S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

05/22/2017 - 22:44

గుంపులోనుంచి
ఒక్క తల ఉప్పొంగింది
ఉప్పొంగిన ఆ తల ముఖంలోనుంచి
మాటల ఈటెలు పొడుచుకొస్తున్నాయ
గుంపులోని జాగృత జిహ్వలు
ఆ మాటలకు పరవశించి
మరిన్ని వచోధారలను
వర్షిస్తున్నాయ.
గుంపు మరింత వేగంతో
విక్రమిస్తున్నది
ఆ ఒక్క తల
ఎన్నో జాగృత జిహ్వలకు
జ్వలత్ వాక్కులందించింది

05/22/2017 - 22:43

స్వయం జనితాలు-
ఎవరివి వారివి, ఎప్పటివి అప్పటివి
ఎక్కడివి అక్కడివి
ఒకరివి ఒకరు కించబరచడమా!?
ఇదెట్లా?
నీ ఇంట్లోకి నీకు తెలియకుండా ఎవర్రాగలరు?
నీ అనుమతి లేకుండా
నీలోకెవరు చొరబడగలరు?
నినె్నవరు కించపరచగలరు?
నిన్ను నీవు తెరచుకుని
స్వాగతించినప్పుడే మరొకరి ప్రవేశం
స్వయంకృత క్షుభిత మనోభావాలా!
పారించే ఉద్వేగ లావాలా?

05/22/2017 - 22:42

ఆ మొండి కోటగోడలు
ఎంత వైభవాన్ని
ఎన్ని ఉద్వేగాలను చవి చూడలేదు?
ఎన్ని దౌర్జన్యాలను
ఎన్ని దుర్మార్గాలను
నేలమట్టం చేస్తుంటే
భయంతో కళ్ళు మూయలేదు!
గోడలకు చెవులుంటాయి కాని
నోళ్ళుంటాయా?
గుట్టు విప్పడానికి!
ఆ రాజుల వీరత్వం
ఆ రాణుల ప్రేమ పురాణం
వారి విచ్చలవిడితనం
వారి విలాసాలు విలాపాలు
అన్నీ మట్టికొట్టుకపోయినవి

05/22/2017 - 22:40

ఇంగ్లీషు చదువులు, వీడియో గేమ్స్, కార్టూన్ నెట్‌వర్క్‌ల మధ్య నలిగిపోతున్న నగరాల్లోని
బాల బాలికల కోసం ప్రత్యేకంగా బాల
రంగస్థలం రూపుదిద్దుకోవాల్సి ఉంది.
మారుతున్న సమాజ జీవిత విలువల్ని నేర్పించే కొత్త స్క్రిప్ట్‌లు రావాల్సిన అవసరం ఉంది.

05/22/2017 - 22:39

తుపాకులతో- తూటాలతో,
డైనమెట్లతో, మందుపాతరలతో సామాజిక ఆస్తులను ధ్వంసం చేస్తూ, అమాయక ప్రజల ధన
మాన ప్రాణాలను బలి తీసుకునే వారిని ప్రేరేపించటానికి, పోరాటవాదులకే బ్రతికే హక్కు- మిగతావారికి
ఆ హక్కు లేదు అని వాదించే కుహనా మానవ పౌర హక్కుల
సంఘాలను ఉసిగొల్పడానికి, సమాజ ప్రశాంతతను సమూలంగా నాశనం చేయడానికి, జాతి
సమైక్యతను దెబ్బతీయటానికి

05/14/2017 - 21:53

దూరం
బహుప్రమాదకరమైంది.
నువ్వొకటి తలిస్తే
వాళ్ళకు మరోటి అందుతుంది.
ఇక్కడ పూచిన పువ్వు
మన ఊరిలో
మరోలా పరిమళిస్తుంది.

05/14/2017 - 21:51

నేడు వివిధ భాషాచషకాల్లోంచి గజల్ మధుధారలు ప్రపంచ సాహితీ సంగీత ప్రియుల గొంతుల్ని తడపడమే కాదు, గుండెల్లి ‘తడి’ చేస్తున్న విషయం సాహిత్యాభిమానులకు కొత్తగా చెప్పనవసరం లేదు. సాహితీ ప్రక్రియ ఎంత పాతదైనా భావం గుప్పుమన్నప్పుడు హృదయ లయలో చప్పున క్రియా యోగ సంయోగం జరుగుతుందనడంలో సందేహమవసరం లేదు.

05/14/2017 - 21:50

ఎనె్నన్నో ఊహలు
ఎనె్నన్నో కలలు
తృప్తిపడని కోరికలు
పుట్టుకొచ్చే కోటి ఆశలు
ప్రయత్న లోపం
కలగా మిగిలిన ఫలం

నుదుటి రాతలు
అరచేతి గీతలు
రాశిఫలాల్లో దాగిన జాతకాలు
రాజపూజ్యం - అవమానాల బేరీజు
ఓ వైపు తృప్తి, మరోవైపు లేదు

05/14/2017 - 21:48

మూడు కాళ్ల మేక
నవరసభరిత కథా సంపుటి
రచన: కల్లూరు రాఘవేంద్రరావు
ప్రచురణ:
శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల,
హిందూపురం- 515201
పేజీలు: 152, ధర: రు.70/-
**

05/14/2017 - 21:47

మట్టిని నమ్ముకుని
కాసింత బతుకుని
మిరప నారుగా వుడుసుకొని
రైతు మనసు రెపరెపలాడుతుంది.

పంటంటే
అప్పటిలా కాదు
ఎటుచూసినా మదుపులే.

నీరు కడుతున్నపుడు
గాబు ఎగురుతున్నపుడు
మందులు పులుముతున్నపుడు
మిరపకాయలు కోస్తున్నపుడు
ఇంకా ఆఖరికి గుడారంకి చేర్చే దాకా
అన్నీ ఖర్చులే.

Pages