S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

10/09/2016 - 20:40

...............
రామమూర్తిగారు సవర భాషకు లిపిని రూపొందించారని

10/03/2016 - 04:32

దినదినం బతుకున్నమో
క్షణక్షణం చచ్చిపోతున్నమో
పెయ్యంతా పొగల పొగల ఆవిరి
కొద్దికొద్దిగా మొద్దు మార్చుతున్న తిమ్మిరి

పడుకుంటే లేస్తే నడిస్తే
పనిచేస్తే గడిస్తే తడిస్తే
ఏదో అతిగొట్టుగా
గుట్టుగా పోగొట్టుకుంటాం

వయస్సు మనస్సు
సవ్వా సూటిగా ఒక్కటిగా
నదిలా ప్రవహిస్తున్నప్పుడు
ఒకరికొకరు పరిచయం కాలేరు

10/03/2016 - 04:30

గతమే తప్ప
వర్తమానమంతా
గిరగీసిన దూరమై,
చెప్పినదే పదే పదే-
వల్లెవేస్తే,
వింటున్న వాడికి
మహా సుత్తి పోటై
పరిచితులంతా దూరమైపోయే
మలి దశలోని ఒంటరితనం
ఎవరూ పంచుకోలేని ముసలితనం!
వృద్ధాశ్రమాల తలుపులు కూడా-
తట్టలేని నిరాశ్రయులు
వయస్సు కాటేసిన విగత జీవులు,
మీకు ఎదురైతే తప్పుకోకండి
వారికి మీ చేతనైన సహాయం-

10/03/2016 - 04:28

ఏ భాషా సాహిత్యంలోనైనా వీరువారనకుండా అందరినీ అలరించే, ఆలోచింపజేసే ప్రక్రియ ‘నాటకం’. చదువు అక్కరలేదు, చదవనక్కరలేదు, కళ్ళు, చెవులుంటే చాలు నాటకం సొంతమవుతుంది. పాత్రల సంభాషణల ఆధారంగా కథ సాగిపోయే ఈ ఆబాల గోపాల మనోరంజకం క్రమంగా కనుమరుగవుతున్న సంకేతాలు వర్తమాన తెలుగు సాహిత్యంలో స్పష్టంగా కనిపిస్తున్నాయంటే నిష్ఠురంగా అనిపించవచ్చు. నాటక రచన సాలు సాగుతూ ఉంటేనే రంగస్థలంపై దీపాలు వెలుగుతాయి.

10/02/2016 - 23:00

అవధాన విద్యా సర్వస్వము
రచన: డా. రాపాక ఏకాంబరాచార్య
పుటలు: 1100, వెల: 1000=00;

10/02/2016 - 22:12

కథా రచయిత కూడా మొదటిలో కథా చదువరే. ఎక్కడో ఓ మంచి కథ చదివిన తరువాత అతనికి కూడా కథలు రాయాలనే సంకల్పం కలుగుతుంది. తనకు తెలిసిన జీవితాన్ని గురించి కథలు వ్రాస్తాడు. చదువరిగా అతనికి వున్న పరిణతిని ఆధారం చేసుకుని ప్రపంచ పోకడలు అర్థంచేసుకుంటాడు. కథలు రాయటానికి ఉబలాటం ఒక్కటే వుంటే చాలదు తెలుసుకుంటాడు. ప్రతి కథలోనూ యేదో సందేశం. స్పష్టంగానో సూచనగానో కనిపించాలి.

09/25/2016 - 22:14

సంధ్యనుపాసిస్తున్న
నన్ను
‘‘మసక నిశ్శబ్దం’’ చుట్టేసుకొంది
సూర్యుడావలించి అటు వెళ్తూ వెళ్తూ
ఎంత విషాద మోహనంగా చూశాడని
కలల పరిమళాన్ని మేలుకొలిపే
మంత్రనగరి పొలిమేర వైపు...

09/25/2016 - 22:12

వాఙ్మయ చరిత్రకారుడికి కులతత్వం వుండకూడదు. భావజాల సంకుచితత్వం వుండకూడదు. సమకాలీన ద్వేషం ఉండకూడదు. ప్రత్యర్థి భావజాలాన్ని కూడా స్వీకరించగలిగిన ధైర్యం కావాలి. విమర్శను సహించగలిగిన ఓర్పు, సమ్యక్ దర్శనం కావాలి. ప్రత్యర్థిని అర్థం చేసుకోవడం వల్లే తన వ్యక్తిత్వాన్ని పెంచుకోగలగాలి (పుట-240). కొందరు ఎక్కువ చదువుతారు. రాయలేరు. కొందరు ఎక్కువ రాస్తారు. దానివెంట అధ్యయనం ఉండదు (పుట.446).

09/25/2016 - 22:09

కులమతాలు గీచుకున్న గీతలుజొచ్చి
పంజరాన కట్టువరను నేను
నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు
తరుగులేదు విశ్వనరుడ నేను
(జాషువ: నేను)

09/25/2016 - 22:16

చిన్నారుల నవ్వుల్తో
ఇంద్రధనసు వంతెనల్ని
కడుతున్నాను
స్వేచ్ఛాగీతాల్ని సరిహద్దులు దాటించేందుకు
పావుర సైన్యాన్ని పెంచుతున్నాను
వసంతాల సుమగంధాలను శ్వాసిస్తూ
ఎడారిలో మోడుల్ని
పల్లవింపచేస్తున్నాను
గుండె వంతెనలో
జలధారల్ని ఒడిసిపడుతూ
కాల్వల్లోకి తోడేస్తున్నాను
పరవళ్లు తొక్కే నదినై
బీళ్లకు పచ్చదనాన్ని అతికిస్తున్నాను

Pages