S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

03/10/2016 - 03:21

సాధారణ ఎన్నికలైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా ఇవిఎం విధానంలో ఓటర్లు ఓటు వేసిన తర్వాత వారు ఓటు వేసినట్టు రసీదు ఇవ్వడం ప్రజాస్వామ్య విధానంలో భాగమే! రాజకీయ పార్టీలు, సాధారణ ప్రజలు ఈ అంశంలో చాలాకాలం నుండి రసీదు ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఒక ఓటరు బ్యాలెట్ పేపర్ విధానంలో ఓటు వేస్తే, స్వయంగా తన ఓటును బ్యాలెట్ బాక్స్‌లో వేస్తారు. దాంతో ఓటు వేశానన్న సంతృప్తి లభిస్తుంది.

03/10/2016 - 03:20

ఎన్నికల ప్రధాన కమిషన్‌కు అవసరమైన ఇవిఎంలను తయారు చేస్తున్న ఏకైక సంస్థ మాదే. ఇవిఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని ఆరోపణలు ఇటీవల వస్తున్నాయి. ట్యాంపరింగ్‌కు ఏమాత్రం ఆస్కారం లేదని నిరూపించడంతో పాటు ఓటర్లకు వారు వేసే ఓటుపై నమ్మకం కలిగించడానికి ‘వాపట్’ అనే ప్రింటర్లను రూపొందించాం. వీటిని ఇవిఎంలకు అనుసంధానం చేశాం.

03/10/2016 - 03:19

ఓటర్లకు ఓటు వేసినట్టు రసీదు ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. రసీదు ఇవ్వడం వల్ల ఎవరికి ఓటు వేశారన్న విషయంలో రహస్యం పోయే అవకాశం ఉంటుంది. ఈ విధానంవల్ల సత్ఫలితాలు వస్తాయనుకోవడం లేదు. ఇదే సమయంలో మన ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు, ప్రజలు మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రజల్లో చైతన్యం రావాలి.

03/10/2016 - 03:18

ఇవిఎంల వినియోగంపై వస్తున్న ఆరోపణలు, అనుమానాలకు రసీదు ఇవ్వడం ద్వారా కొంతవరకు మాత్రమే పరిష్కారం ఉంటుంది. పూర్తి పారదర్శకత కనిపించినప్పుడే అన్ని అనుమానాలకు నివృత్తి కలుగుతుంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఆమోదించాలి, ఆహ్వానించాలి. తరచుగా ఈవిఎంల టాంపరింగ్ అనే ఆరోపణలకు చెక్ పెట్టేందుకు రసీదు ఇచ్చే పద్ధతి మంచిదే. కానీ ఇది పూర్తిగా సమస్యకు పరిష్కారం కాదు.

03/10/2016 - 03:17

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు ప్రింటర్‌ను అమర్చడం, ఓటర్లు తాము ఏ పార్టీకి ఓటు వేశారో తెలియచేసే విధంగా రశీదు కనపడడం అనే ప్రక్రియ విశ్వసనీయత కోసమే. బ్యాలెట్ విధానం ఉన్నప్పుడు కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు పోలింగ్ బూత్‌ను ఆధీనంలోకి తెచ్చుకుని సిబ్బందిని బెదిరించి ఓట్లు వేసుకునేవారు. ఆ తర్వాత టెక్నాలజీ రావడంతో పోలింగ్ ప్రక్రియలో మార్పులు వచ్చాయి.

03/09/2016 - 22:23

ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను వాడడం మారుతున్న కాలానికనుగుణంగా నూతన టెక్నాలజీని వినియోగించుకోవడం మంచిదే.. కానీ అది అందరికీ అందుబాటులో ఉండేవిధంగా, వినియోగంపై అవగాహన కూడా అవసరం. అవగాహన లేని టెక్నాలజీ వినియోగిస్తే తనపై తనకే అనుమానం వచ్చే అవకాశం లేకపోలేదు. ఇందుకోసం అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలి. ఓటర్లను చైతన్యపరచాలి.

03/09/2016 - 22:16

ఎన్నికల సంఘం కొన్ని సంవత్సరాల నుంచి ఇవిఎంలను వినియోగిస్తోంది. ప్రారంభం నుంచీ ట్యాంపరింగ్ జరుగుతున్నట్లు పలు రాజకీయ పార్టీలు పెద్దఎత్తున విమర్శలు, ఆరోపణలు చేశాయి. అనేక సాంకేతిక లోపాలు ఉన్నాయని అంటూ ఉండేవారు. కానీ ఏ ఒక్క ఆరోపణ ఆచరణలో రుజువు కాలేదు. ఈవిఎంల వినియోగానికి ముందు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించినప్పుడు అనేక ఆరోపణలు వచ్చాయి.

03/09/2016 - 22:14

దేశంలో మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారిగా ఇవిఎం ద్వారా ఓటుకు రసీదు చేర్చడం తెలంగాణలోనే తొలిసారి కావడం విశేషం. ఇవిఎంల ద్వారా ఓటు వేసినప్పుడు కొన్ని రాజకీయ పక్షాలకు, కొందరు వ్యక్తులకు అనుమానం ఉండేది. తాము వేసిన ఓటు తాము కోరుకున్న పార్టీకే పడుతుందా లేదా అని. ఓడిపోయిన రాజకీయ పార్టీ ఇవిఎంల వల్లనే ఓడిపోయాం లేకపోతే ఘన విజయం సాధించే వాళ్లం అని చెప్పుకోవడం ఆనవాయితీగా మారింది.

03/09/2016 - 22:12

ఇవిఎంల పని తీరుపై ఆరోపణలు చాలా ఎక్కువే వస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లోనూ, మున్సిపల్ ఎన్నికల్లోనూ చాలామంది బహిరంగంగానే ఆరోపణలు చేశారు. తమ పార్టీ సిపిఎం తరఫున ఎప్పటినుంచో ఇదే అంశంపై వివరణ కోరుతున్నాము. ఇప్పటికైనా ఓటర్లకు రసీదు ఇవ్వడంద్వారా తమ ఓటు నిర్దేశించిన వారికి వెళ్లిందనే భరోసా ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరు మరింత మెరుగుపడాల్సి ఉంది.

03/09/2016 - 22:11

ఓటు వేసిన తర్వాత స్లిప్ వచ్చే పద్ధతిని ఎన్నికల సంఘం ప్రవేశపెట్టడం శుభపరిణామం. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం ప్రయోగాత్మకంగా చేపట్టింది. అయితే వరంగల్‌లో చేపట్టకపోయినా, ఖమ్మంలోని 35 పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే ప్రతిపాదించారు. వరంగల్‌లో కూడా చేపట్టి ఉంటే బాగుండేది.

Pages