S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

09/11/2016 - 23:06

ఆదాయ వ్యయాలతో సుఖాన్ని అంచనా వెయ్యొచ్చు కానీ
ఆదాయ వ్యయాలతో ఆనందాన్ని కొలవలేము
కోటిమంది ముందు నటించే హీరోకు కోట్ల రూపాయలిస్తారు
పత్రికలో కనిపించినా ఒకోసారి కవికి పైసా కూడా అందదు
హీరో నటిస్తాడు - కవి జీవిస్తాడు
పాఠక దేవుళ్ళయినా, వీక్షక దేవుళ్ళయినా
డబ్బులిచ్చుకోందే వినోదాన్ని పుచ్చుకోలేరు
వివేకం నిండిన కవికి విలువ కట్టలేం

09/11/2016 - 23:04

ఊపిరి కొనల మీద
అగ్నిజ్వాల రగులుతోంది

ఉడికిన కళింగాంధ్ర జీవితాల మీద
అణు విద్యుత్ కొవ్వాడ
విధ్వంస దృశ్యమవబోతోంది

మరో దుఃఖానికి
సన్నాహమవుతోంది

చినుకుల్ని దున్నుకున్నట్లు
ప్రమాదాల్ని మోయలేం
అణు విధ్వంసాల్ని ఆపలేం

09/11/2016 - 23:02

చిలుకూరి నారాయణరావు నిత్యపరిశోధకుడు.
రాత్రింబవళ్ళు ఏదో వ్రాయడంలోనూ,
పరిశీలించడంలోనూ, చదవడంలోనూ
నిమగ్నులై ఉండేవారు. వారు చారిత్రక
పరిశోధనల మీద ఎక్కువ మక్కువ
చూపుతూ వచ్చారు. వారు తామ్ర
శాసనాలను చదవడం, శిలాశాసనాలను నకలు చేసుకుని పరిష్కరించడం,
తాటాకు గ్రంథాలని సేకరించడం..
వంటి వాటి మీద ఎక్కువ మక్కువ
చూపించేవారు.

09/11/2016 - 21:56

ప్రతులకు
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,
గిరిప్రసాద్ భవన్,
బండ్లగూడ, నాగోల్
వెల: రు.290/-

09/04/2016 - 20:51

.........................
ఒకప్పుడు రాజనీతిలో సరళమైన కవిత్వం ఉండేది. ఇప్పుడు కవిత్వమంతా రాజకీయమే అయి కూర్చుంది. అది వినోదాత్మక అంశంగా, అగ్రెస్సివ్
విషయాలు చెప్పే సాధనంగా
మారిపోయింది. సామాన్యుని స్థాయిని బిందువు వద్ద, స్థిరంగా ఉండే సాహిత్య సృష్టి చేసినంతకాలం కవిత్వంలో
విలువలు వెతికినా దొరకవు.
..........................

09/04/2016 - 20:48

ఎన్నో, ఎనె్నన్నో
దిగులు కళ్లలో
దుఃఖ చలనాల వౌన నీడల్ని చూశాను
బావురుమనే గుండె ఏడ్పుల్ని విన్నాను
కొనిన వేల చావుల్ని చూశాను
స్పష్టా స్పష్ట రూపాలను వెతుక్కుంటూ
ఎందరివని ఓదార్చను?
అయనా ఎక్కడెక్కడో తిరిగాను
చీకటి బావుల్లాంటి కళ్లనీ చూశాను
దుఃఖ చారికల్ని తుడిచాను

09/04/2016 - 20:46

ఒద్దిరాజు సోదర కవుల స్మృత్యంకంగా వరంగల్లులోని సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ అందిస్తున్న సహృదయ సాహితీ పురస్కారం 2016 సంవత్సరానికి గాను ప్రసిద్ధ విమర్శకులు డా. లక్ష్మణ చక్రవర్తి రచించిన ‘ప్రతిబింబం’ సాహిత్య విమర్శ గ్రంథం ఎంపికైంది. లక్ష్మణ చక్రవర్తి తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

09/04/2016 - 20:45

కొందరు రచయితలు పూర్తిగా ఉత్తరాలతోనే కథనంతటినీ నింపివేస్తారు. కొందరయితే కేవలం సంభాషణలతోనే అంతా నడుపుతారు. అలాగే కథంతా వర్ణనలతోనే నింపేసే రచయితలు కూడా వున్నారు. ఏ పద్ధతి అవలంబించినా ముఖ్యంగా గమనించవలసిన విషయం యేమిటంటే కథ నడవాలి. పాత్రలను కాగితం మీద చదువరిని మన్ఫఃలకం మీద ముందుకు లాక్కుపోవాలి. అలా ఉత్కంఠ భరితంగా కథ నడిచినప్పుడు యే పద్ధతిలో రాసేం అనేది గుర్తురాదు.

09/04/2016 - 20:43

మబ్బులు ముసురు సితారా
సంగీతం వెదజల్లుతున్నప్పుడు
నాలో ఒక ఊహ ఏమనుకుంటున్నది

కాలు భూమిమీద మోపకముందే
తడితడయిన చెల్కమించి
పిట్టపాట
మనసును పదును చేసి పోయింది

రోజుల తరబడి ముడుచుకున్న ఆశ
మూటలోనుంచి విప్పుకుంటున్నది

తుంపర తుంపర నడుమ గొర్రుగొడుతున్న
దాపటి ఎద్దు కండ్లల్లనుంచి
కరువు జారిపోతున్నది

09/04/2016 - 20:42

...........
తెలంగాణ మాండలికంలో చిరుపొత్తంగా వెలువడిన అశ్వశాస్త్రం అరుదైన పుస్తకం. సహదేవ
పశువైద్యశాస్త్రం
తెలుగులో ప్రాచుర్యంలో వుంది. కాని
కవి పండితులెవ్వరూ
అశ్వశాస్త్రం రాసిన
దాఖలాలు లేవు.
..................

Pages