S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

11/02/2016 - 21:42

ప్రపంచం చాలా విశాలమైంది. జీవించే హక్కు ప్రతి ప్రాణికీ ఉంది. విభిన్న జాతులు, వర్గాల ప్రజలు జీవిస్తున్న భారతదేశం మంచి సంస్కృతీ, సంప్రదాయాలను కలిగి అభివృద్ధి చెందుతోంది. ఉమ్మడి సివిల్ కోడ్‌లో భాగంగా ‘ట్రిపుల్ తలాఖ్’ సమస్య ముస్లిం మహిళల భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. పురాతన కాలంలో రాజుల పాలన ఉండేది. రాజ్యాలు ఎక్కువగా ఉండేవి. తరచూ యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధాల్లో ప్రజలు చనిపోతూ ఉండేవారు.

11/02/2016 - 21:42

దేశంలో ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కనపెట్టి భారతీయ జనతా పార్టీ ముస్లిం పర్సనల్ లా విషయంలో శ్రద్ధ చూపడం శోచనీయం. దేశవ్యాప్తంగా ప్రతి శుక్రవారం ప్రార్థనల అనంతరం పెద్దసంఖ్యలో ముస్లింలు ఈ విషయంలో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు. ప్రపంచంలోని ముస్లింలు అందరూ సామరస్యానే్న కోరుకుంటారు. అయితే ఖురాన్ ప్రవచించిన ఆదేశాలను పాటిస్తూ సమానత్వాన్ని కోరుకుంటాం.

11/02/2016 - 21:40

కామన్ సివిల్ కోడ్ వల్ల మత సంప్రదాయాల్లో జోక్యం చేసుకున్నట్లవుతుంది. బిజెపి ప్రభుత్వం కామన్ సివిల్ కోడ్ అంశాన్ని తైరపైకి తెచ్చింది. ఈ అంశంపై చర్చ మంచిదే. కాని ముస్లిం మత సంస్థల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఒంటెత్తు పోకడలతో కేంద్రం వ్యవహరిస్తున్నట్లు కనపిస్తోంది. ఇది అప్రజాస్వామికం.

10/27/2016 - 03:22

ఒకప్పుడు ప్రతిభ ఉన్న విద్యార్థులకు మాత్రమే ఉపకార వేతనం ఉండేది, దళితుల పిల్లలకు విద్య, అందులోనూ ఉన్నత విద్య అందుబాటులో ఉండేది కాదు, కాలక్రమంలో రాజకీయ పార్టీల వాగ్దానాలతో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలులోకి వచ్చింది. నిరుపేద విద్యార్థులు సైతం ఉన్నత ప్రమాణాలున్న కళాశాలల్లో ధనవంతుల పిల్లలతో సమానంగా చదువుకునే అవకాశం కల్పించాలనే ఆశయంతో మొదలైనదే ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం.

10/27/2016 - 03:21

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలతో ప్రస్తుతం అత్యంత ప్రధానమైనది విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్. దీనికి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం దురదృష్టకరం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు విద్యా సంవత్సరాలు గడిచినా, ఇంకా 2014-15, 2015-16 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. గత ఏడాది ముఖ్యమంత్రి కె.

10/27/2016 - 03:20

రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి బకాయిలు వారసత్వంగా వస్తూనే ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో ఆరువేల కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉండేవి. ఏటా 2500 కోట్ల రూపాయల వరకు కేటాయంపులు ఉండేది. దానిలో సగం చెల్లించడం సగం, అలానే పేరుకుపోవడం జరుగుతోంది. తెలంగాణలో మూడు వేల కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉండగా, వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించారు.

10/27/2016 - 03:19

ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను 2008-09 విద్యా సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టినప్పటికీ, దానిని మానవ వనరులపై పెట్టిన పెట్టుబడిగానే భావించాలని చెప్పేవారు, అది వాస్తవం కూడా. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులుగా వచ్చిన కె. రోశయ్య, ఎన్.

10/27/2016 - 03:18

ఎన్ని ప్రభుత్వాలు మారినా విద్యార్థుల తలరాతలు మారడం లేదు. ప్రభుత్వాలు విద్యను ఒక బాధ్యతగా మానవ వనరుగా చూడటం మర్చిపోయింది. ఎన్నికల హామీలుగా విద్యారంగ పథకాలను ప్రకటించడం మూలంగానే ప్రభుత్వం నేతృత్వంలోని విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం అయింది. విద్యను పూర్తిగా ప్రభుత్వరంగం నుండి తప్పించడానికి ప్రైవేట్ విద్యా సంస్థలను పాలకులు ప్రోత్సహిస్తున్నారు.

10/27/2016 - 03:17

ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరి విద్యార్థి లోకాన్ని, సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. విద్యార్థులకు చేయూత ఇవ్వాలన్న సంకల్పం ప్రభుత్వానికి లేదనిపిస్తోంది. విద్యా రంగాన్ని పటిష్టం చేయాలన్న తలంపు అంతకంటే లేదు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నర సంవత్సరాలయింది.

10/27/2016 - 03:17

రీయింబర్స్‌మెంట్ పట్ల ప్రభుత్వానికి ఎంతమాత్రం నిర్లక్ష్యం తగదు. దీనికంటే ప్రాధాన్యత కలిగింది మరొటి ఉండదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల కోసం అన్నింటినీ పక్కనపెట్టాలి. అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కెజి టు పీజి వరకు ఉచిత విద్యను అందిస్తానని ఎన్నికల ప్రణాళికలో చేర్చిన పార్టీ ఇది.

Pages