S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

02/25/2016 - 21:06

జెఎన్‌యులో వామపక్ష-తీవ్రవాద సంస్థలు మోహరించాయి. నిషేధించబడిన కొన్ని తీవ్రవాద సంస్థలు వామపక్ష సంస్థల పేరిట, డెమోక్రటిక్ పేరిట ఆవిర్భవించాయి. అంటే కాషాయ రంగు వస్త్రాలు ధరించిన స్వామిజీల తరహాలో వచ్చాయి. పలు విద్యార్థి విభాగాల వెనుక వామపక్ష తీవ్రవాద సంస్థలు ఉండి నడిపిస్తున్నాయి. అందుకే యాకుబ్ మెమన్, అఫ్జల్‌గురుకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు.

02/17/2016 - 21:28

విధేయత, సిద్ధాంతాలతో పనిలేకుండా రాజకీయ అవకాశవాదమే అజెండాగా అధికారంకోసం పార్టీలను ఫిరాయించే నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అది ఫలానా పార్టీ అంటూ ఏమీ లేదు, అన్ని పార్టీల్లో పరిస్థితి ఒకేలా ఉంది. తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడంతో మరోమారు పార్టీ ఫిరాయింపుల అంశం చర్చకు వచ్చింది.

02/17/2016 - 21:24

పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాన్ని మరింత కఠినతరం చేయాలి. లేనిపక్షంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యేలా ఉంది. ఇది చాలా ఆందోళనకరమైన అంశం. పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు జాతీయ స్థాయిలో జరిగే సభాపతుల సదస్సులో ప్రధానంగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

02/17/2016 - 21:23

ఒక పార్టీ గుర్తుపై పోటీ చేసి ఎమ్మెల్యే లేదా ఎంపీగా ఎన్నికైన వ్యక్తి మరో పార్టీలో చేరాలనుకుంటే, తొలుత తన సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేసి చేరితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అలా కాకుండా ఎన్నికైన పార్టీకి ఉన్నఫలంగా గుడ్‌బై చెప్పి తనకు నచ్చిన పార్టీలో చేరడం పూర్తిగా అనైతికం. ఇటువంటి ఫిరాయింపులను అరికట్టేందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత పటిష్టపరచాల్సిన అవసరం ఉంది.

02/17/2016 - 21:22

పార్లమెంట్ సభ్యుడు లేదా లెజిస్లేచర్ సభ్యుడు పార్టీ మారితే పరిస్థితి ఏమిటన్న అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఒక పార్టీ నుండి ఎన్నికైన సభ్యుడు పార్టీ మారినా లేదా పార్టీ నుండి సస్పెన్షన్‌కు గురైనా వారి పదవికి గండం ఉంటుందా లేదా అన్నది చట్టరీత్యా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. పార్లమెంట్‌లో కానీ, శాసనసభ లేదా శాసనమండలిలో కాని పార్టీ మారే సభ్యుల సంఖ్యపై ఆధారపడి చర్యలుంటాయి.

02/17/2016 - 21:21

తెలంగాణ కొత్త రాష్ట్రం. రాష్ట్రం ఆవిర్భవించి టిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. మిగిలిన రాష్ట్రాలు వేరు, కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రం వేరు. రాష్ట్భ్రావృద్ధికి అందరం కలిసి పనిచేద్దాం, సూచనలు, సలహాలు ఇవ్వండి అని కోరారు. ఆరునెలల్లోనే విద్యుత్ సమస్యను ముఖ్యమంత్రి పరిష్కరించి చూపించారు.

02/17/2016 - 21:20

తమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే లేదా ఎంపి లేక మరో ప్రజాప్రతినిధి ఎవరైనా నియోజకవర్గ ఓటర్లు ఇచ్చిన తీర్పునకు భిన్నంగా ప్రవర్తిస్తే రీకాల్ చేసే అధికారం ఆయా నియోకవర్గాలకు చెందిన ప్రజలకు ఉంటే ఫిరాయింపులకు తేలికగా అడ్డుకట్టవేయవచ్చు. ఎన్నికైన తరువాత ప్రజలతో సంబంధం లేకుండా తనకు నచ్చిన పార్టీలో చేరేందుకు ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు.

02/17/2016 - 21:19

ప్రభుత్వం పార్టీ ఫిరాయింపును చట్టం చేసింది.. కానీ అమలు జరగడం లేదు. ఎంతో విశ్వాసంతో ప్రజలు ఓటు వేస్తారు. వారిని కాదని ఏవో ప్రలోభానికి లోనై పార్టీలు మార్చడం ప్రజలందరినీ మోసం చేసినట్టే. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల్లో పార్టీ మారని నైతిక విలువ కేవలం లోక్‌సత్తా పార్టీకే ఉంది. కాంగ్రెస్‌కు లీడర్ లేడు.. టిడిపికి క్యాడర్ లేదు.. దీనికి కారణం టిఆర్‌ఎస్సే.

02/17/2016 - 21:18

ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమకు నచ్చిన పార్టీలో చేరే స్వేచ్ఛ ఉంటుంది. దీంట్లో ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఒక పార్టీ నుంచి గెలుపొంది మరో పార్టీలో చేరడం అనైతికం, అప్రజాస్వామ్యం. ఒకవేళ పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తే తాము గెలిచిన పార్టీకి ముందు రాజీనామా చేయడం కనీస ధర్మం.

02/17/2016 - 21:18

ఒక పార్టీ నుంచి ఎన్నికై, ఆ తర్వాత అధికార పార్టీలోకి చేరడం ప్రజా తీర్పును కాలరాచినట్లే. ప్రస్తుతం తెలంగాణలో టిఆర్‌ఎస్ పార్టీలోకి టిడిపి, కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఫిరాయిస్తున్నారు. ప్రజల ఆశలను వమ్ము చేసి, వారి ఆకాంక్షలకు తిలోదకాలిచ్చి పార్టీ మారడం అంటే ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడవడమే.

Pages