S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

01/03/2018 - 19:35

సరిహద్దుల్లో నిత్యం ఉద్రిక్త వాతావరణం నెలకొనడం భారత్, పాకిస్తాన్ రెండు దేశాలకు మంచిది కాదు. ఒకనాడు కలిసి ఉన్న ప్రాంతాలే విడిపోయి నేడు రెండు దేశాలుగా ఉంటున్నప్పటికీ అందరి మూలాలు ఒక్క దగ్గరే అనే విషయం గుర్తించాలి. పాలకుల తీరుతో ప్రజలు బాధపడాల్సి వస్తోంది. ఉద్రిక్త వాతావరణం కారణంగా రక్షణ బడ్జెట్ ఇరు దేశాల్లో వేల కోట్లను దాటి లక్షల కోట్లకు చేరుకుంటోంది. ఇది ఆహ్వానించదగిన పరిణామం కాదు.

01/03/2018 - 19:34

దేశ విభజన నాటి నుండి కూడా భారత్ పట్ల పాకిస్తాన్ శతృవైఖరి కొనసాగుతూనేవుంది. గతంలో రెండు పర్యాయాలు భారత్‌తో యుద్ధాలకు దిగి నష్టపోయినా పాకిస్తాన్ గుణపాఠం నేర్వలేదు. కాశ్మీర్ సమస్యను ఆసరాగా చేసుకుని సీమాంతర ఉగ్రవాదంతో భారత్ వ్యతిరేకంగా పాకిస్తాన్ కుట్రలు, దాడులు చేస్తోంది.

01/03/2018 - 19:34

మన దేశంపై పాకిస్తాన్ నిరంతరాయంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్‌ను భారత్‌సహా అన్ని దేశాలూ హెచ్చరిస్తున్నప్పటికీ వారికి బుద్ధి రావడం లేదు. పొరుగు దేశాలతో భారత్ ఎప్పుడూ స్నేహ సంబంధాలనే కోరుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ దౌత్య సంబంధాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు.

01/03/2018 - 19:33

భారత్‌లో భాగమైన కాశ్మీర్‌లో కల్లోలం సృష్టించడం ద్వారా తామే ముస్లిం మతానికి పెద్దగా పాకిస్థాన్ ప్రపంచానికి చెబుతోంది. అయితే దక్షిణ చైనాలోని ఉయ్‌గుర్ ప్రాంతంలోను, ఆఫ్ఘనిస్తాన్‌లోనూ ముస్లింలను అణగదొక్కుతూ తన ద్వంద్వ వైఖరిని చాటుకుంటోంది. దక్షిణ చైనాలో ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉండే ఉయ్‌గుర్‌లో ముస్లిం జనాభా ఎక్కువ.

01/03/2018 - 19:32

శాంతికాముక దేశమైన భారత్, విదేశాలతో సత్సంబంధాలు కొనసాగించడంలో ఎప్పుడూ ముందుంటుంది. మన దేశం స్నేహ సంబంధాలు కొనసాగించే దిశగా ఎన్నో అడుగులు వేస్తున్నా, పాక్ మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సరిహద్దు ప్రాంతంలో నిరంతరం దాడులకు పాల్పడుతూ శాంతి ప్రయత్నాలకు భంగం కలిగిస్తూనే ఉంది.

01/03/2018 - 19:32

ఉగ్రవాద సమస్యపై భారత్‌తో పాక్ దోబూచులాడుతోంది. భారత్‌కు ఎప్పుడూ సహకరించింది లేదు. ముంబయి పేలుళ్ల వ్యవహారం, ఆ తరువాత ఎన్ని సాక్ష్యాలు చూపిస్తున్నా భారత్‌పై వ్యతిరేక శక్తుల్ని ఎగదోస్తుంది. కులభూషణ్ జాదవ్ విషయంలో అదే జరిగింది. అతనిని అక్రమంగా అరెస్టు చేసి భారత్ గూఢచారి అని భారత్ పరువును మంటగలపడానికి ప్రయత్నించింది. ఈ పరిస్థితిలో భారత్ కూడా అంతర్జాతీయ మద్దతు కూడగట్టుకోవడం చాలా అవసరం.

01/03/2018 - 19:31

పాకిస్తాన్‌లో కొనసాగిన మిలటరీ ప్రభుత్వాల స్వప్రయోజనాల కారణంగానే భారత్‌తో మైత్రీ సంబంధాలు దెబ్బతింటున్నాయి. గత దశాబ్దకాలంగా మిలటరీ ప్రభుత్వాలు మిలిటెంట్ వ్యవస్థను ప్రత్యామ్నాయంగా భారత్‌పై ఉసిగొల్పుతున్నాయి. అంతర్గత అస్థిరత్వాన్ని ప్రేరేపించేందుకు తీవ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిందే కార్గిల్ యుద్ధం.

01/03/2018 - 19:31

దాయాది దేశం పాకిస్తాన్ తీరు మారుతుందని భావిస్తే పప్పులో కాలేసినట్లే. భారత్ నుంచి పాకిస్తాన్ మత ప్రాతిపదికన వీడిపోయి 1947 ఆగస్టు 14వ తేదీన ఆవిర్భవించింది. పాకిస్తాన్ భారత్ వ్యతిరేకత ప్రాతిపదికన మనుగడ సాగిస్తోంది. భారత్‌ను ప్రతిక్షణం ఆడిపోసుకుంటే తప్ప, ద్వేషిస్తే తప్ప పాకిస్తాన్‌లో పాలక వర్గానికి భవిష్యత్తు లేదు. భారత్‌పై కుతంత్రాలు పన్నడంలో పాకిస్తాన్, చైనా ముందుంటాయి.

01/03/2018 - 19:30

పాకిస్తాన్‌తో భారతదేశానికి సంబంధాలు బాగాలేవు. పాకిస్తాన్ అనుసరిస్తున్న దౌత్యసంబంధాల తీరులో బాగా మార్పులు రావాలి. మన దేశానికి చెందిన జాదవ్ కుటుంబం పట్ల పాకిస్తాన్ అనుసరించిన తీరు అమానవీయం, గర్హనీయం. అలాంటి చర్యలను పాకిస్తాన్ మానుకోవాలి. దౌత్యసంబంధాల విషయంలో పాకిస్తాన్‌కు భారత్ దీటైన సమాధానం ఇవ్వాలి. జాదవ్ కుటుంబాన్ని భారత ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలి.

12/27/2017 - 19:51

సీబీఐ పంజరంలో చిలుకలా మారిపోయింది.. మాస్టార్లు చెప్పినట్టు పలుకుతోంది.. సాక్షాత్తు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలివి. సీబీఐ ఎవరి నేతృత్వంలోనూ పనిచేయాల్సిన అవసరం లేదని, పూర్తి స్వతంత్రంగా వ్యవహరించాలని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు కూడా వేసింది.

Pages