S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

01/06/2016 - 23:03

పంజాబ్ పఠాన్‌కోట్‌పై జరిగిన ఉగ్రవాద దాడి హేయమైనదని, ఉగ్రవాదాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేయాలని, అదే సమయంలో పాకిస్తాన్‌తో శాంతి చర్చలకు విఘాతం కలగకుండా భారతదేశం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు మనం చర్చలనుంచి వైదొలిగితే, భారత్, పాకిస్తాన్ భవిష్యత్తుని ఇక ఉగ్రవాద బృందాలు నిర్ణయించడం మొదలుపెడతాయి. చర్చలను భగ్నం చేసేందుకు ఉగ్రవాదులు దాడి చేశారు.

01/06/2016 - 23:03

దేశ భద్రత కాంగ్రెస్‌తోనే సాధ్యం. బిజెపి ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మతఛాందసవాదులు రెచ్చిపోతుంటారు. లోగడకూడా వాజ్‌పేయ ప్రధానిగా ఉన్నప్పుడు పార్లమెంటుపై ముష్కరుల దాడి జరిగింది. దేశ అంతర్గత భద్రత గురించి బిజెపి అగ్ర నాయకులు చాలా పెద్ద మాటలు చెబుతుంటారు. ఆచరణకు వచ్చేసరికి మాత్రం చేతులు పైకి ఎత్తేస్తారు.

01/06/2016 - 23:01

పఠాన్‌కోట్‌పై పాక్ ముష్కరులు దాడులు జరపడం దురదృష్టకరం. రెండు దేశాల పాలకులు సంయమనంతో ఉండాలి అయితే పాక్ సైన్యం రాజకీయాలను శాసిస్తోంది. అందుకే దాడులు జరుగుతున్నాయి. మన దేశం ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుతున్నది. ఆ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ అడుగులు వేస్తూ, ఇదివరకే వివిధ దేశాల్లో పర్యటించారు. పాకిస్తాన్‌తోనూ మైత్రి కొనసాగేందుకు ప్రధాని మోదీ ముందడుగు వేశారు.

01/06/2016 - 23:00

ఇండియాకు పాకిస్తాన్‌కు ఒకే రోజు స్వాతంత్య్రం లభించింది. ఇండియాలో ప్రజాస్వామ్యం బలపడగా, పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం అనేది నామమాత్రమే, ఇంకా మిలట్రీ ఆధిపత్యమే. భారత్, పాక్ మధ్య స్నేహ సంబంధాలు బలపడడం పాకిస్తాన్ సైన్యానికి ఇష్టం లేదు. ఉగ్రవాదులకు ఇష్టం లేదు. దీనిలో భాగంగానే పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల దాడులు.

01/06/2016 - 22:59

మన దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖ డొల్లతనం పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడి బయటపెట్టింది. ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడికి దిగినా సమర్థవంతంగా ఎదుర్కొని నష్టం జరగకుండా రక్షణ దళాలు చూడగలిగారు. అయితే అసలు ఉగ్రవాదులు దాడికి దిగుతున్న విషయాన్ని ముందే పసిగట్టి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. రక్షణ వ్యవస్థలో ఉన్న లొసుగులను నివారిస్తే మంచిది.

01/06/2016 - 22:58

ఓ మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దటంలో ‘్భయం’ కీలకపాత్ర వహిస్తుంది. అది భౌతికపరమైన భయం కావచ్చు లేదా ఆధ్యాత్మికపరమైన భయం కావచ్చు. భౌతికపరమైన భయం కంటే కూడా ఆధ్యాత్మికపరమైన భయం ఎంతో తీవ్రతరంగా భావించాల్సి వుంటుంది. భౌతికపరమైన భయాలన్నీ కూడా ప్రస్తుత జీవనానికి సంబంధించినవి. ఆధ్యాత్మిక భయాలు మాత్రం సెంటిమెంట్‌తో కూడినవి.

01/06/2016 - 22:57

మతోన్మాదం పెచ్చరిల్లటం, పార్లమెంటరీ వ్యవస్థ సవ్యంగా పనిచేయక పోవటం వల్ల పాకిస్తాన్‌లో తీవ్రవాదం అధికమైంది. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ వైపు ఎక్కువ మంది సైనికులు వెళ్లారు. భారతదేశంలో మాత్రం పార్లమెంటరీ వ్యవస్థ బలంగా ఉన్న కారణంగా నష్టం తక్కువ స్థాయిలో ఉంది. పాకిస్తాన్‌లో పార్లమెంటరీ వ్యవస్థ దెబ్బతినటంతో పలుమార్లు సైనికుల వశమై పాలన వారి చేతుల్లో కొనసాగింది.

01/06/2016 - 22:56

మత ఛాందసవాదం హద్దులు మీరుతోంది. ఈ కారణంగానే మత ఉగ్రవాదం పుట్టుకొచ్చింది. ఇది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. ఎన్నో ఏళ్లనుంచి చాపకింద నీరులా విస్తరిస్తూ వచ్చింది. కాబట్టి దీన్ని ఒక్కసారిగా తుదముట్టించడం అంత సులువు కాదు. అత్యంత పటిష్టమైన భద్రత ఉన్న పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడికి దిగారంటే ఇది చాలా తీవ్రంగా పరిగణించాలి. ఇందుకు కారణం చాలావరకు అమెరికా సామ్రాజ్యవాద శక్తులే.

12/31/2015 - 00:07

విదేశీ కొలువు... లక్షల్లో వేతనాలు... సగటు భారతీయ విద్యార్థి ఆలోచిస్తున్నది ఇదే. బిటెక్ లేదా ఎంబిబిఎస్ లేదా సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు పిజి చదువులు విదేశాల్లో చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ కారణంగానే విదేశాలకు వెళుతున్న భారతీయ యువత సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎక్కువ మంది ఉత్తర అమెరికా, యూరప్ దేశాలకే వెళ్తున్నారు.

12/31/2015 - 00:04

ఉన్నత విద్య కోసం అమెరికా వంటి సంపన్న దేశాలకు వెళ్లి అక్కడ విద్యార్థులు ఇబ్బందులెదుర్కొవటం కేవలం భారత్, అమెరికా దేశాలకు సంబంధించింది మాత్రమే కాదు. ఇదో గ్లోబల్ సమస్య. భారత్ నుంచి ప్రతి సంవత్సరం 12వేల మంది, చైనా నుంచి మరో 12వేల మంది విద్యార్థులు అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ వంటి పాశ్చాత్య దేశాలకు వెళ్తున్నారు.

Pages