S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

12/24/2015 - 07:42

ప్రామిసరీ నోట్లను 24గంటల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించేవిధంగా చట్టం చేయటం ద్వారా వడ్డీ వ్యాపారుల దురాగతాలకు అడ్డుకట్ట వేయవచ్చు. దీని కోసం రాష్ట్రప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించాల్సి ఉంటుంది.

12/24/2015 - 07:42

నవ్యాంధ్ర రాజధాని అమరావతి చెంతన ఉన్న విజయవాడ నగరం మాఫియా శక్తులకు కేంద్ర స్థానంగా మారింది. కొత్త రాష్ట్రం కొత్త రాజధానితో విరాజిల్లాలని ప్రజలంతా అనుకుంటుంటే అరాచక శక్తులు మాత్రం రాజ్యమేలుతున్నాయి. పరిపాలనా దక్షుడిగా పేరున్న చంద్రబాబు ప్రస్తుతం తన పరిపాలన ఏ దిశగా సాగుతోందనే కోణంలో ఆలోచిస్తే మాఫియా శక్తులు ఊపందుకున్నట్లు కనిపిస్తుంది.

12/24/2015 - 07:41

వడ్డీలకు డబ్బు తీసుకుని చెల్లించలేని వారి ఇంట్లోని మహిళల పట్ల వడ్డీ వ్యాపారులు అసభ్యంగా లేదా దురుసుగా ప్రవర్తించినట్లయితే వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి. వడ్డీ వ్యాపారుల ఆగడాలు ఇప్పుడు కొత్తగా ఆరంభం కాలేదు. లేదా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ప్రారంభం కాలేదు. వడ్డీ వ్యాపారులు అనాదిగా అనాగరికంగా వేధిస్తున్నారు. బానిసత్వం కూడా వడ్డీ వ్యాపారుల నుంచే వచ్చింది.

12/24/2015 - 07:40

రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ ఉదంతంపై లోతైన విచారణ జరగాలి. కాల్‌మనీ వంటి సంఘటనకు కారణాలేంటి, పరిష్కారం ఏమిటనే కోణంలో విస్తత్ర అధ్యయనం జరగాలి. ఇందుకు ఆర్ధిక నిపుణులతో కూడిన ఒక అధ్యయన బృందాన్ని నియమించాలి. దీనికంటే ముందు అసలు కాల్‌మనీ గందరగోళం, దీని వెనుక దాగి ఉన్న సెక్స్ రాకెట్ వంటి అంశాలపై అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే మంచిది.

12/24/2015 - 07:39

కాల్‌మనీ సెక్స్ రాకెట్ స్కాంను బహిర్గతం చేసింది మా పార్టీనే. పేద, మధ్య తరగతి వర్గాలను, మహిళలను వేధించి, వారి నుంచి జలగల మాదిరిగా వడ్డీ సొమ్మును లాగుకొని, లైంగిక అత్యాచారాలకు పాల్పడిన ముఠా గుట్టురట్టు చేశాం. ఈ స్కాంలో టిడిపికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి.టిడిపి పెద్దలున్నారు. హైకోర్టు సిటింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి.

12/24/2015 - 07:39

ప్రజలను రక్షించాల్సిన రాజకీయ, పోలీసు వ్యవస్ధలు వారి ఎలా భక్షిస్తున్నాయో విజయవాడ కాల్‌మనీ దుర్మార్గం బైటపెడుతోంది. ఒక సామాజిక రుగ్మతలా మారి కుటుంబాలను కబళించే స్ధాయికి అధి విస్తరించడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. పౌరునిగా, పౌర సమాజ రాజకీయ ఉద్యమకారునిగా సిగ్గుపడుతున్నాం. విజయవాడ కాల్‌మనీ విషవలయం మొక్కుబడి అరెస్టులు, నాలుగు రోజుల హడావుడితో పరిష్కారమయ్యే అంశం కాదు.

12/24/2015 - 07:38

కాల్ మనీ వ్యవహారంలో అప్పులు ఇచ్చి మహిళలను లైంగికంగా వాడుకోవడం అత్యంత హేయమైన విషయం. అలాంటి వారిపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. రాజకీయ వత్తిళ్లకు లొంగకుండా పోలీసులు వారిని కఠినంగా శిక్షించాలి. పోలీసులు కేసులు నమోదు చేసిన వారే కాకుండా ఇంకా చాలా మంది అలాంటి వారు ఉన్నట్టు తెలుస్తోంది.

12/17/2015 - 02:26

తెలుగునాట పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అపహాస్యం చేసే విధంగా రాజకీయాలు సాగుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ తన బలాన్ని పెంచుకునేందుకు లేదా విపక్ష పార్టీని బలహీనపరిచేందుకు చట్టాల్లోని లొసుగులను ఆసరా చేసుకుని ప్రజాప్రతినిధులను లోబరచుకోవడం, ఫిరాయింపులకు ప్రోత్సహించడమనే విధానం కొనే్నళ్లుగా కొనసాగుతోంది.

12/17/2015 - 02:24

శాసన మండలి 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే ఆరు స్థానాల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇది ఒక రికార్డు. టిఆర్‌ఎస్ వరుస విజయాలను తట్టుకోలేకపోతున్న కొన్ని పార్టీల నాయకులు వలసలు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. వలసలు అనేవి ఇప్పుడే పుట్టినట్టుగా నాయకులు మాట్లాడుతున్నారు. వలసలు ఇప్పుడే మొదలు కాలేదు. వలసల గురించి విమర్శలు చేస్తున్న పెద్ద నాయకులు కూడా ఒకప్పుడు పార్టీలు మారినవారే.

12/17/2015 - 02:23

స్థానిక సంస్ధల కోటా నుంచి రాష్ట్ర శాసన మండలికి (కౌన్సిల్) జరగబోతున్న ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఇతర పార్టీల అభ్యర్థులను ఆకర్షించి, వారిని చేర్చుకుని, ఏకగ్రీవం చేసుకోవడం గొప్పతనం ఏమీ కాదు. పలు ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నట్లు టిఆర్‌ఎస్ సంబరపడిపోతున్నది. ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరించడమో లేక ప్రలోభాలకు గురిచేసి ఆకర్షించడం గొప్పతనంగా టిఆర్‌ఎస్ భావిస్తున్నది.

Pages