S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

12/06/2017 - 18:35

మహిళలకు చట్టసభల్లో సరైన గౌరవం లభించడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మహిళ సాధికారిత బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలి. గత ప్రభుత్వాలు మహిళా బిల్లుపై సరియైన దృష్టి సారించకపోగా స్ర్తిల డిమాండ్‌ను గొంతెమ్మ కోరిగా మార్చివేశాయ.

12/06/2017 - 18:34

స్వయంకృషితో పారిశ్రామిక, ఆర్థిక, వైద్య, సామాజిక తదితర రంగాల్లో మహిళలు ఎదగాలి. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారనే ఆలోచనలకు స్వస్తి చెప్పాలి. మహిళా సాధికారత అనేది ఒకళ్లు ఇస్తే వచ్చేది కాదు. కాని మహిళలు స్వయంకృషితో ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు అవసరమైన వేదికను, అవకాశాలను ప్రభుత్వాలు కల్పించాలి. అప్పుడే త్వరితగతిన మహిళలు ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు.

12/06/2017 - 18:34

మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించకుండా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మహిళల సాధికారిత ఎలా సాధిస్తారు? మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రివర్గంలో ఆరుగురు మహిళలకు స్థానం ఉండగా, అందులో ఐదుగురు తెలంగాణకు చెందినవారేనన్న విషయాన్ని మరచిపోరాదు. నేను, సబితా ఇంద్రారెడ్డి, డికె అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, కొండా సురేఖ. కాగా ఆంధ్ర ప్రాంతం నుంచి గల్లా అరుణ ఒక్కరే ఉన్నారు.

12/06/2017 - 18:33

సాధికారతకు అర్థం మారుతోం. మహిళలు శ్రమదోపిడీకి గురవుతున్నారు. అసంఘటిత రంగంలో 96 శాతం మహిళలు తక్కువ వేతనాలతో పనిచేయటమే ఇందుకు నిదర్శనం. విద్య, ఉద్యోగాలతోపాటు హక్కుల సాధనకు రాజకీయ రిజర్వేషన్లు సాధించుకుంటేనే సాధికారతకు అర్థం. ప్రస్తుతం వీటిలో ఏ ఒక్కటీ సక్రమంగా లేవు. ఈ కారణంగానే పురుషాధిక్యత పెరుగుతోంది.

11/29/2017 - 19:33

దేశ రాజధానిగా న్యూఢిల్లీ వయస్సు 86 ఏళ్లు, నగరంలో అన్ని విధాలా రద్దీ పెరిగిపోయింది. దేశం నలుమూలల నుండి అక్కడికి చేరేవారితో జనసమ్మర్థంగా మారిపోయింది. రాజధాని ఇరుకుగా తయారైంది. దానికితోడు కాలుష్యం, నీటి కొరత, వసతి కొరత, తాజాగా భద్రత కొరత కూడా మొదలైంది. పార్లమెంటుపై తీవ్రవాదుల దాడి జరగడమే కాదు, తాజాగా గ్యాంగ్‌వార్లు కూడా ఎక్కువయ్యాయి.

11/29/2017 - 19:34

1970 వరకూ పార్లమెంటుకు, అసెంబ్లీకి కలిసి ఒకేసారి ఎన్నికలు జరిగేవి. 1971 నుండి విడివిడిగా ఎన్నికలు జరుపుతున్నారు. ఇలా విడదీయడానికి ఆనాటి ప్రభుత్వం ఎలాంటి కారణాలను చూపలేదు. 1952లో జరిగిన ఎన్నికల్లో 51 పార్టీలు పోటీ చేయగా, 21 పార్టీలు పార్లమెంటులో ప్రవేశించాయి. 1962 వరకూ లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య 494 మాత్రమే, 1967లో ఈ సంఖ్య 525కు పెరిగింది.

11/22/2017 - 19:46

దేశంలో ప్రస్తుతమున్న లోక్‌సభ స్థానాలవల్ల పరిపాలనకు పెద్దగా ఇబ్బందేమీ కలగడం లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి లోక్‌సభ స్థానాలు పెంచడంద్వారా ప్రజలకు చెప్పుకోదగ్గ ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న సభ్యులు రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక, సాంఘిక, సామాజిక సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళుతున్నారు.

11/22/2017 - 19:45

దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పునర్విభజన చట్టంలో హామీ మేరకు అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరముంది. పార్లమెంటు ఏర్పాటు సందర్భంగా ఏర్పాటు చేసిన 543 సంఖ్య అలాగే కొనసాగిస్తున్నారు. దేశ జనాభా 125కోట్లు దాటిపోయినందున లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రజావసరాల దృష్యా పెంచడం ప్రధాన అవసరం. 2009 నియోజకవర్గాల పునర్విభజన చేసినా లోక్‌సభ సీట్ల సంఖ్య పెంచకపోవడం సహేతుకంగా లేదు.

11/22/2017 - 19:44

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సీట్ల సంఖ్యేకాదు దేశవ్యాప్తంగా లోక్‌సభ సీట్లనూ పెంచాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీని కోరడం శుభపరిణామం. కానీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్ తన వాణి వినిపిస్తే ఏమి ప్రయోజనం ప్రధానిని స్వయంగా కలిసి అడగాలి.

11/22/2017 - 19:44

పార్లమెంటు నియోజకవర్గాల పెంపుతో ఆర్థికభారం పెరిగినప్పటికీ ప్రజలతో సాన్నిహిత్యం మరింత బలపడుతుంది. దీనివలన పాలనా వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. పాలనా వ్యవస్థకు ప్రజాప్రతినిధులు వారధి లాంటివారు. ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి వివరిస్తారు. ఎక్కువ మంది సభ్యులుంటే ప్రజలకు చేరువ కావడంతోపాటు మారుమూల సమస్యలు కూడా పరిష్కరించే వీలుకలుగుతుంది.

Pages