S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

04/16/2017 - 21:58

ఊరు మన తల్లివేరు
కాదనను, నిజమే కాని
ఊరు ఒక్క తీరుగా తీరు చెప్పమని
పోరు పెడుతుంది

ఇప్పుడు
ఊరు గురించి రాయడం
చెట్టులేని చోట
కోకిలలా కూయడం

పట్నం ఒక నిమాయష్
ఇది అరొక్కటిని అమ్ముతుంది
అందరినీ కమ్ముతుంది
ఊరు బతికి చెడ్డది
మనసు నానుమాల పడ్డది

04/16/2017 - 21:56

‘సాహిత్యం’ అనేది విస్తృతమైన పదం. సహితమైనది సాహిత్యమనీ, శబ్దార్థాల కలయిక సాహిత్యమనీ చెప్పారు. సాహిత్యమనేది అక్షరార్చన. ఒక తపనగా వుండాలి. విశ్వనాథ వారి మాటల్లో అదొక జీవుని వేదన. అక్షరార్చనాపరుడికి జాషువా ప్రకటించిన ‘ఆర్ద్ర హృదయం’ ఎంత అవసరమో శ్రీశ్రీ వెల్లడించిన కవితావేశమూ అంతే అవసరం. అయితే ఈ ఆవేశం తిక్కన నిర్దేశించినట్టు ‘్భవ్య కవితావేశం’గా వుండాలి. సాహిత్యం కాలమనే ‘యాసిడ్ టెస్ట్’కి నిలవాలి.

04/16/2017 - 21:56

కవిత్వం దుకాణానికి తాళం
నిన్ననే మూసేసాను

దివాలా
పాఠకులు లేరు

ఈమధ్యంతా
మాత్రాధిక ప్రేమతో
కంపిస్తున్నా
ఎవరితో మాట్లాడినా
కళ్ళల్లో నీళ్ళు

102 డెంగీ జ్వరం
తగ్గదు

ఇలాగె చచ్చిపోతానేమో
వార్తలేమీ రాయొద్దు
నా స్మృతిలో
టేబుల్ మీద
ఒక పువ్వు చాలు

04/16/2017 - 21:55

ఊరు ఊరంతా ఒడికట్టుకొని
ఒక్కొక్కటిగా ముడివిప్పి
తినిపించే మా నాయినమ్మకు
నేనంటే మాగావురం

తల్లికోడై ఒడుపుగా తిప్పుతూ
ఆచితూచి అడుగేయడం నేర్పేది
సంక దించకుండానే చాలా పనులు చక్కదిద్దేది
నావల్ల నష్టం జరిగినా యిష్టపడేది కాదు
నాయిన, అవ్వకొట్టినపుడు
నాకు రక్షణ వలయమై నిలిచేది

04/16/2017 - 21:53

సాహిత్యం ప్రజలను చైతన్యపరుస్తుంది. ఆరోజుల్లో ఆంగ్లేయుల కబంధ హస్తాలనుండి బయటపడేందుకు ఎందరో కవులు దేశభక్తి గీతాలను రాసి ప్రజలను చైతన్యవంతులను చేసారు. కథైనా, నాటకమైనా సమాజంలోని సమస్యలను వెలికితీయడమే ప్రధాన ఉద్దేశ్యం. ఆధునిక తెలుగు కథానిక 1910 సంవత్సరంలో మహాకవి గురజాడ అప్పారావు చేతిలో ఆవిర్భవించింది.

04/16/2017 - 21:52

ఏ ప్రక్రియకు సంబంధించినా గత అయదేళ్లలో అచ్చయన వ్యాఖ్యాన గ్రంథాలను ద్వానా సాహితీ కుటీర పురస్కారాలకు పంపించాలని కినె్నర ఆర్ట్ ధియేటర్స్ కార్యదర్శి మద్దాళి రఘురామ్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండు ప్రతుల చొప్పున కింది చిరునామాకు మే 15వ తేదీలోగా పంపించాలి. పురస్కారం కింద పదివేల నగదు, జ్ఞాపిక అందజేయబడును.

04/16/2017 - 21:52

‘మట్టి తడి బంధాల్లో’ (కవితా సంపుటి) మొలకెత్తిన కొండ్రెడ్డి సాహిత్యం చిగిరింతలు (నానీలు)తో చింతనలు (నానీలు) తోనూ-తొమ్మిది కవితా సంపుటాలతో, సంస్పర్శ, ఆలోకనం వ్యాసాలతో నవనవోనే్మషమై అనంతానే్వషణ దిశగా పయనిస్తోంది. నవ దృక్పథం సాహిత్య వ్యాసాలలో ‘అనంతానే్వషణ దిశగా’...మొదటి శీర్షిక.

04/09/2017 - 22:11

వెండి గొలుసుల లంకె వేసి
ప్రచండమగు నీ నీలి తెరల
తూర్పు వాకిలి తలపు రెక్కల
తొలగ లాగెదరెవ్వరో
- అంటూ గత శతాబ్దం తొలి నాళ్ళలోనే తెలుగు వాకిట నవకవితా యుగోదయానికి బాటలు వేసిన యుగకర్త యుగోదయ ద్రష్ట భావకవితా పితామహుడు, ప్రముఖ కవి దార్శనికుడు ఆచార్య రాయప్రోలు సుబ్బారావు.

04/09/2017 - 22:09

దుఃఖించే ప్రతి సందర్భంలో కారే కన్నీరు
అక్కరకు రాని అకాల వర్షం లాంటిది.
దుఃఖించే కారణం
మహాసముద్రమంత లోతైనదై ఉండాలి!
వ్యధ ఆవర్తనమై కొనసాగాలి.
పీడించే జ్ఞాపకాలు కన్నీటి సుడులై తిరగాలి.
దానికి దుఃఖం వాయువులా
తోడై గుండంలా మారాలి!
స్పష్టమైన వినీలాకాశం
మేఘావృతమై మసకేసినట్లు,
రెప్పచాటు యదార్ధం
అశ్రురూపధారియై అస్పష్టమవ్వాలి!

04/09/2017 - 22:08

మెను పురాణేతిహాసాలలో
తిరుగులేని ఆధిక్యతను ప్రతిష్టించి
వర్తమానంలో దగాచేస్తాం
అరచేతి వైకుంఠంలో
ఆకాశమంత ఎత్తున అధిష్టింపజేసి
ఆచరణలో అర్ధబానిసను చేస్తాం
నియమాలు, నిషేధాలు ఆమె చుట్టూ
సంకెళ్ళుగా బిగించి
మన పరిధికి హద్దులు చెరిపేసుకుంటాం
ఆమె బతుకులో కట్నాల కష్టాలు పేర్చి
ఆమెలో మానసిక అశాంతిని రగిలిస్తాం
ఐనా... ఆమె

Pages