S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

02/17/2016 - 21:17

ఒకే పార్టీలో 32ఏళ్ల పాటు కొనసాగిన నేను ఇపుడు టిఆర్‌ఎస్‌లో చేరటానికి నియోజకవర్గం అభివృద్దే ప్రధాన కారణం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న తమను ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు వంటి బలమైన నేత అండ ఉంటుందని భావించా, కానీ ఆయన ఆంధ్రాకు మఖాం మార్చటంతో ఆయన లోటు స్పష్టంగా కన్పించింది. రోజురోజుకి పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా, ఆగమ్యగోచరంగా తయారైంది.

02/17/2016 - 21:16

పార్టీ ఫిరాయింపులు అనేది నీతిమాలిన రాజకీయాలకు పరాకాష్ట. ఏ పార్టీలో ఎందుకు ఉన్నాం, ఎందుకు గెలిచాం, ఎందుకు మరో పార్టీలోకి వెళుతున్నామనే ఆలోచనే లేకుండా ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతున్నారు. నేతలు పార్టీలు మారుతున్నా, ప్రజల్లో కూడా పెద్దగా పట్టింపు లేకపోవడం మరింత శోచనీయం. ఒక పార్టీ సిద్ధాంతాలను అనుసరించి గెలిచిన తర్వాత మరో పార్టీలోకి వెళుతుంటే ప్రశ్నించే పౌరుడే లేరు.

02/11/2016 - 22:05

సామాజికంగా బలహీనపడిన వర్గాల వారికి అన్ని రకాల అవకాశాలను మిగిలిన వారితో సమానంగా కల్పించేందుకు, వారి అభివృద్ధికి దోహదపడేందుకు ఉద్దేశించినవే రిజర్వేషన్లు.

02/11/2016 - 22:04

రాజ్యాధికారం రాష్ట్రంలో పేద కాపుల కడుపును ఎంతమాత్రం నింపలేదు! కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన లక్షలాది మంది పేద కాపులు నేడు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. కాపు కులంలో జన్మించినందుకు జాతి రుణం తీర్చుకునేందుకే నేను ఉద్యమించాల్సి వచ్చింది. కాపులను బిసిలుగా మార్చి, క్రిమిలేయర్ విధానంలో పేద కాపులకు ఆర్థిక సహాయం, రుణాలను అందించాలి. బిసిలకు అన్యాయం చేయాలన్నది నా అభిమతం కాదు.

02/11/2016 - 22:03

కాపులను బిసి జాబితాలో చేర్పిస్తాననే కీలక హామీతో అత్యధిక జనాభా కల్గిన కాపుల ఓట్లతో పదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ముఖ్యమంత్రి కాగల్గిన నారా చంద్రబాబు నాయుడు ఆ హామీని ఎలాంటి పరిస్థితుల్లోనూ నెరవేర్చగలరనే ప్రగాఢ విశ్వాసం మా అందరిలో ఉంది. ఇదే డిమాండ్‌పై తునిలో జరిగిన కాపు గర్జన.. అందులో చోటుచేసుకున్న దురదృష్టకర ఘటనలు, ముద్రగడ పద్మనాభం దీక్ష..

02/11/2016 - 22:01

అభివృద్ధి చెందిన కాపులను బిసిల్లో కలిపితే సహించేది లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కాపు, బలిజ, ఒంటరి కులాలను బిసి జాబితాలో కలపాలని కాపు ఐక్య గర్జన ద్వారా హింసాత్మక సంఘటనలకు పాల్పడి సమస్యను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చారు.

02/11/2016 - 22:00

రాజకీయాల ప్రయోజనంకోసం కాకుండా ఆర్థికంగా వెనుకబడినవారికే రిజర్వేషన్లు కల్పించాలి. ఒక కుటుంబం ఆర్థికంగా సంతృప్తి పొందితే ఆ కుటుంబానికి రిజర్వేషన్లపై కల్పించే రాయితీలను తొలగించే విధానంపై ప్రభుత్వం ఆలోచించాలి. కుల, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తే అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీలన్నీ వారి వారి పాలనలో రిజర్వేషన్లను స్వార్థ ప్రయోజనాలకు వాడుకునే అవకాశం ఉంటుంది.

02/11/2016 - 21:58

రిజర్వేషన్ల వివాదాలకు మూల కారణం సామాజిక, ఆర్థిక అసమానతలు. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కొనసాగించాలి. వీరి కోటాను ముట్టుకోవడానికి వీలులేదు. కాగా ఆర్థికంగా వెనకబాటుతనం అగ్రకులాలుగా ముద్రపడిన వర్గాల్లో పెరిగింది. వీరిని కూడా ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. నిరుద్యోగం పెరిగింది. ఉద్యోగ నియామకాలు నిలిచిపోయాయి.

02/11/2016 - 21:57

కాపులకు రిజర్వేషన్లు కల్పించడం అనేది రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప సాధ్యం కాదు. రాజ్యాంగ సవరణ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న నిబంధనవల్ల కాపులను ఎపి ప్రభుత్వం బిసిల్లో చేర్చినా జరిగే పని కాదు. రాజ్యాంగ సవరణ కోసం పట్టుబట్టినా కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయి.

02/11/2016 - 21:56

మన సమాజంలో విద్య, ఉద్యోగ, రాజ్యాధికారంలో రిజర్వేషన్లు అవసరమే! అయితే ఈ రిజర్వేషన్లు అర్హులకు మాత్రమే అందించాలి. సామాజికంగా, కులపరంగా విచక్షణకు గురైన వారికి, తరతరాలుగా అణచివేతకు గురైనవారికి మాత్రమే ఇవి అందాలి. దేశ సంపద సమాజంలో అందరికీ అందాలన్నదే రాజ్యాంగ రూపకల్పన చేసిన వారి ఉద్దేశం. ఇందుకు అనుగుణంగా రాజ్యాంగంలో ఆదేశిక సూత్రలను రూపొందించారు.

Pages