S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

08/27/2017 - 22:30

కవిత్వానికి ఒక తాత్విక భూమికను ఏర్పాటు చేసుకుని క్లుప్తత, గుప్తత పాటిస్తుంటే అనుభూతి గొప్ప సార్వజనీనకమై పోతుంది. ప్రాంతీయ స్పృహను, వర్గ స్పృహతో ఉద్యమింప చేసే వాళ్ల జాతీయ బూర్జువా స్థానిక బూర్జువా, పెటీ బూర్జువా ఉద్యమాలు కవి జీవనం మీద విశేష ప్రభావం చూపుతాయి.

08/20/2017 - 22:23

అక్షరాలకక్షరాలే అదృశ్యమైపోతున్న నేటి కాలానికి ప్రామాణికమైన నిఘంటువులూ క్రమక్రమంగా కనుమరుగౌతూ సరికొత్త సంక్షిప్త రూపంలో సాక్షాత్కరిస్తున్నాయి. తదనుగుణంగానే పదాలు తగ్గిపోతూ వున్నాయి. వ్యవహారంలో సైతం అర్థరహిత పదాలు, పదబంధాలు వచ్చి వాలుతున్నాయి. వ్యాకరణమొప్పని మాటల దాడికి దేహభాగాలు అస్తవ్యస్తవౌతున్నాయి. ఎప్పటికప్పుడు ఉన్న మాటలతోనే పని కానిచ్చుకుందామనే కొంచెతనానికి అలవాటుపడిపోతున్నాం.

08/20/2017 - 23:06

వెతుకుతున్నా
ఏదో పోయిందని కాదు
ఏదైనా దొరుకుతుందేమోనని!
అదేదైనా కావచ్చు
జారిపోయిన జ్ఞాపకమో
పైలా పచ్చీసు నాడు
ఒడిసి పట్టలేని వాల్చూపో!
పోతు పోతు ఎవరో ఒకరు
విసిరేసిన జ్ఞాన శకలమో
జీవన భాష నెరిగిన వారు
ధారబోసిన పిడికెడు ఆనుభవాలో
అంతా ఒకే దగ్గర దొరకడానికి
అనుభవాలకు బిగ్ బజార్లుండవ్
మనమేమైనా కదలని కొండలమా

08/20/2017 - 22:21

రైలు కంపార్ట్‌మెంట్‌లో ఒక బెర్త్ అంతా ఆక్రమించుకుని కూర్చున్నాడు డాక్టర్ రాజారావు. అయితే పక్క స్టేషన్‌లో ఎక్కిన ‘రాత్రంతా నిద్రలేక ఎర్రబారిన కళ్ళలో కనిపిస్తున్న దీనత్వం, అసహాయత్వం, తోటి ప్రయాణికుల రాతి గుండెలూ’ చూచి సత్యవతికి చోటు ఇచ్చాడు తన పక్క చుట్ట కొంచెం జరిపి. ఆమె మదనపల్లి క్షయ ఆస్పత్రినుంచి వస్తోందనీ, ఇంకా రోగం పూర్తిగా నయం కాలేదని తెలుసుకుంటాడు.

08/20/2017 - 22:21

కవులు, రచయితలు నిరంకుశులు. వారు తాము సత్యమని నమ్మినదాన్ని ఎవరికెంత ఆగ్రహం వచ్చినా పట్టించుకోకుండా తమ రచనల ద్వారా ప్రకటిస్తారు. ఎవరి మెప్పుకోలో, ఎవరి పొగడ్తలందుతాయనో, ఇలా రాస్తేనే ఉత్తమ కథగా ఎంపికవుతుందనో, అవార్డులువస్తాయనో రాసేవారు గాలి ఎటువీస్తే అటు కొట్టుకుపోయే వ్యక్తిత్వం లేని వుట్టి రచయితలు.

08/13/2017 - 23:02

సుమారు ఎనిమిది దశాబ్దాలుగా తెలుగు ఆకాశవాణి వివిధ రంగాలకు తన వెలుగు పుంజాలను పంచుతోంది. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే రేడియో ప్రసారాలు భారతదేశంలో ఏమాత్రం ఆలస్యం కాకుండా మొదలయ్యాయి. రేడియో ప్రసారాలలో భాషాపరమైన వైవిధ్యం తొలిదశ నుంచే రేడియోలో ప్రతిఫలించడం మరో పోకడ! 1938 జూన్ 6న మద్రాసు ఆకాశవాణి మొదలైంది. అప్పటికి దేశంలో ఎన్నో రేడియో కేంద్రాలు లేవు.

08/13/2017 - 23:02

ఎక్కడో
తప్పిపోయిన వాళ్ళంతా
ఎక్కడో అక్కడ ఎదురై
పల్కరించగానే
ఆశ్చర్యపడిపోవడం నీ వంతు,
ముడతలు పడిన
ముఖ వర్చస్సుపై
నడచివచ్చిన కాలాన్ని
లెక్కించి
శేషభాగాన్ని
అంచనా వేసేలోగా
ఆచూకి దొరకని వాళ్లే
ఎటుచూసినా!
- నిఖిలేశ్వర్
బిగించు పిడికిలి

08/13/2017 - 23:01

మనిషిని మనిషి కాల్చుకు తినడం మానవ చరిత్రలో సర్వసాధారణమైన విషయమే. అయినా ఇందుకు కులాలు, వర్గాలు, వాటిమధ్య ఉండే అభిప్రాయ భేదాలు కారణం అనుకోవడం కూడా సాంఘిక పరిణామంలో భాగం అయిపోయింది.

08/13/2017 - 23:00

నన్నయకు పూర్వం తెలుగులో సాహిత్యమున్నదని అది జైన సాహిత్యమని మొదటిసారిగా ‘ప్రబంధ రత్నావళి’ అనే గ్రంథంలో వేటూరి ప్రభాకర శాస్ర్తీగారు ప్రకటించారు. అలాగే 15 శతాబ్దికి చెందిన అమరావతి స్తూపంలో ‘నాగబు’ అను శబ్దం ఉన్నదనీ దానిలో ‘బు’ అనునది అమహద్వాచక ప్రధానమైన వచన ప్రత్యాయమైన ‘ము’ వర్ణమునకు రూపాంతరమని అదే తొలి తెలుగు మాట అని వేటూరి ప్రభాకర శాస్ర్తీ అభిప్రాయపడ్డారు.

08/06/2017 - 23:35

‘‘కాదేదీ కవిత కనర్హం’’ అన్న ప్రకటన పలుమార్లు, పలు విధాలుగా, పలు ప్రభావాల పరంగా మరచిపోతుంటారు, ఆపై శూన్యావరణంలో చొరబడి గింజుకుంటూ ఉంటారు సృజనకారులు. అంతరంగంలో అలజడితో ఊగిపోతూ ఉంటారు, చుక్కాని లేని నావలా పయనిస్తూ ఉంటారు.

Pages