S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

12/20/2017 - 20:05

గుజరాత్ ఎన్నికల అంకం ముగిసింది. సీట్లు తగ్గినా అధికారంలోకి వచ్చామనే ఆనందంలో బీజేపీ, అధికారంలోకి రాలేకపోయినా, సీట్లు పెంచుకున్నామనే ఆనందంలో కాంగ్రెస్ పార్టీలు సంతోషంలో మునిగితేలుతున్నాయి. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్ ఎన్నిక గురించి ఎవరూ మాట్లాడటం లేదు.

12/20/2017 - 20:00

గుజరాత్ ఎన్నికల ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఉంటుంది. ఎందుకంటే గుజరాత్ ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవిఘ్నంగా మోదీ కొనసాగారు. గుజరాత్‌లో బిజెపి సాంకేతికంగా గెలుపొందినా, నైతికంగా ఓడిపోయినట్లే. ప్రధాని మోదీకి ప్రతిష్ఠాత్మకమైన సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ నువ్వా-నేనా అన్నట్లు బలమైన పోటీనిచ్చింది.

12/20/2017 - 20:00

హిమాచల్, గుజరాత్ రాష్ట్రాల ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదు. ఇదంతా పార్టీ నేతల హడావిడే. భౌగోళిక.. రాజకీయ.. సామాజిక స్థితిగతులు వేరు.. అక్కడే పూర్తిస్థాయిలో ఈ ఎన్నికల్లో బీజేపీ పట్టు సాధించలేకపోయింది.. కొద్దోగొప్పో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం కనుక గుజరాత్‌లో చావుతప్పి కన్ను లొట్టబోయినట్టుగా ఫలితాలున్నాయి..

12/20/2017 - 19:59

దేశ ప్రజల్లో మార్పు వచ్చింది, మాటలకు- చేతలకు ఉన్న తేడాను గమనిస్తున్నారు. గతంలో హామీలు చూసి ఓట్లు వేసే రోజులు ఇపుడు లేవు. నరేంద్ర మోదీ మూడేళ్ల పాలనలో ప్రపంచంలోనే వివిధ రంగాల్లో అగ్రస్థానానికి ఎగబాకుతోంది. ఆర్థిక రంగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని సంతరించుకుంది. రక్షణ రంగంలో , అంతరిక్ష రంగంలో, పొరుగు దేశాలతో స్వాభిమానంగా వ్యవహరించడంలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

12/20/2017 - 19:59

గుజరాత్, హిమచల్‌ప్రదేశ్‌ల ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రంపై ప్రభావ శూన్యం. తెలంగాణలో బిజెపి నామమాత్రంగా ఉండగా కాంగ్రెస్ ఉనికికోసం పోరాడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యం. ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు, బీజేపీకి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు.

12/20/2017 - 19:58

రాష్ట్ర విభజన తరువాత కుక్కలు చింపిన విస్తరిలా రూ. 16వేల కోట్ల ఆర్థిక లోటుతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు వచ్చే సాధారణ ఎన్నికల్లో గతంలోకంటే మరింత అత్యధిక స్థానాలతో విజయదుందుభి మోగించి నాలుగోసారి పగ్గాలు చేపట్టడం ఖాయం. ఆరునూరైనా ఈ విజయాన్ని ఎవరైనా అడ్డుకోగలమని చెప్పుకుంటే అరచేతిలో సూర్యుడిని ఆపగలననే చెప్పుకోవటమే. గుజరాత్ ఎన్నికలు చూశారు.

12/20/2017 - 19:57

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే బీజేపీకి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవక తప్పదనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్టమ్రైన గుజరాత్‌లో వరుసగా ఆరోసారి ఈ పార్టీ విజయం సాధించినా, సీట్ల సంఖ్య తగ్గడం నైతికంగా ఆ పార్టీకి ఇబ్బందే. గుజరాత్‌లోని వాద్‌నగర్ (మోదీ సొంత ఊరున్న నియోజకవర్గం) అసెంబ్లీ సెగ్మెంట్‌లోనే బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు.

12/20/2017 - 19:57

ఇటీవల రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు బిజెపి, కాంగ్రెస్ రెండు పార్టీలకూ వాత పెట్టారు. గుజరాత్ బీజేపీకి కంచుకోట. 22 ఏళ్లుగా అక్కడ అప్రతిహతంగా మంచి మెజార్టీతో గెలుస్తూ వస్తున్న బీజేపీకి మొదటిసారిగా 100 లోపు సీట్లు వచ్చాయి. చావు తప్పికన్ను లొట్టబోయినట్లుగా బీజేపీ అత్తెసరు మెజార్టీతో గెలిచింది. 99 సీట్లు వచ్చాయి.

12/20/2017 - 19:56

ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అత్తెసరు సీట్లతో గట్టెక్కినప్పటికీ ఆ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఏమాత్రం ఉండదు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి ఇంకా మరో ఏడాదిన్నర సమయం ఉంది. అప్పటి వరకు దీని ప్రభావం ఉండదు. అదీకాకుండా ప్రధాని మోదీ క్రేజ్ అన్నది కేవలం పార్లమెంట్ ఎన్నికల వరకు మాత్రమే ప్రభావం చూపగలదు. అసెంబ్లీ ఎన్నికలపై ఆయన ప్రభావం ఉండదు.

12/20/2017 - 19:55

మరో ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగబోయే సాధారణ ఎన్నికల్లో గుజరాత్ ఫలితాల ప్రభావం అణుమాత్రమైనా కన్పించబోదు. అక్కడ బీజేపీ వరుసగా ఐదుసార్లు అధికారంలో కొనసాగుతూ వచ్చింది. ఇందులో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, గత మూడేళ్లుగా ప్రధానమంత్రి పదవిలోనున్న నరేంద్రమోదీ ఓటమి భయంతో గల్లీగల్లీ తిరిగి ప్రచారం చేయటంలోనే అక్కడ బీజేపీ ఎంత బలహీనంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది.

Pages