S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

01/10/2018 - 19:59

సార్వత్రిక ఎన్నికల సందడి అప్పుడే దక్షిణాది రాష్ట్రాల్లో మొదలైంది. వచ్చే ఏడాది జూన్‌లోగా సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎప్పుడు జరుగుతాయో తెలియకున్నా అన్ని రాజకీయ పార్టీలూ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. అందరి దృష్టీ దక్షిణాది రాష్ట్రాలపై పడింది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తన బలాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో పెంచుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది.

01/10/2018 - 19:56

తెలంగాణ రాజకీయాల్లో తమిళనాడు తరహా సినిమారంగం ప్రభావం ఉండే అవకాశం లేదు. ఇక్కడి జనానికి సినిమా పిచ్చిగాని, సినిమా తారలను నెత్తిన ఎక్కించుకోవాలన్న యావగానీ లేదు. సినిమాలను కేవలం ఎంటర్‌టైన్‌కోసం మాత్రమే చూస్తారు. సినిమాల్లో నటించేవారు కానీ, సినిమా రంగంతో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా సంబంధాలు ఉన్నవారికి కాని పరిపాలనాపరమైన పగ్గాలు ఇవ్వాలన్న కాంక్షలేదు.

01/10/2018 - 19:56

తమిళనాడు తరహాలో రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పరాభవం తప్పదు. తమిళనాడులో తాజాగా జరిగిన ఉప ఎన్నికలో ఓటర్లు ఇచ్చిన తీర్పు దేశంలో అందరినీ ఆలోచింపజేసేలా ఉంది. అధికారమదంతో ఉండేవారికి ఓ గుణపాఠం లాంటి తీర్పు ప్రజలు ఇవ్వబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే పాలనతో ప్రజలు విసుగు చెందారు. అదేవిధంగా తెలంగాణలో కుటుంబ పాలనతో ప్రజలు బేజారెత్తారు.

01/10/2018 - 19:55

దేశంలో ప్రజలు అంతా బీజేపీనే విశ్వసిస్తున్నారు. స్వాతంత్య్రానంతరం దేశంలో ఎలాంటి అవినీతి మరక అంటని రీతిలో బీజేపీ పాలన అందించింది. దేశంలో చిట్టచివరి పేదవాడికి సైతం కేంద్ర ప్రభుత్వ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను దేశ ప్రజలు కొనియాడుతున్నారు. మరోపక్క తెలంగాణ, ఆంధ్రాలో సైతం బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టనున్నారు.

01/10/2018 - 19:55

దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తృతీయ ఫ్రంట్‌కు ఆస్కారం లేదు. ఇక్కడ నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. తమిళనాడులో తృతీయ ఫ్రంట్ ప్రయోగాలు ఘోరంగా విఫలమయ్యాయి. కర్నాటక కూడ అంతే. కేరళలో మొదటి నుంచీ వామపక్ష కూటమి, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య కూటమి మధ్యనే పోటీ కేంద్రీకృతమై ఉంటుంది.

01/10/2018 - 19:54

మరో ఏడాదిలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండటంతో ఆంధ్ర, తెలంగాణాలో వివిధ పార్టీలు పటిష్ఠం చేసుకునే పనిలో పడ్డాయి. రానున్న కాలంలో రాజకీయాల్లో పలు కీలక మార్పులు జరగనున్నాయి. ఆంధ్రలో వైకాపాను బలోపేతం చేసేందుకు బూత్ కమిటీ స్థాయిలో కన్వీనర్లకు శిక్షణనిస్తున్నాం. ఎన్నికల నిర్వహణలో బూత్ కమిటీలు కీలకపాత్ర వహిస్తాయ. గత ఎన్నికల్లో టీడీపీకి, వైకాపాకు ఓట్ల వ్యత్యాసం 5 లక్షలు.

01/10/2018 - 19:54

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు తెలంగాణలోనూ దూసుకెళుతున్నాం. 1982 సంవత్సరంలో ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించినప్పుడు, మేకప్ వేసుకునే వ్యక్తి రాజకీయాల్లోకి రావడమా!? అంటూ కొంత మంది అపహాస్యం చేశారు. కానీ పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలకే అంటే 1983 జనవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి మోగించింది.

01/10/2018 - 19:53

ఆకాంక్షలు నెరవేర్చే పార్టీలకే ప్రజలు పట్టం కడతారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో టిఆర్‌ఎస్‌లకే అవకాశం ఉంది. ఆయా పార్టీలు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమేగాక, ఎన్నికల ప్రణాళికలో లేని హామీలను సైతం నేరవేరుస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రావాల్సి ఉంది. కాని ఈ ఏడాది నవంబర్‌లో కూడా ముందస్తు ఎన్నికలు జరుగుతాయని మీడియా చెబుతోంది.

01/03/2018 - 19:36

ఆర్ధిక, శాస్త్ర సాంకేతిక, సంప్రదాయ వనరులతో ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదిగే సామర్థ్యం ఉన్న భారతదేశాన్ని చూస్తే పొరుగు దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. సరిహద్దుల్లో చికాకులు కలిగించడమేగాక, ఉగ్రవాదులను రెచ్చగొట్టి, విచ్ఛిన్నకర శక్తులను దేశంలోకి అక్రమంగా పంపిస్తూ భారత్‌ను ఉక్కిరిబిక్కిరి చేయాలనే దురుద్దేశాన్ని ప్రదర్శిస్తున్న దేశాల్లో పాకిస్తాన్‌దే అగ్రస్థానం.

01/03/2018 - 19:35

భారత్-పాకిస్తాన్ ప్రజల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు. రాజకీయ అవసరాలకోసమే పాలకులు రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచి పోషిస్తున్నారు. మతపరమైన రాజకీయాలవల్ల రెండు దేశాల మధ్య ద్వేషం పెరుగుతోందే తప్ప సాంస్కృతిక, సాంప్రదాయాల ప్రకారం ఎలాంటి విభేదాలు లేవు. రెండు దేశాల మధ్య శత్రుత్వం ఏర్పడేందుకు చారిత్రక కారణాలున్నాయి.

Pages