S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

12/27/2017 - 19:50

సీబీఐ మనదేశంలో ఒక గౌరవప్రదమైన సంస్థ. అత్యున్నత ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ ఏ కేసు చేపట్టినా దేశం మొత్తం అటువైపే చూస్తుంది. అనేక కేసుల్లో నిందితులకు శిక్షపడేలా చూస్తుంది. ఎలాంటి కేసులైనా విచారణ చేసి, సాక్ష్యాలను సేకరించి కోర్టుకు చార్జిషీట్/నివేదిక సమర్పిస్తుంది. సాధారణంగా ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అంటుంటారు. దీనికి నాలుగు ప్రధాన కారణాలను చెప్పుకోవచ్చు.

12/27/2017 - 19:49

2జి స్కాం కేసులో సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ సంచలనాత్మక తీర్పును ఇచ్చారు. 35 మంది నిందితులను నిర్దోషులని తీర్పిచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కొన్ని ఆశ్చర్యకరమైన, సంచలనాత్మకమైన విషయాలను వెల్లడించారు.

12/27/2017 - 19:49

భారతదేశంలో రాజకీయ జోక్యం లేని సంస్థంటూ ఏదీ లేదు.. ఇందుకు కారణం సంస్థలకు ఆర్థికపరమైన వనరులను ఆయా ప్రభుత్వాలు సమకూర్చడమే. రాష్ట్ర హైకోర్టులు, సుప్రీం కోర్టులతో సహా నియామకాలను, వివిధ సంస్థల్లో పోస్టింగులను ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయి. ఇందుకు సీబీఐ కూడా భిన్నం కాదు.

12/27/2017 - 19:48

భారతదేశంలో దర్యాప్తు సంస్థలు రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురవుతున్నాయనేది నిర్వివాదాంశం. దర్యాప్తు సంస్థలను స్వయం ప్రతిపత్తి సంస్థలుగా తీర్చిదిద్ధి నిష్పక్షపాతంగా పనిచేసేలా చేసి ప్రజల్లో వాటిపై విశ్వసనీయత పెంచాల్సివుంది. అమెరికా వంటి దేశాల్లో క్రింది స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయి.

12/27/2017 - 19:48

మిగతా సంస్థలతో పోల్చి చూస్తే సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నట్టే లెక్క. సీబీఐ డైరెక్టర్‌ను లోక్‌పాల్ చట్టం కింద ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కలసి ఎంపిక చేస్తారు. దేశంలో ఈ ముగ్గురూ కలిపి ఎంపిక చేసే మరో సంస్థ ఏదీ లేదు. సీబీఐలో నియామకాలు, బదిలీలు సీవీసీ ప్యానెల్ తయారు చేస్తుంది. ఆ ప్యానెల్ మేరకు నియామకాలు, బదిలీలు జరుగుతుంటాయి.

12/27/2017 - 19:47

ప్రభుత్వాల చేతిలో సీబీఐ ఒక్కోసారి ఆయుధంగా మారుతోంది.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి సంఘటనలు జరగడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. పాలకులు సీబీఐ అధికారుల నియామకాలు తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకోవడం జరుగుతోంది. తద్వారా అధికారంలో ఉన్న ప్రభుత్వం వారికి కావాల్సిన నేరస్థులను కాపాడుకోవడం, రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడం జరుగుతుందన్నది.

12/27/2017 - 19:46

సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి అవసరం లేదు. సుప్రీంకోర్టు, హైకోర్టుల పరిధిలో సీబీఐ ఉంటే బాగుంటుంది. కోర్టుల పరిధిలో ఉంటే నిజాయితీగా పనిచేస్తుంది. ప్రభుత్వ ఆధీనంలో ఉంటే కక్షసాధింపు చర్యలు చేపడ్తారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకి సీబీఐ కొమ్ముకాసే అవకాశాలున్నాయి. దీంతో కోర్టుల పరిధిలో ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది. సీబీఐ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.

12/27/2017 - 19:45

భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధుల్లో పనిచేసే ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ సీబీఐ, ఏసీబీ, సీఐడీ వంటి నేర పరిశోధనా సంస్థలకు స్వయం ప్రతిపత్తి లేకపోయినా వాటి విచారణలో ప్రభుత్వాల అనవసర జోక్యం లేకుండా ఉంటే చాలు. తాజాగా టూజీ స్ప్రెక్టం కేసు న్యాయస్థానంలో వీగిపోయిన దరిమిలా అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

12/27/2017 - 19:45

దర్యాప్తు సంస్థలను అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రభావితం చేస్తాయనుకోవడంలో ఏమాత్రం వాస్తవం లేదు. స్వయం ప్రతిపత్తి కలిగిన సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తదితర సంస్థలు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కుల పరిరక్షణకోసం కృషి చేస్తున్నాయి. ఆయా సంస్థలు తమ పని తాము చేసుకుపోతున్నాయి. ఆయా సంస్థలకు తగిన స్వేచ్ఛా స్వాతంత్య్రాలున్నాయి.

12/27/2017 - 19:44

కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుగుణంగా వ్యవహరిస్తూ సీబీఐ తన మనుగడను కోల్పోతున్న భావన సమాజంలో ఉంది. 1978, 2007, 2008 సంవత్సరాలలో పార్లమెంటరీ సంఘాలు ఇచ్చిన నివేదికలో సీబీఐకి స్వయం ప్రతిపత్తిని కల్పించాలన్న ఆవశ్యకతను వివరించినప్పటికీ, అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు సీబీఐని జేబు సంస్థగా మార్చి వేసాయన్న భావన ప్రజల్లో ఉంది.

Pages