S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

11/22/2017 - 19:43

పెరిగిన జనాభాకు అనుగణంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను కూడా పెంచాలి. ప్రతి లోక్‌సభ స్థానం పరిధిలో సుమారు 15 లక్షల వరకూ జనాభా ఉండేవారు. ప్రస్తుతం ఈ సంఖ్య పెరిగి, కొన్నిచోట్ల 17-18 లక్షల వరకూ చేరింది. రాష్ట్రంలో ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే జనాభా పెరిగిన నేపథ్యంలో లోక్‌సభ స్థానాల సంఖ్యను కూడా పెంచే ఆలోచన తప్పక చేయాలి.

11/22/2017 - 19:42

అర్టికల్ 82 ప్రకారం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన విధానాన్ని అమలు చేయడం మంచి ఆలోచనే! పార్లమెంట్ యువ సభ్యునిగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ జరగాలంటూ ఆశిస్తున్నాను. నాలాంటి యువ ఎంపీలంతా ఇదే కోరుకుంటున్నారు.

11/22/2017 - 19:42

దేశవ్యాప్తంగా జనాభా పెరుగుతున్న నేపధ్యంలో లోక్‌సభ నియోజవర్గాల విభజన అవసరం. రాజ్యాంగం ప్రకారం ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేసుకోవాలి. కాని కొన్ని సంవత్సరాల నుండి నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు. దేశవ్యాప్తంగా ఈ విభజన జరగాల్సి ఉంది. ప్రస్తుతం లోక్‌సభ నియోజకవర్గానికి 15 లక్షల మంది వరకు ఓటర్లు ఉంటున్నారు.

11/22/2017 - 19:41

పరిపాలన సౌలభ్య కోణంలో ఆలోచిస్తే లోక్‌సభ నియోజకవర్గాల విభజన అవసరమే. కొత్త నియోజకవర్గాల వలన ప్రజలకు మేలు చేకూరుతుంది. అయితే నియోజకవర్గాల విభజన రాజకీయ కోణంలో కాకుండా అందరి ఆమోదంతో ప్రక్రియ చేపడితే మంచిది. నియోజకవర్గాల విభజనతో ప్రజలకు మరింత మెరుగైన పరిపాలన అందుతుంది. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ నియోజకవర్గాల్లో జనాభా విపరీతంగా పెరిగింది. అలాగే అనేక నియోజకవర్గాలు వైశాల్యం పరంగా చాలా పెద్దవి.

11/22/2017 - 19:41

ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలను ఎన్నుకుని పాలన పగ్గాలను అప్పగించేందుకు పార్లమెంటు నియోజకవర్గాల విభజన తప్పనిసరి. పార్లమెంటు నియోజకవర్గాలను విభజన చేయాలన్నా, సంఖ్యను పెంచాలన్నా రాజ్యాంగ సవరణ తప్పనిసరి. పార్లమెంటు స్థానాలతోపాటుగా అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణకు బిల్లును ప్రవేశపెడితే సభ్యులంతా ఆమోదించాల్సి ఉంటుంది.

11/22/2017 - 19:40

దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను దేశ జనాభా 30 కోట్లు ఉన్నప్పుడు సరిహద్దులను ఖరారు చేసి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశ జనాభా 120 కోట్లు దాటింది. కొన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో జనాభా 50 లక్షల వరకు ఉంది. దీనివల్ల ఎంపీ అంటే ఎవరు? ఎక్కడ ఉంటారు? అనే విషయం సామాన్యులకు తెలియదు.

11/22/2017 - 19:39

అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రాన్ని కోరటం ముదావహం. పరిపాలన ప్రజల వద్దకు తీసుకురావాలనే సదుద్ధేశ్యంతో ముఖ్యమంత్రి ఇప్పటికే జిల్లాల పునర్విభజన ద్వారా 10 జిల్లాలను 31 జిల్లాలుగా మార్చారు. కొత్త డివిజన్లు, కొత్త మండలాలు కూడా ఏర్పాటు చేసారు. తాజాగా గిరిజన తండాలను, చెంచుపెంటలను, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది.

11/15/2017 - 20:49

మహానగరాలకే పరిమితమైన కాలుష్య ముప్పు ఇపుడు నెమ్మదిగా నగరాలకు, పట్టణాలకు సోకింది. ప్రతి ఊర్లో ఏదో ఒక రకమైన కాలుష్యం బెడద పెరిగింది. గ్రామాలకు జల కాలుష్యం, పట్టణాలకు రసాయన కాలుష్యం, మహానగరాలకు ధ్వని కాలుష్యం, కాంతిశక్తి కాలుష్యం పట్టుకున్నాయి. ఇపుడు అంతా వాయు కాలుష్యంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నా, ధ్వని కాలుష్యం కూడా ఏమంత తక్కువగా లేదు.

11/15/2017 - 20:45

ఈ రోజు ఢిల్లీ, రేపు దేశమంతా కాలుష్య నగరాలుగా తయారయ్యే అవకాశాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్య నియంత్రణకు కఠిన చట్టాలు తీసుకువచ్చి అమలు చేయాలి. చట్టాలు కాగితాలకే పరిమితమైతే చేసేదేమీలేదు. 2020 నాటికి స్వీడన్ దేశంలో అన్ని డీజిల్, పెట్రోలు ఇంధనంతో తిరిగే వాహనాలను రద్దు చేయాలని ఆ ప్రభుత్వం నిర్ణయించింది.

11/15/2017 - 20:45

సమాజ అభివృద్ధికి పరిశ్రమలు అవసరమే. దాన్ని ఎవరూ కాదనలేరు. అయితే ఏర్పాటు చేసే పరిశ్రమలవల్ల లాభాలు, నష్టాలు ఏమిటో బేరీజు వేసేందుకు ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళిక ఉండాలి. కాలుష్యం వెదజల్లని పరిశ్రమలకే అనుమతులు ఇవ్వాలి. పరిశ్రమల వల్ల ఉపాధి భారీగా లభిస్తుందని పరిశ్రమలు పెట్టేవారు ప్రచారం చేసుకుంటారు.

Pages