S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

08/06/2017 - 23:34

మీ వరకూ చేరాలని
అక్షర ప్రయాణం చేస్తుంటాను

పేజీల తరువాత పేజీలు
రాస్తూ, కొట్టివేస్తూ
మళ్లీ రాస్తూ, చించేస్తూ
నన్ను మీరు చించేయరన్న ఆశతోనే

ఒక్కోమారు మిమ్మల్ని రాస్తూ
నన్ను నేను రాసుకుంటున్నాను
నన్ను నేను రాసుకుంటూ
మిమ్మల్నీ రాస్తున్నాను

నన్ను నేను చెప్పుకుంటూ పోతున్నా
మిమ్మల్ని చదవాలన్న ప్రయత్నమే ఎప్పుడూ

08/06/2017 - 23:33

అంటే ఏందో
అనకుంటే ఏందో
ప్రాణం ఎల్లుక పోతుంటే
చూసుకుంటూ చూసుకుంటూ
పచ్చి మంచి నీళ్లు పొయ్యని
క్షమాధర్మంలేని కఠిన కాలం
ఎవరికి వారు ఎక్కడికి అక్కడ
కట్టడి చేసుకుంటున్న ఇష్ట కాలం

08/06/2017 - 23:33

కలనేత పుస్తకంతో 1999లో కవిత్వ యాత్ర ప్రారంభించి మాట్లాడుకోవాలి (2007), నాన్న చెట్టు (2010), పూలందోయ్ పూలు (2014), ఇపుడు చేనుగట్టుపియానో (2016)తో ప్రముఖ కవిగా ఎదిగిన బి.ప్రసాదమూర్తి కవిత్వాన్ని చదువుతుంటే ఎందుకో తిలక్ అమృతం కురిసిన రాత్రి గుర్తొచ్చింది. సామాజికాభ్యుదయంలో గానీ, అద్భుత కవితాశక్తిలోగానీ ప్రసాదమూర్తి కవిత్వం తిలక్ కవిత్వానికి దగ్గరగా వుంది.

08/06/2017 - 23:32

‘వివాహం అనేది వ్యక్తిగత సమస్య. ఒక సందిగ్ధం వచ్చినపుడు పరిస్థితులన్నీ సమీకరించుకుని ఎవరికివారే నిర్ణయం తీసుకోవాలిగాని- ‘తాము ఏమి చేయాలో నిర్ణయించమని ఇతరులను కోరకూడదు’- ఈ విషయం చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు- అదీ తాను ప్రేమించి పెళ్లి చేసుకోకుండా వదిలిన ప్రేమికురాలు నోటిమీదుగా; ‘కన్నుల వెలుగు’ అనే సుసంపన్నమయిన కథానికలో. ఈ కథానిక రచయిత ఆర్.యస్.సుదర్శన్.

07/30/2017 - 22:49

తెలుగు కథ అనగానే కొందరు రచయితల పేర్లు తప్పనిసరిగా వినబడతాయి. కొన్ని కథల పేర్లు తప్పనిసరిగా ఉదాహరిస్తారు. ఇవే కథలు, అవే పేర్లు పలుమార్లు పదే పదే ప్రస్తావిస్తుండటంతో ఆయా పేర్లు ప్రామాణికంగా నిలిచిపోతున్నాయి. దాంతో తెలుగు కథలో పలు ప్రయోగాలు చేసి, నూతన పోకడలు పోయి, కథా ప్రపంచాన్ని పరిపుష్టం చేసిన అనేక కథా రచయితలు, అతి గొప్ప కథలు ప్రస్తావనకు రావటం లేదు. సాహిత్య పిపాసులకు అందటంలేదు.

07/30/2017 - 22:48

ఓ సాయం సంధ్యావేళ
మన తీపి జ్ఞాపకాలను
నెమరు వేసుకుంటూ
నిశ్శబ్ద తీరాన
ఒంటరి పక్షినై...
వౌన వీణ మధుర స్మృతుల
తీగలను మీటాను!
ఇంకేముంది?
చిటపట చినుకుల్లో
మనం తడిసి ముద్దై...
ముద్దుగా పంచుకున్న
అనుభూతులు...
ఎంచక్కా ఒక్కొక్కటి
నా మనోవేదికపై...
నర్తించసాగాయి!
నా అంతరంగ వాకిట
హరివిల్లును తలపించేలా..

07/30/2017 - 22:47

ఊపిరులూదాల్సిన తరుణం
స్పందించాల్సిన సంక్లిష్ట సమయం
శక్తి జాగృతమై
సోమరితనం దూరం చేసుకోవాల్సిన అవసరం
సృజన దీపమై వెలిగించాల్సిన కర్తవ్యం
కరువు వెక్కిరింతలో మొక్కతో సమాధానం
దినచర్య ఆరంభమే శ్రమదానం
దేశ భాగ్యరేఖల్ని మార్చే క్రమంలో
సుందర స్వప్న సాకార మార్గంలో
పులకించని పుడమి
ఆకులు పూలు తీగలుగా తొడిగి
ఆశలో
మహర్దశలో

07/30/2017 - 22:44

ఆకాశవాణి కళానిలయం. రకరకాల కళాకారులు, సాహితీవేత్తలు, రాజకీయ నాయకులు, అధికారులు - ఇలా పలు రంగాలకు చెందిన ప్రముఖులు రోజూ అక్కడికి వస్తూంటారు. విలువైన వారి వాణిని రికార్డు చేసి, శ్రోతలకు వినిపిస్తూంటారు. అలాంటి ఆకాశవాణిలో శంకర నారాయణ 32 సంవత్సరాలపాటు పనిచేశారు.

07/30/2017 - 22:43

భార్యాభర్తల మధ్య మూడో మనిషి (ఆడ అయినా సరే, మగ అయినా సరే) ప్రవేశిస్తే ఇక ఆ సంసారం గట్టుఎక్కినట్లే. గట్టు ఎక్కిన సంసారాన్ని సరిచేసుకోవడం ఎట్లా? ‘దిద్దుబాటు’ చేసుకోవడం ఎట్లాగో ఎప్పుడో చినప్పుడు (1910లో) కీ.శే. గురజాడ అప్పారావు పంతులుగారు చెప్పనే చెప్పారు. వేశ్యాలోలుడు అయిన మనిషిని మరల్చుకోవటానికి ఒక తమాషా ప్రదర్శిస్తుంది ఆ కథలో కమలిని. అన్ని కథలూ అంత తేలికగా దిద్దుబాటు సర్దుబాటు కావు.

07/23/2017 - 23:10

ఆర్ష సంప్రదాయ కవిత్వంలో
నాది క్రొత్త త్రోవ: నాది ఉషనిషన్మార్గం

Pages