S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

02/25/2016 - 21:17

దేశంలో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో జెఎన్‌యు ఒకటి. దేశానికి అనేకమంది శాస్తవ్రేత్తలను, రాజకీయ నాయకులను, మేధావులను అందించిన వర్శిటీ అది. విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక దృక్పథాన్ని జెఎన్‌యు బోధిస్తుంది. దేశంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై అక్కడి విద్యార్థులు నిరంతరం స్పందిస్తూనే ఉంటారు. ప్రభుత్వాలకు నివేదికలు ఇవ్వడం కూడా సహజంగా జరుగుతున్నదే.

02/25/2016 - 21:16

దేశ రాజధాని ఢిల్లీలో జవహర్‌లాల్ యూనివర్సిటీలో ఇటీవల జరుగుతున్న హింసాత్మక ఘటనలు దేశ ప్రజలను ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు ఇటువంటి సంఘటనలను ఖండించాలి. దేశంకోసం ప్రాణ త్యాగం చేసి గాంధీ కుటుంబం వారసునిగా వచ్చిన రాహుల్ గాంధీపై మతతత్వ శక్తులు, బిజెపి నాయకులు విమర్శలు చేయడం దారుణం.

02/25/2016 - 21:15

విశ్వవిద్యాలయాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విద్యాలయాల నుండి సంస్కారం కలిగిన, క్రమశిక్షణ కలిగిన భావి భారత పౌరులు ఉద్భవిస్తుంటారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన విశ్వవిద్యాలయాల్లో అలజడులు రేగుతున్నాయి. అనేక యూనివర్సిటీలకు వైస్‌ఛాన్సలర్లు లేకపోవడంతో ఇంచార్జీల పాలనలోనే కొనసాగుతున్నాయి. బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు సగానికిపైగా ఖాళీగా ఉన్నప్పటికీ, వీటిని భర్తీ చేయడం లేదు.

02/25/2016 - 21:14

దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలను ఆర్‌ఎస్‌ఎస్ నడిపిస్తోందా అనే భావన వ్యక్తమవుతోంది. జెఎన్‌యులో సంఘటనలు గానీ, అంతకుముందు జరిగిన హెచ్‌సియు సంఘటనను గానీ నిశితంగా పరిశీలిస్తే అసహనం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా హరిస్తోంది. ఎన్‌డిఏ ప్రభుత్వ మతతత్వ అజెండాను విశ్వవిద్యాలయాల్లో అమలు చేయాలనే ప్రయత్నాలే ఇలాంటి సంఘటనలకు కారణమవుతున్నాయి.

02/25/2016 - 21:13

ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 10వ తేదీ నుండి జరుగుతున్న పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. మా విశ్వవిద్యాలయం ప్రధానంగా భారత్, దక్షిణాసియా పరిణామాలపై పరిశోధనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. భారతీయ విశ్వవిద్యాలయాల్లో వాక్‌స్వాతంత్య్రానికి దెబ్బతగలడం సహించరాని అంశం.

02/25/2016 - 21:12

ఢిల్లీలోని జెఎన్‌యులో ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసన విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అత్యంత అసంబద్ధంగా వ్యవహరించింది. కేంద్రం తీరును బట్టి ‘హీ ఈజ్ ఒన్ వరస్ట్ ఎనిమి’ అన్న నానుడి గుర్తుకువచ్చింది. కేంద్రం కథనాన్ని బట్టి జెఎన్‌యు క్యాంపస్‌లో జరిగిన ఒక సమావేశంలో ఆఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేశారు.

02/25/2016 - 21:11

జెఎన్‌యు సంఘటనపై మాట్లాడుతున్న బిజెపి జాతీయ నేతలు విద్యార్థులకు రాజకీయాలతో పనేంటి అని ప్రశ్నిస్తున్నారు. వెంకయ్య నాయుడు వంటి సీనియర్ నాయకులు విద్యార్థి సంఘాల్లో పనిచేసే ఈ స్థాయికి చేరారని గుర్తించాలి. ఇప్పుడు వాళ్లే విద్యార్థులకు యూనివర్శిటీల్లో రాజకీయాలేమిటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. యువత రాజకీయాల్లోకి రావాలి, ఏం జరుగుతుందో వాళ్లు తెలుసుకోవాలి.

02/25/2016 - 21:11

విశ్వవిద్యాలయాల్లో స్వార్థ రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయనడాన్ని జెఎన్‌యు ఘటన రుజువు చేసింది. ఇటీవల హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీలో చోటుచేసుకున్న ఆందోళన, జెఎన్‌యులో కొనసాగుతున్న నిరశనలను బట్టి చూస్తే మున్ముందు విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి ఘటనలు మరికొన్ని ఉత్పన్నమవుతాయే తప్ప అంతం కావు. విశ్వవిద్యాలయాలు పరిశోధనలు, మేథోసంపత్తికి నిలయాలు కావాలి. ఆందోళనలు, నిరశనలకు వేదికలు కావొద్దు.

02/25/2016 - 21:09

విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు సమాజం గురించి అవగాహన కలిగించడానికి, జ్ఞానాన్ని కలిగించేందుకు దోహద పడే విధంగా ఉండాలి. అర్థవంతమైన రాజకీయ చర్చ మంచిదే. కానీ ఏదో ఒక పార్టీకి అనుకూలంగా, వ్యతిరేకంగా పార్టీల రాజకీయాల పేరుతో విశ్వవిద్యాలయాలను పార్టీల రాజకీయ కేంద్రాలుగా మార్చడం మంచిది కాదు. ఈ దేశ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ, ఈ దేశ చట్టాలకు అనుగుణంగా ఎవరే అభిప్రాయాలు కలిగి ఉన్నా ఆహ్వానించాలి.

02/25/2016 - 21:07

భావ స్వేచ్ఛ దుర్వినియోగానికి పరాకాష్టగా జెఎన్‌యూ గొడవను పేర్కొనవచ్చు. రాజ్యాంగంలోని 19వ అధికరణ కింద మనకు లభించిన భావ స్వేచ్చను శత్రు దేశాలకు ఉపయోగపడే విధంగా వినియోగించుకునే విధంగా జెఎన్‌యు వివాదం తయారైంది. ఇటీవల కాలంలో హెచ్‌సియూ, జెఎన్‌యూ వివాదాలు చూస్తుంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా కొంతమంది విద్యార్థుల ఆలోచనలు, కొన్ని విద్యార్థి సంఘాల భావజాలం తయారైందా అనిపిస్తోంది.

Pages