S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

11/01/2017 - 19:27

విద్యార్థులు క్షణికావేశానికిగురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు అనేక కారణాలున్నాయి. మానసిక వేదన, ఆవేశం, వత్తిడి, అవహేళన తదితరాలు వ్యక్తిగతంగా ఆత్మహత్యలకు దారితీస్తున్నాయ. సమస్యలను అధిగమించి జీవితంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేయాలే కానీ అర్ధాంతరంగా తనువులు చాలిస్తే తల్లిదండ్రులకు తీరని దుఃఖమే మిగులుతుంది.

11/01/2017 - 19:27

విద్యార్థుల ఇష్టాయిష్టాలను గమనించకుండా, తమకిష్టమైన కోర్సుల్లో బలవంతంగా చేర్పించటమే విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం. విద్యార్థుల్లో చదువులపై ఆసక్తిలేక, వినోదాత్మకత పెరుగుతుండగా టివిలు, సినిమాల ప్రభావం తీవ్రంగా పడటం కూడా ఆత్మహత్యలకు మరో కారణంగా చెప్పవచ్చు.

11/01/2017 - 19:25

పిల్లలు మానసిక ఒత్తిడికి గురికాకుండా, ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండాలంటే వారి తల్లిదండ్రుల ఆలోచనల్లో, ధృక్పథంలో మార్పురావాలి. తమ పిల్లలపై వత్తిడిలేని విధంగా విద్యాబోధన ఉండేలా చూసుకోవాలి. విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో తమ పిల్లలు భాగస్వామ్యం అయ్యేలా వాతావరణం కల్పించాలి. అలాంటి వాతావరణంలో చదువుకునే విద్యార్థుల్లో దాగి ఉండే సృజనాత్మకత వెలికి వస్తుంది.

11/01/2017 - 19:24

ఆత్మస్థైర్యం నింపడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మహత్యా ధోరణిని వారు విడనాడేలా చేయవచ్చు. ఇటు కుటుంబానికి, అటు దేశానికి ప్రయోజకలుగా ఉండాల్సిన ఉండాల్సిన వారు అర్ధంతరంగా జీవితాలను ముగించుకుంటున్నారు. వీటికి గల కారణాలు ఏమో పరిశిలించి, ఆ కారణాలను సరిచేసి విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపే మార్గలను అలోచించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

11/01/2017 - 19:24

భావిభారత పౌరులైన విద్యార్థుల ఆత్మహత్యలు, బలవన్మరణాలకు ఒత్తిడే ప్రధాన కారణం. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులపై చదువు పేరుతో పెడుతున్న ఒత్తిడి వలనే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయ. నాలుగు దశాబ్దాలుగా అధ్యాపక వృత్తిలో ఉన్న నేను ఈ విషయాన్ని ఘంటాపథంగా చెప్పగలను. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే అంశంపై ప్రభుత్వం ప్రొఫెసర్ నీరదారెడ్డి కమిషన్‌ను వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం 21 సిఫార్సులు చేశారు.

11/01/2017 - 19:21

ఆత్మహత్యలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులను తీవ్రమైన మానసిక వత్తిడికి గురిచేస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లలో విద్యార్ధులను వత్తిడికి గురిచేయడం కొత్తకాదు. గత 20 సంవత్సరాలుగా ఈ ఘాతుకాలు జరుగుతూనే ఉన్నాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఆత్మహత్యలపై కమిటీలను నియమించి చేతులుదులుపుకుంటున్నాయి.

11/01/2017 - 19:20

కేవలం ఒత్తిడితోనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పిల్లలపై ఒత్తిడి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తొలుత తల్లిదండ్రులదే. ఆ తర్వాత ఉపాధ్యాయులదీ. తమ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలన్న ఆకాంక్షతో, బాగా చదువుకోవాలని, టాప్ ర్యాంకర్లు కావాలన్న పట్టుదలతో పిల్లలపై తల్లిదండ్రులే వత్తిడి చేస్తున్నారు. తమ పిల్లల అభిరుచి మేరకు నడుకోవడం లేదు.

11/01/2017 - 19:19

విద్యార్థుల్లో అవగాహన లేకపోవడంతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యాపరంగా పోటీపడుతున్న కళాశాలలు, విద్యార్థుల అభీష్టాన్ని గుర్తించలేకపోతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పోటీ పడి చదివిస్తున్నారే తప్పా.. పిల్లల మానసిక ఒత్తిడి, వారి ఇష్టా, అయిష్టాలు గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ఫలానా వారి పిల్లలు.. ఫలానా కళాశాలలో చదువుతున్నారు అంటూ పోటీ పడుతున్నారు. కానీ వారి చదువులు ఎలా ఉన్నాయి...

11/01/2017 - 19:18

ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న పిల్లల బాల్యాన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు హరిస్తున్నాయి. సదరు సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చివేశాయి. విద్యార్థులలో మానసిక వత్తిడికి కారణమవుతున్నాయి. కొన్ని వృత్తుల పట్ల మన సమాజంలో అసంబద్ధమైన ఆరాధన భావం నెలకొంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, పెద్దస్థాయి ఉద్యోగులు కావాలని కోరుకుంటున్నారు.

11/01/2017 - 19:18

ఆత్మస్థైర్యం, మనోవిజ్ఞానంపై ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు సరియైన శిక్షణ ఇస్తే భవిషత్తుపై దృష్టి సారిస్తారు. విద్యార్థులకు వత్తిడిని ఏ విధంగా తట్టుకోవాలనే అంశంపై ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. కళాశాల స్థాయికి చేరుకునేసరికి చదువు వత్తిడిని నివారిస్తూనే నీతిని బోధించాలి. విద్యార్థుల్లో ఆశావాహన దృక్ఫథాన్ని కల్పిస్తే నిలదొక్కుకుంటారు.

Pages