S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

12/31/2015 - 00:03

విదేశీ వ్యామోహం రానురానూ వెర్రితలలు వేస్తోంది. తమ పిల్లలు విదేశాలకు వెళ్తేనే బాగా చదువుకున్నట్టుగా తల్లిదండ్రులు చాలామటుకు తప్పుడు అభిప్రాయంలో పడి కొట్టుకుపోతున్నారు. తమ పిల్లలను విదేశాలకు పంపితేనే గొప్ప అనే తత్వం తల్లిదండ్రుల మనస్సులోంచి పోవాలి. ఉన్నత విద్య చదువుకునే పేరిట విద్యార్థులు అక్కడ ఎన్ని అగచాట్లు పడుతున్నారో తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.

12/31/2015 - 00:02

భారత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడం మంచి పరిణామమే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ ఉన్నత విద్యా ప్రమాణాలు తగ్గాయి. విదేశాల్లో మునుపటి రోజుల్లోగా యూనివర్సిటీలు లేవు. పేదోళ్లను సహితం దృష్టిలో పెట్టుకొని ఫీజులు నిర్ణయించేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కారణం.. యూనివర్సిటీలు పెరగడం, విద్యార్థుల సంఖ్య పెరగడమే. దీంతో విదేశాల్లో విలువలతో కూడిన విద్య లభించడం లేదనిపిస్తోంది.

12/31/2015 - 00:01

అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి మన విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు వారు తొలుత ఐ 20 ఇస్తారు. ఆ తరువాత వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే అమెరికా చదువుకు భరించే ఆర్థిక స్థోమత ఉందా? లేదా? అనే అంశాలన్నీ పరిశీలించి వీసా మంజూరు చేస్తారు. వీసా మంజూరు చేసిన తరువాత కూడా ఏవో కుంటి సాకులు చెబుతూ కొందరు విద్యార్థులను అమెరికా విమానాశ్రయం నుంచి తిప్పి పంపడంలో అమెరికా చర్య ఏ మాత్రం సరైనది కాదు.

12/31/2015 - 00:00

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్న విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటుచేయాలి. ఈ అథారిటీ ఎప్పటికప్పుడు విదేశాలతో చర్చిస్తూ, భారతీయ విద్యార్థులు ఇబ్బందులు పడకుండా పర్యవేక్షించాలి.

12/30/2015 - 23:59

విదేశీ విద్య పట్ల యువతలో రోజురోజుకీ మక్కువ పెరుగుతోంది. ఇది ఎవరికి ఎంతవరకు ఉపయోగమనేది ఎలా ఉన్నా, ఆశించేవారికి మాత్రం నష్టం జరగకూడదు. విదేశాల్లో విద్యాభ్యాసానికి వెళుతున్న ప్రతి విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుని, విదేశాల్లో ఆ విద్యాసంస్థ లేదా యూనివర్శిటీ ఉన్నదీ లేనిదీ ఇక్కడే తనిఖీ చేయాలి. అందుకోసం ఒక వ్యవస్థ లేదా ఫోరమ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుచేయాలి.

12/30/2015 - 23:58

అమెరికాలో చదవాలనుకునేవాళ్లు ప్రతిభావంతులై ఉండాలి. ఆర్థిక స్తోమత ఉండాలి. ఉన్నత చదువులు చదివి కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలనే తాపత్రయం ఉండాలి. మన దేశంలోని విశ్వవిద్యాలయాల కంటే ఉన్నత ప్రమాణాలతో ఉండే వర్శిటీల్లో చేరాలి. కాని తాజాగా అమెరికాకు వెళ్లి అక్కడి నుంచి బలవంతంగా పంపివేయబడిన విద్యార్థులే కాకుండా అనేకమంది విద్యార్థుల విషయంలో విచారకరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

12/30/2015 - 23:58

తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చెల్లుబాటు అయ్యే వీసాలను చూపించినా అమెరికా ఇమిగ్రెంట్ అధికారులు ఇటీవల ఆ దేశం నుంచి విద్యార్థులను పంపించివేశారు. అమెరికా అధికారులు ఈ విద్యార్థుల ఆందోళనను అర్థం చేసుకోలేకపోయారు. అమెరికా వ్యవహారశైలిని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించాల్సిన పరిణామమిది. అలాగే ఈ సంఘటన మన దేశంలో ఉన్నత విద్య వ్యవస్థలో చోటుచేసుకున్న తీరును సూచిస్తోంది.

12/30/2015 - 23:57

అమెరికాలో ఉన్నత చదువులు చదవాలన్న తెలుగు విద్యార్థులను ఆ దేశానికి రానీయకుండా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుంటున్నారు. కొద్దికాలం వరకూ మనదేశం నుంచి, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలోనే యువకులు అమెరికాకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకుని స్థిరపడ్డారు. ఇటీవల అమెరికాలో శాంతిభద్రతల సమస్య తలెత్తింది.

12/30/2015 - 23:56

భారతదేశంలో ఉన్నత విద్య సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. నామమాత్రపు విద్యకే పరిమితమైన వారికి ఉపాధి అవకాశాలు కన్పించడం లేదు. స్వయం ఉపాధికోసం ఎంతగా ప్రయత్నించినా రుణ సదుపాయం లభించని స్థితి. దీంతో ఉన్నత విద్య పేరిట కేవలం ఉపాధికోసమే గత్యంతరం లేని స్థితిలో దళారుల ద్వారా విదేశాలకు వెళ్ళాల్సిన దుస్థితి ఏర్పడింది.

12/24/2015 - 07:43

ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం, వాణిజ్యం ఏదైనా కావచ్చు, విధి విధానాలకు లోబడి ఏ వ్యాపారం చేసినా, ఏ వాణిజ్యం చేసినా ఎవరికీ ఎలాంటి సమస్యలూ ఉండవు, నిబంధనలను ఉల్లంఘించినపుడే అసలు చిక్కు వచ్చిపడుతుంది. ఆర్ధిక సంస్థలు మన దేశంలో కొత్త కాదు, వడ్డీవ్యాపారాలు చేసే సంస్థలు, ఆర్ధిక రుణాలను అందించే సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి.

Pages