్థాయిలో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. 1934 నుంచి జరుగుతున్న యాషెస్ సిరీస్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు సరికొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు.

11/18/2017 - 18:26

ఆస్ట్రేలియా జట్టు 1882లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లి ‘ది ఓవల్’ మైదానంలో ఏకైక టెస్టు ఆడింది. మూడు రోజుల ఆ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఆగస్టు 28, 29 తేదీల్లో జరిగిన ఓవల్ టెస్టు ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ సిరీస్‌కు కారణమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 80 ఓవర్లు ఆడి తొలి ఇన్నింగ్స్‌లో 63 పరుగులకే కుప్పకూలింది.

11/18/2017 - 18:24

యాషెస్ సిరీస్ నిజమైన మొనగాడు సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్. ఆస్ట్రేలియాకు కొండంత అండగా నిలిచిన అతను యాషెస్‌లో నెలకొల్పిన కొన్ని రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదంటే, అతని ప్రతిభాపాటవాలను ఊహించుకోవచ్చు. యాషెస్‌లో అత్యధిక పరుగులు (5,028), అత్యధిక శతకాలు (19), అత్యధిక అర్ధ శతకాలు (31), ఒక సిరీస్‌లో ఎక్కువ పరుగులు (974), అత్యుత్తమ భాగస్వామ్యం (451) వంటి బ్రాడ్‌మన్ రికార్డులను ఎవరూ ఛేదించలేకపోతున్నారు.

11/18/2017 - 18:22

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 69 సిరీస్‌లు జరగ్గా, రెండు జట్లు చెరి 32 సిరీస్‌లను కైవసం చేసుకున్నాయి. ఐదు సిరీస్‌లు డ్రా అయ్యాయి. సమవుజ్జీలుగా నిలుస్తున్న ఈ జట్లు తాజా యాషెస్‌లో హోరాహోరీగా పోరాడడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇలావుంటే, మ్యాచ్‌ల విషయానికి వస్తే, రెండు జట్లు 325 మ్యాచ్‌లు ఆడాయి. ఆస్ట్రేలియా 130, ఇంగ్లాండ్ 106 టెస్టులను గెల్చుకున్నాయి.

11/18/2017 - 18:21

యాషెస్‌లో ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్ షేన్ వార్న్. అతను 36 మ్యాచ్‌ల్లో 195 వికెట్లు పడగొట్టాడు. గ్లేన్ మెక్‌గ్రాత్ 157, హ్యూజ్ ట్రంబెల్ 141 వికెట్లతో ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు. కాగా, వికెట్ల సెంచరీ పూర్తిచేసిన బౌర్లు మరో 14 మంది ఉన్నారు.

11/18/2017 - 18:19

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు 1982లో టెస్టు సిరీస్ తలపడినప్పుడు, రెండు వేర్వేరు పిచ్‌లపై ఆడేందుకు ఇరు జట్లు అంగీకరించాయి. ఈ విధంగా ఒక్కో ఇన్నింగ్స్ ఒక్కో పిచ్‌పై ఆడితే, మ్యాచ్ తీరును అర్థం చేసుకోవడం అసాధ్యమవుతుంది. ఆటగాళ్లకు కూడా ఈ విధానం ఇబ్బంది కరంగా మారుతుంది. అందుకే, రెండు పిచ్‌ల విధానాన్ని నిషేధించారు. అంతకుముందుగానీ, ఆ తర్వాతగానీ ఒక టెస్టును రెండు పిచ్‌లపై ఆడించడం జరగలేదు.

11/18/2017 - 18:17

సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ ఆస్ట్రేలియాలోనేగాక, ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో ఎన్నో రికార్డులు అతని ఖాతాలో చేరాయి. అయితే, బీర్లు తాగడంలో డేవిడ్ బూన్ నెలకొల్పిన రికార్డును ఎవరూ ఛేదించలేకపోతున్నారు. 1980 దశంలో ఆసీస్ జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా సేవలు అందించిన బూన్‌కు బీర్లంటే ఎంతో ఇష్టం.

11/18/2017 - 18:15

బాడీలైన్’ వ్యూహంలో భాగస్వామినైనందుకు ఇంగ్లాండ్ పేసర్ హరాల్డ్ లార్‌వుడ్ ఎంతో బాధపడ్డాడు. కెప్టెన్ డగ్లస్ జార్డిన్ ఆదేశాల మేరకే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ శరీరాలే లక్ష్యంగా బంతులు వేసిన అతను ఆ తర్వాత చాలా సందర్భాల్లో తాను తప్పు చేశానని వాపోయాడు. అంతేకాదు, ఆ టూర్ తర్వాత మళ్లీ అతను ఇంగ్లాండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించలేదు.. అసలు ఇంగ్లాండ్‌లోనే ఉండలేదు..

11/18/2017 - 18:13

యాషెస్ సిరీస్‌లో ఆడిన వారిలో ఎక్కువ వయసున్న ఆటగాడిగా జేమ్స్ సదర్టన్ రికార్డు నెలకొల్పాడు. 1877లో ఆస్ట్రేలియాపై ఆడినప్పుడు అతని వయసు 49 సంవత్సరాలు. ఆ రికార్డు ఇంతవరకూ ఎవరూ బద్దలు చేయలేకపోయారు.

11/18/2017 - 18:12

యాషెస్‌లో కెప్టెన్‌గా ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన వారి జాబితాలో అగ్రస్థానం అలాన్ బార్డర్‌కు దక్కుతుంది. అతను 28 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాకు సారథ్యం వహించాడు. ఆర్చీ మెక్‌లారెన్ (ఇంగ్లాండ్) 22 టెస్టులతో రెండో స్థానంలో ఉండగా, ఆసీస్‌కు చెందిన డాన్ బ్రాడ్‌మన్, రికీ పాంటింగ్ చెరి 19 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ వహించి, సంయుక్తంగా మూడో స్థానాన్ని పంచుకుంటున్నారు.

Pages