S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

10/08/2017 - 21:36

శబ్దమే సృష్టికి మూలం, కవికి ఆధారం. సృష్టిలో మనిషి ఒక్కడికే మాట ఉంటుంది. ఆ మనిషి తీరు మంచిగా ఉంటే అతని జీవితం సాఫీగా సాగుతుంది. మనిషి మాటకే నానా అర్థాలు రాసుకుంటాడు కవి. పదార్థాన్ని చూసి కవికి భావం వస్తుంది. భావంతో మాట, మాటతో కవిత్వం వుంటుంది.

10/08/2017 - 21:35

బాయి గిర్కి మీద పావురం కూత
పల్లె సౌందర్య గీతం
చింత చెట్ల కింద పంటల కొయినోల్ల పొయ్యి
కాలం సంతకం
తాటికాయల బండిగీరలు
బాల్యం ఆనవాళ్లు
పచ్చటి పొలంలో కొంగల నడక బతుకు వేట
గుడిసెల మీద పాకిన చిక్కుడు తీగ
చిక్కుముళ్ల సంసార దృశ్యం
పలిగిన గోలెం వలసపోయిన ఇజ్జత్ రూపం
మొండి గోడ మీద మొలిచిన పచ్చగడ్డి
తడారి పోని ఆశల వసంతం

10/08/2017 - 21:33

‘ఆడదానికి పుట్టుకతోనే ఆర్థిక పారమార్థిక స్వాతంత్య్రం వారసత్వంగా ఏర్పరచని మన ధర్మశాస్త్రంమీద అచంచల విశ్వాసం వున్న కథానాయకుడు. తనను గురించి తాను చక్కగా చెప్పకుంటాడు. ‘‘దురుసువాణ్ణి కాదు. ఒక మనిషి సంగతి సిసలుగా తెలుసుకునేందుకు, నేనంటే గిట్టనివాళ్లను అడిగి తెలుసుకోవాలి’’- శ్రీ మల్లాది రామకృష్ణశాస్ర్తీగారు రాసిన అనేక కథానికలలో ‘విపులాచపృధ్వీ’ అనేది విశిష్టమయిన వాటిలో ఒకటి.

10/08/2017 - 21:30

మత్తు నీవంటే
గమ్మత్తు ఇది
మొదలంటే ‘‘అది’’ తెలుసా?
అప్పటి మొలక నవ్వు నాది
హృదయాకాశంలో జిగి వెనె్నల కురుస్తోందా?
వాన చినుకు ఒకటి టక్కున పలకరిస్తే
నేనిలలో ఉన్నట్టు తెలిసిందిలే
నన్ను చూసినప్పటి నిన్న మొన్నటి
మందహాసమొకటి
మింటి చుక్కై వెలిగిపోతోంది.
గగన మెక్కలేను కదా ప్రియతమా
ముద్దుగుమ్మనై శృంగార గర్వంతో

10/01/2017 - 19:49

క్రీ. శ. 17వ శతాబ్దం వాడైన వేమన సమాజాన్ని వ్యాధిగ్రస్తం చేస్తున్న కుల మతాలను నిరసించాడు. సమాజాన్ని కుల మతాల ముళ్లకంచెలతో చీల్చి, అశాంతిమయం జేసి, మనుషుల మీద పెత్తనం చేయడానికి దోపిడీని కొనసాగించడానికి మనువాదులు చేస్తున్న కుట్రలను కుతంత్రాలను వేమన తన పద్యాల్లో ఎండగట్టాడు. వేమన సాంఘిక అసమానతలు లేని సమాజాన్ని సముద్ధరించుకోవాలంటే కుల మత రహిత సమాజం కోసం కలగన్నాడు గనుకే,

10/01/2017 - 19:48

మీడియా వార్తలను
వండి వడ్డిస్తుంది

‘గౌరీ లంకేశ్ హత్య’

‘ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు’

‘ఆన్‌లైన్ ఊబిలో మరెన్నో బ్లూవేల్స్’

ఇది పక్కా లెక్క భూ రికార్డుల శుద్ధీకరణ

‘డిసెంబర్ నాటికి ఇంటింటికి నీళ్లు’

‘ఎన్ని అడ్డంకులు ఎదురైనా
ప్రాజెక్టులు కట్టి తీరుతాం’

‘అమరావతి డిజైన్లు రాజవౌళి పరిశీలనకు’

‘సన్యాసినిపై సామూహిక లైంగిక దాడి’

10/01/2017 - 20:10

సర్కారీ కొలువుకి నెలవైన
అధికారపు అంగట్లో
ఉత్తరాభిముఖ ఆసనం
దక్షిణాదులకమ్ముడుపోయ
మాన మర్యాదలన్నీ మూలగట్టి
అవినీతి అసురార్చనలో
నిస్సహాయ చెమట చుక్కలన్నీ
‘కట్టల’పాము పొట్టలో
పాలుపంచుకునే తీర్థప్రసాదాలౌతాయ
సిగ్గూ-శరాన్నీ... ఆత్మసాక్షిని
అవినీతి సొరచేప నోటికి ఎరగా వేసి
బంగరు పళ్లేన భుజించే భక్ష్యం

10/01/2017 - 19:44

అధికారపు పదవి కోసం కాదు
మమకారపు అమ్మదనం కోసం..
మందులూ మంత్రాలూ మొక్కులంటూ
తిక్కదానిలా తిరిగి తిరిగీ..
నీ కడుపులో నన్ను నిలుపుకున్నావ్
నిలిచి పెరిగే బిడ్డ నీలాంటి అమ్మేనంటూ..
బుగ్గలు చిదమాల్సినవాళ్ళు
ప్రాణాల్ని చిదిమేయబోతే
నీ బ్రతుకు సుఖాల్ని బలిచ్చి
కష్టాల్లో కొట్టుకులాడావు
మనిషికి మనుగడనిచ్చే తల్లి పదవిని నాకిచ్చావు

10/01/2017 - 19:41

ఏకాంతపు ప్రవాహమీది నుంచి
ఒంటరి తెరచాపవై
రెపరెపలాడుతూ వస్తానని
వాగ్దానం చెయ్యలేదూ నువ్వు!
నిమ్మళపు జల ఫలకమీద
చిల్లుల గుడారానివై వాలి
జీవన గర్భంలోంచి
తడి అనుభవాలను తొడి తెచ్చి
కుమ్మరిస్తానని వొట్టేసి చెప్పలేదూ నువ్వు
వేనవేల కళ్ళ వేణువునై
తీరమీద కూచుని
శోక రాగాల్ను
శ్రుతి చేసుకుంటూనే ఉన్నాను గదా

10/01/2017 - 19:40

‘కూతురు పెళ్లి విషయమై రాఘవయ్య చెవులో పిండిమర పనిచేస్తున్నట్లు పనిచేస్తూనే వుంది రాజమ్మ. రాజమ్మకు కూతురు దొడ్లో తోటకూర మొక్క పెరిగినట్లుగా పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది. ఏదో విధంగా ఎందరికో పెళ్లిళ్లవుతున్నాయి. మరి దీనికి కాదేం?- ఇదీ ఆ మధ్యతరగతి దంపతుల ఆవేదన.

Pages