S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

11/15/2017 - 20:44

కాలుష్యం దేశ ప్రజలను వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీనే కాదు దేశంలోని అన్ని పట్టణాలకు, నగరాలకూ కాలుష్యం విస్తరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం హరితహారం పేరిట ఆర్భాటం చేస్తున్నది. కోట్లాది మొక్కలు నాటినట్లు ప్రచారం చేసుకుంటున్నది. కానీ అందులో ఎన్ని మొక్కలు బతికాయి, వాటి రక్షణకు ఎన్ని ట్రీ-గార్డులు ఏర్పాటు చేశాం, ఎవరు బాధ్యత తీసుకుంటారన్నది లేనేలేదు. కేవలం ప్రకటనలతో కాలం గడేపిస్తున్నది.

11/15/2017 - 20:43

నానాటికీ పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భావిస్తూ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో విస్తరిస్తున్న జనాభాతో పోటీపడుతూ జల, వాయు కాలుష్యం ఊహకందని రీతిలో పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. పారిశ్రామిక అవసరాలు, వాహనాల వినియోగం విపరీతంగా పెరిగిపోవడం కాలుష్యం ప్రబలేందుకు కారణమవుతోంది.

11/15/2017 - 20:43

పట్టణాల్లో పెరుగుతున్న వాయు, జల కాలుష్యాన్ని ప్రణాళిక బద్ధంగా అరికట్టడం సాధ్యపడుతుంది. మున్సిపాలీటీలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది సహకారాన్ని సద్వినియోగ పర్చుకోవడం కూడా ప్రధానమైన అంశం. కాలుష్య నివారణకు నాలుగు పద్ధతులను అనసరించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటికీ పంపిణీ చేసిన చెత్త బుట్టలను ప్రజలు వినియోగించేలా చూడాలి.

11/15/2017 - 20:42

రాష్ట్రంలో, దేశంలో మిగతా పట్టణాలు, నగరాల కంటే ముందుగా రాజమహేంద్రవరంలో కాలుష్య నియంత్రణ వివరాల డిజిటల్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆనం కళా కేంద్రంలో కాలుష్య నియంత్రణ వివరాలు ఎప్పటికపుడు తెలియజేస్తూ ఆయా ప్రమాణాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీ ఏటా నగరంలో 30 నుంచి 50 వేల మొక్కలను నాటుతున్నాం. కొత్త మాస్టర్ ప్లాన్‌లో గ్రీన్ జోన్‌ను ఏర్పాటు చేశాం.

11/15/2017 - 20:41

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అవసరమైన జాగ్రత్త చర్యలను ప్రతి ఒక్కరు తమ ఇంటినుంచే ప్రారంభించాలి. నేడు పట్టణ, నగర ప్రాంతాలు కాలుష్యంతో నిండిపోతున్నాయి. పారిశ్రామిక, వాహన, వాయు, శబ్ధ కాలుష్యంతో నగర, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న జనం అల్లాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలను సైతం ఇటీవలి కాలంలో కాలుష్యం వణికిస్తోంది.

11/15/2017 - 20:39

కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. దేశంలోనే హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది. కాలుష్య నివారణకు పొల్యుషన్ కంట్రోల్ బోర్డు ఉన్నప్పటికీ తగిన సిబ్బంది, చట్టాల అమలు లేకపోవడంతో కాలుష్యాన్ని అరికట్టలేకపోతున్నారు. విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్‌కు కాలుష్యం ఒక పెద్దసవాలుగా మారింది.

11/08/2017 - 19:00

నిరుద్యోగ సమస్య కొత్తది కాదు, రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్లు, స్ట్ఫా సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు, బ్యాంకింగ్ సర్వీసు రిక్రూట్‌మెంట్ బోర్డులు, యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్ణీత వ్యవధిలో ఎన్ని రిక్రూట్‌మెంట్లు నిర్వహిస్తున్నా, లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తున్నా దేశంలో రోజురోజుకూ నిరుద్యోగం పెరుగుతూనేవుంది.

11/08/2017 - 19:00

ఖాళీగా ఉన్న లక్షా 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసి చూపిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటన నిరుద్యోగులను, విద్యార్థులను ఉత్సాహపరిచింది. కానీ కెసిఆర్ మాటలు నీటి మూటలే అవుతున్నాయి. మా ఉద్యోగాలు మాకు కావాలన్న నినాదంతో నిరుద్యోగులు, విద్యార్థులూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కాగా ఉపాధ్యాయల ఉద్యోగాల భర్తీకి అరకొర చర్యలు చేపట్టింది.

11/08/2017 - 18:59

ఉద్యోగ నియామకాల్లో అనుసరించాల్సిన ప్రభుత్వ విధానాల్లో గందరగోళంతోనే రిక్రూట్‌మెంట్‌లో వివాదాలు తలెత్తుతున్నాయి. ఉద్యోగాల భర్తీ, పదోన్నతుల ప్రక్రియ సాఫీగా సాగేందుకు, న్యాయపరమైన వివాదాలు అధిగమించేందుకు ప్రభుత్వం స్పష్టమైన చట్టబద్ధ విధానాలు రూపొందించుకోవాలి.

11/08/2017 - 18:58

ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేసేందుకు ఎపీపీఎస్సీ భారీ రిక్రూట్‌మెంట్లకు సిద్ధమవుతోంది. డీఎస్సీ భర్తీకి కూడా చర్యలు చేపడుతోంది. కోర్టు కేసుల వల్ల కొన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుకలగడం లేదు. ఇటువంటి పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసింది.

Pages