S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

12/13/2017 - 20:01

భాషా ప్రాతిపదికన ఈ దేశంలో కొత్త రాష్ట్రాలు ఆవిర్భవించాయి. భాష నశిస్తే ఆ జాతి కూడా నశిస్తుంది. అందుకే ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు తెలుగును కాపాడుకోవాల్సి ఉంది. బోధన భాషగా తెలుగు ఉన్నప్పుడే పరిపాలన కూడా తెలుగులో సాఫీగా జరుగుతుంది. నా భాషలో చదువుకోవాలి.. నా భాషలో పాలించుకోవాలి.. నా భాషలో అభివృద్ధి సాధించాలనేది అందరికీ ఉంటుంది. అయితే ఈ వౌలిక సిద్ధాంతానికి తెలుగు రాష్ట్రాలు దూరంగా జరిగాయి.

12/13/2017 - 20:00

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిపాలన ఉత్తర్వులను నేటికీ 80శాతం ఆంగ్లంలోనే నిర్వహించడం, తెలుగుభాషతోపాటు దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలకు శాపంగా మారింది. జిల్లా, మండల స్థాయిలో సైతం నేటికీ అధికారులు ఆంగ్ల భాషలోనే కంప్యూటర్లను సైతం వాడుతున్నారు. ఫలితంగా తెలుగుపట్ల నిర్లక్ష్యం, ఆంగ్ల ఉత్తర్వులు ప్రజలకు అర్థంకాకుండా చూడటం, తద్వారా అవినీతి విస్తరణకు కారకులవుతున్నారు.

12/06/2017 - 18:41

సమాజ సమగ్ర పురోగతిని కాంక్షించే వారంతా కోరుకునేది ఒక్కటే, అన్ని రంగాల్లో మహిళలు పూర్తిస్థాయిలో భాగస్వామ్యం కావాలి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు తుది సందేశం కూడా అదే. సాధికారత సాధించాలంటే మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ఎదగాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా విద్యాపరంగా ఎదిగినపుడు వారు మిగిలిన అన్ని రంగాల్లో కూడా రాణించగలుగుతారు.

12/06/2017 - 18:39

మహిళా సాధికారతను సాధించడంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ముందంజలోనే ఉంది. దివంగత నందమూరి తారక రామారావు హయాంలో దేశంలోనే తొలిసారిగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్, మహిళలకు ఆస్తిలో హక్కు, ప్రత్యేక వర్శిటీ ఏర్పాటు చేశారు. చంద్రబాబు హయాంలో స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లను 50 శాతానికి పెంచారు.

12/06/2017 - 18:38

కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ మహిళలకోసం ప్రత్యేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా సాధికారతకోసం ఎనలేని కృషి చేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా పొదుపు గ్రూపులను ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక బలోపేతానికి శ్రీకారం చుట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది.

12/06/2017 - 18:38

మహిళా సాధికారిత, అభివృద్ధి. ఇవన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న అందమైన అబద్ధాలు మాత్రమే. ఆకాశంలో సగమైన మహిళాలోకానికి అరచేతిలో స్వర్గం చూపిస్తూ ప్రభుత్వాలు పబ్బం గడుపుకొంటున్నాయి. మహిళలు సాధికారిత సాధించి, అభివృద్ధి పథంలో నడవాలంటే చట్టసభల్లో వారికి సముచిత స్థానం ఉండాలి. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు దశాబ్దాలుగా పార్లమెంట్‌లో మూలుగుతోంది.

12/06/2017 - 18:37

మహిళా సాధికారికత విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేగంగా ముందడుగు వేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళాభివృద్ధిని కాంక్షిస్తు అమలుచేస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ విధానాల ఫలితంగా అన్ని రంగాల్లో సాధికారికత దిశగా పురోగమిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి కల్పన కార్యక్రమాలను అమలుచేస్తూనే టిఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు ముందుకువచ్చే మహిళలకు సబ్సిడీలు కల్పిస్తు ప్రొత్సహిస్తుంది.

12/06/2017 - 18:37

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారత అర్థమే మారిపోయింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళల పట్ల చిన్నచూపు చూస్తూ వారిని విస్మరించింది. గతంలో తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళల ఆర్థిక స్వావలంబనకోసం డ్వాక్రాలతోపాటు అనేక కార్యక్రమాలతో కొంత పురోగతి సాధించాయి. ప్రతిభా భారతి వంటి వారిని ఎన్టీఆర్ స్పీకర్‌గా చేయడంతోపాటు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు.

12/06/2017 - 18:36

మహిళా సాధికారతకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టింది. ఇవి ఇప్పటికే సత్ఫలితాలు ఇస్తున్నాయి. అయితే ఎలాంటి చదువురాని మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు కూడా ప్రభుత్వం కల్పించిన అవకాశాలను ఉపయోగించుకునేందుకు విస్తృతంగా ప్రచారం జరగాలి. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి.

12/06/2017 - 18:35

దేశ జనాభాలో సగభాగం మహిళలు ఉన్నప్పటికీ మహిళలు ఇంకను అన్ని రంగాల్లో వెనుకబడే ఉన్నారు. మహిళలు సాధికారత సాధించేందుకు ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటును అందుకునేందుకు అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ పరిస్థితిని అధిగమించాలంటే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ బిల్లు పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉన్న విషయం విదితమే.

Pages