S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

12/10/2015 - 03:29

ఇస్లాం మతం ప్రకారం అల్లాను ఆరాధిస్తాం. దేవుడంటే అల్లా ఒక్కరే, పుట్టించేవాడు, గిట్టించేవాడు ఆయనే. సృష్టిలోని జంతువులన్నీ పరాన్న జీవులే. మానవులు కొన్ని జంతువులను సంహరించి భుజించడానికి అవకాశం ఉంది. అయితే వేరే మతానికి చెందిన వారిని అల్లరి పెట్టాలనో, వారి మనోభావాలను దెబ్బతీయాలన్న దురాలోచన ఎవరూ చేయకూడదు.

12/10/2015 - 03:28

సరస్వతీ నిలయాలైన విశ్వవిద్యాలయాల్లో ఫుడ్ ఫెస్టివల్స్ ఎందుకు? అందులో 120 కోట్ల మంది భారతీయులు పూజించే గోమాతను వధించి బిరియానీ చేసి తినేందుకు పండగ అవసరమా? ఇది ముమ్మాటికీ దుర్మార్గమైన రెచ్చగొట్టే చర్యగా భావిస్తున్నాం. ఆహారమనేది వ్యక్తిగతమైనదే. కాని ప్రజల్లో చీలికలు తెచ్చే విధంగా, సమాజంలో అశాంతిని పెంచే విధంగా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించే ప్రయత్నం చేయడం అసంబద్ధం.

12/10/2015 - 03:27

ఒకరి ఆహారపు అలవాట్లను మరొకరు నియంత్రించొద్దు. ఎవరి ఆహారం వారి ఇష్టం. దానిపై మరొకరు పెత్తనం చేయడం భావ్యం కాదు. బీఫ్ తినడం అనేది కొత్తేమీ కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి అనేక వర్గాలు తమ ఆహారపు అలవాట్లలో భాగంగా బీఫ్ తింటున్నారు. ఇష్టం లేనివాళ్లు మానేయ వచ్చు గానీ ఇంకొకరు తింటుంటే దాడులు చేస్తాం, దౌర్జన్యం చేస్తాం, అంతు చూస్తామంటూ రెచ్చగొట్టే విధానం మంచిది కాదు.

12/10/2015 - 03:26

విశ్వవిద్యాలయాల్లో ఆధిపత్యం కోసమే కొందరు బీఫ్‌ను వ్యతిరేకిస్తున్నారు. తినే తిండిపై ఆంక్షలు విధిస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. విద్యార్థుల్లో వివక్ష చూపేందుకే బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓయూలో 14 దేవాలయాలు ఉన్నాయి. రెండు మసీదులున్నాయి. ఒక్క చర్చి కూడా లేదు. వీరు కేవలం వారి వారి స్వార్థ రాజకీయాల కోసమే ఓయూను ఓ వేదికగా వాడుకుంటున్నారు.

12/02/2015 - 20:55

దేశ ప్రజల గురించి ఆలోచించండి... చట్ట సభలు జరుగుతున్న తీరు పట్ల ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు... ప్రజలకు తప్పుడు సంకేతాలను చట్టసభల ద్వారా పంపుతున్నాం... ఈ ప్రవర్తన ఎంతమాత్రం మంచిది కాదు... లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తాజాగా జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా సభ్యులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలివి. లోక్‌సభ, రాజ్యసభలకే ఈ పరిస్థితి పరిమితం కాలేదు.

12/02/2015 - 20:52

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌కు పేరుంది. ప్రజల సమస్యల పరిష్కారంలో పార్లమెంట్‌ది ముఖ్య భూమిక అనే విషయంలో సందేహం లేదు. పార్లమెంట్ మొదలుకుని గ్రామ పంచాయితీల వరకు జరిగే సమావేశాలు ప్రజాస్వామ్య వేదికలుగా ఉండాలి. పార్లమెంట్, శాసనమండలి, శాసనసభ, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయితీ సమావేశాల్లో ప్రజల సమస్యలపై చర్చకే అత్యంత ప్రాధాన్యత ఉండాలి.

12/02/2015 - 20:51

చట్టసభల్లో విలువలకు తిలోదకాలిస్తున్నారు. అధికార పక్షాలు అధికార మదంతో వ్యవహారిస్తున్నాయి. ప్రతిపక్షాలంటే గౌరవం లేదు. వారి సలహాలు, సూచనలు తీసుకోవడం లేదు. మేము చెప్పిందే వినాలని, లేకపోతే వారం, పది రోజుల పాటు లేదా సమావేశాలు ముగిసేంత వరకూ సభ నుంచి విపక్షాలను సస్పెండ్ చేయడం జరుగుతున్నది. నేను 1985లో ఎమ్మెల్యేగా అడుగు పెట్టాను. నాడు ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు.

12/02/2015 - 20:50

ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా, పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగాలన్నా అందుకు అధికార పక్షం ఎంతో సంయమనంతో వ్యవహరించాలి. ప్రభుత్వం, దానిలోని మంత్రులు, ఎంపీలు ప్రజా సమస్యలను పరిష్కరించాలనే సంకల్పం కలిగి ఉండాలి తప్ప ప్రతిపక్షాలను పక్కదారి పట్టించడం, రెచ్చగొట్టడం వంటి భిన్నపోకలకు పోకూడదు. గత పార్లమెంటు సమావేశాలు ఒక్కరోజు కూడా సరిగ్గా జరగలేదు. ప్రజాధనం, విలువైన పార్లమెంటు సమయం ఎంతో వృథా అయింది.

12/02/2015 - 20:48

చట్టసభల్లో చర్చలు అర్థవంతంగా జరిగినప్పుడే ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. దేశానికి మేలు జరుగుతుంది. అధికార పక్షం, విపక్షం మల్లయుద్ధం చేసుకున్నట్టు మాటల యుద్ధం చేయడానికే చట్ట సభలో పరిమితం కారాదు. క్రమంగా దేశంలోని చట్టసభల్లో చర్చల స్థాయి తగ్గి సభను అడ్డుకోవడమే ప్రధానంగా మారిపోయింది. అధికార పక్షం, విపక్షం స్థానాలు మారవచ్చు కానీ ఈ పరిస్థితి మాత్రం మారడం లేదు.

12/02/2015 - 20:47

భారత్ సెక్యులర్ దేశం, అన్ని మతాలు సామరస్యంతో ఎవరిప్రచారం వారు చేసుకుంటున్నాయి. సెక్యులర్ దేశంలో రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కును ఎవరూ కాలరాయలేరు. దేశంలో ఇటీవలి కాలం నుంచి కొంత మేరకు మతపరమైన అభద్రత, అసహనం కలుగుతుందనే భావన బలంగానే వినబడుతుంది. ఈ ప్రభావం మన దేశంతోపాటు ఇతర దేశాలకు పాకవచ్చు.

Pages