S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

02/04/2016 - 03:10

భారతదేశం రూపు మారుతోంది. సకల సదుపాయాలతో గ్రామాలు కలకలలాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే మరో పక్క నగరాల్లో ప్రజలు సంతోషంగా ఆరోగ్యవంతంగా, విజ్ఞానదాయకంగా జీవించేందుకు అవసరమైన వౌలిక వసతుల కల్పనకు నడుంబిగించింది. అందులో భాగంగానే స్వచ్ఛ భారత్ మిషన్ చేపట్టిన కేంద్రం, తాజాగా దేశంలో వంద నగరాలను స్మార్టుసిటీలుగా అభివృద్ధి చేయదలచింది.

02/04/2016 - 03:08

స్మార్ట్ సిటీల ఆలోచన మంచిదే. కానీ అన్ని నగరాలను ఒకే గాటున కట్టే విధానం సరైనది కాదు. ఢిల్లీ జనాభా ఐదు కోట్లు, కాకినాడ జనాభా ఎనిమిది లక్షలు. స్మార్ట్‌సిటీల పేరుతో ఈ రెండు నగరాలను ఒకే గాటున కట్టి చూడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయం ఐదువేల కోట్ల రూపాయలు.

02/04/2016 - 03:07

కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ప్రతిపాదించిన స్మార్ట్ సిటీల తొలి జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కాకినాడ పట్టణాలున్నాయ. 2015-16 ఆర్థిక సంవత్సరం నుండి ఈ పథకం కింద నిధులు లభిస్తాయి. దేశం మొత్తంలో 98 స్మార్ట్ సిటీలుగా గుర్తించారు. ఈ మొత్తంలో తొలి జాబితాలో ఆర్థిక చేయూత ఇచ్చేందుకు 20 నగరాలను ఎంపిక చేయగా ఎపిలోని రెండు నగరాలు ఇందుకు ఎంపికయ్యాయి. తర్వాతి దశలో తిరుపతిని కూడా ఎంపిక చేస్తారు.

02/04/2016 - 03:05

తెలంగాణకు స్మార్ట్‌సిటీలు రాలేదనే భావన ఉండకూడదు. ప్రస్తుత ప్రభుత్వం స్మార్ట్‌సిటీలో ఉండే వౌలిక సదుపాయాలు కల్పిస్తే తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలు స్మార్ట్ సిటీలుగా మారుతాయి. హైదరాబాద్ విశ్వనగరంగా మారుతున్న నేపథ్యంలో స్మార్ట్‌సిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు స్మార్ట్ సిటీలను ప్రకటించలేదని అపోహ పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే స్మార్ట్ తెలంగాణగా మార్చుకోవచ్చు.

02/04/2016 - 03:04

స్మార్టు సిటీల పథకం సవ్యంగా అమలుజరిగితే నగరాల స్వరూపమే మారిపోతుంది. ఇది కేవలం ప్రభుత్వానికి సంబంధించి మాత్రమే కాదు, ప్రజల భాగస్వామ్యంతో ప్రజల సహకారంతో, ప్రజల ప్రమేయంతో నడిచే పథకం. ప్రజలు ముందుకు వచ్చి తమ నగరాలు అందమైనవిగా, కాలుష్యరహితమైనవిగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగేవిగా ఉండాలని కోరుకోవాలి, అందుకు ప్రజలు అంతా తోడ్పడాలి.

02/04/2016 - 03:02

కాకినాడ నగరం తొలివిడత 20 నగరాల్లోనే స్మార్ట్‌సిటీగా ఎంపికవ్వడం సంతోషకరం. సహజ వాయువుల నిక్షేపాల కేంద్రంగా ఉండడంతో పాటు పెన్షనర్స్ పారడైజ్ గా గుర్తింపు పొందిన కాకినాడ ఇప్పుడు స్మార్ట్‌సిటిగా ఎంపికవ్వడం ద్వారా దేశంలోనే నెంబర్‌వన్ సిటిగా అభివృద్ధి చెందుతుంది.

02/04/2016 - 03:01

దేశంలో ఎంపిక చేసిన నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్రప్రభుత్వం తలపెట్టడం మంచి పరిణామమే. కానీ అభివృద్ధి చెందిన నగరాలనే మరింత అభివృద్ధి చేస్తామంటే ఎలా? అసలు అభివృద్ధికి నోచుకోని నగరాల సంగతేంటి. వీటి గురించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. పక్షపాతం అసలు పనికిరాదు.

02/04/2016 - 03:00

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, విశాఖపట్నం నగరాలను కేంద్రం ఆకర్షణీయమైన నగరాలుగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేయడం స్వాగతిస్తాం. కాని ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలు, ప్రపంచంలోని హిందువులకు మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతి సంగతి ఏమిటి? కర్నూలు, తిరుపతిని స్మార్ట్ సిటీల జాబితాలో ఉండేటట్లు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

02/04/2016 - 02:59

కేంద్ర ప్రభుత్వం చెబుతున్న స్మార్ట్ సిటీల నిర్మాణం అనేది ఒక భ్రమ. అది రంగుల ప్రపంచాన్ని చూపించడమే అవుతుంది. అసలు వౌలిక సదుపాయాలైన తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనికేషన్, శానిటేషన్, వీధిదీపాలు వంటివి సక్రమంగా లేని పట్టణాలు, ద్వితీయ స్థాయి నగరాలు చాలా ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల అవసరాలను తీర్చేందుకు అవకాశం ఉంటుంది.

01/27/2016 - 23:32

ప్రశాంత వాతావరణానికి ప్రతీకలుగా, సరస్వతి నిలయాలుగా విరాజిల్లవలసిన ఉన్నత విశ్వవిద్యాలయాలు అలజడులతో అట్టుడికిపోతున్నాయి. విద్యార్థుల ఉద్యమాలు, అధ్యాపకుల నిరసనలు, పాలనా సిబ్బంది అలసత్వం, ప్రభుత్వ నిర్లిప్తత, సమన్వయ లోపం, నిధుల లేమివంటి రకరకాల కారణాలతో విశ్వవిద్యాలయాలు కునారిల్లుతున్నాయి. వర్శిటీల్లో ఉద్యమాలు కొత్తేమీ కాదు.

Pages