S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

01/17/2017 - 21:25

ఆలూస్ కార్నిలియస్ సెల్సస్ (AULUS CORNELIUS CELSUS) అనే పేరుగల రోమన్ విద్యావేత్త (1వ శతాబ్దం ఎ.డి) ప్లాస్టిక్ సర్జరీ సాంకేతిక మెళకువలకు ఆద్యుడు. దెబ్బతిన్న లేదా గాయపడ్డ అవయవాలను ఈ సర్జరీ ద్వారా పునర్‌నిర్మాణం గావించిన తొలి భారతీయ వైద్య పితామహుడు శుశృతుడు. ఈనాటి ప్లాస్టిక్ సర్జరీకి పోలిన శస్త్ర చికిత్సలు 800 బి.సిలోనే శుశృతుడు చేపట్టారు.

01/17/2017 - 21:22

రక్తనాళాలలో అడ్డంకులవల్ల రక్తప్రసరణ సరిగా జరగక ‘గుండెపోటు’ రావచ్చు. గుండె కండరాలు దెబ్బతినడంవల్ల ‘కార్డియో మయోపతి’ రావచ్చు. అంటే గుండె ముడుచుకుని, రక్తాన్ని నాళాల ద్వారా శరీర భాగాలకి పంపే శక్తి తగ్గుతుంది. కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్స్, విటమిన్ లోపం, హార్మోన్ ఉత్పత్తులు సరిగా లేకపోవడం, ఆల్కహాల్ సేవనం, కొన్ని మందులు వాడడంవల్ల ‘కార్డియో మయోపతి’ రావచ్చు. కొన్ని సందర్భాలో కారణం తెలీదు.

01/17/2017 - 21:19

గత సంవత్సరం నగర ప్రజలను వణికించిన స్వైన్‌ఫ్లూ మహమ్మారి ఏడాది తిరగకముందే మళ్లీ వస్తుండటంతో నగర ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలు తెలుసుకుందాం.
లక్షణాలు
స్వైన్‌ఫ్లూ లక్షణాలు దాదాపుగా ఫ్లూ జ్వరం లక్షణాలను పోలి ఉంటాయి. కండరాల నొప్పులు, నీరసంతో మొదలైన రొంప, తుమ్ములు, దగ్గుతోపాటు గొంతునొప్పి, తలనొప్పి, ఆకలి మందగించడం, వికారం, వాంతులు, విరోచనాలు అవుతుంటాయి.

01/17/2017 - 21:17

ప్ర: గుండె జబ్బులున్నవారు మాంసాహారం తినవచ్చా? వివరంగా తెలియపరచగలరు?
కావూరు విద్యాధరరావు, జంగారెడ్డిగూడెం

01/10/2017 - 22:52

ప్రపంచంలో నిమిషానికొక స్ర్తి గర్భం, ప్రసవ సంబంధ కారణాలతో మరణిస్తూంది. 10మంది స్ర్తిలు మరణపు అంచుదాకా వెళ్తున్నారు. 30 మంది స్ర్తిలు దీర్ఘకాలిక అనారోగ్యాలకు గురవుతున్నారు. ఎక్కువ మరణాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో జరుగుతున్నాయి. అందులో అత్యధికులు కౌమార బాలికలు, 15-25 సంవత్సరాల వయసు యువతులలో కంటే 15 సంవత్సరాల లోపు బాలికలలో మాతృమరణాల సంఖ్య ఐదు రెట్లు ఎక్కువ.

01/10/2017 - 22:45

భుజాలకి దెబ్బలు, ఆర్థ్రయిటిస్ బుర్సిటైస్ లేక టెండినైటిస్ లాంటి వాటివల్ల భుజాన్ని కదిలించలేని స్థితి వస్తుంది. భుజ కీలు బిగుసుకుపోవడంవల్ల చేతి కదలికలు కష్టమవుతాయి. కదలికలు చాలా నొప్పిని కలిగిస్తాయి.
చికిత్సలో కీలు కదలికలు మామూలుగా అయ్యేట్టు చూడడంతోబాటు నొప్పి లేకుండా చేస్తారు. యాంటి ఇన్‌ఫ్లమేటరి మందులు వాడతారు. కీళ్ళలోకి కార్టిజోన్స్ ఇంజెక్ట్ చేస్తారు.

01/10/2017 - 22:44

జిగట విరేచనాలు నేడు చాలామందిని బాధిస్తున్నాయి. మారుతున్న జీవన విధానంతో ఆహారము ఎక్కడ వీలైతే అక్కడే తీసుకోవడం, తీసుకునే ఆహారములో శుభ్రత లోపించడం, జంక్‌ఫుడ్స్, ఎక్కువగా అలవాటుపడటం వంటి పలు కారణాలతో ఈ సమస్య మరింత జఠిలమవుతుంది. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది.
కారణాలు
- పెద్దపేగులు ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం, కలుషిత ఆహారం

01/10/2017 - 22:42

ప్ర: రొమ్ము కేన్సరు రావటానికి మన ఆహారానికి సంబంధం ఏమైనా ఉన్నదా? ఆహార జాగ్రత్తలు వివరించగలరు?
-జి.్భద్రావతి, సికిందరాబాద్

01/03/2017 - 21:47

రక్తనాళాలలో ఏర్పడిన వలలో రక్తం సంచరించేప్పుడు కొంత ప్లాస్మా కేపిలరీల గోడల నుంచి బయటకు వస్తుంది. అలా రక్తనాళాల గుండా పైకుబికిన ద్రవ పదార్థాన్ని లింఫ్ అంటారు.
ప్రొటీనులు, రక్త కణాలు- కేపిలరీల గోడలలో వున్న రంధ్రాల ద్వారా బయటకు రాలేవు. కాబట్టి లింఫులో ప్రొటీన్లుగాని, ఎర్రరక్తకణాలు గాని ఉండవు. కొన్ని తెల్ల కణాలు మాత్రం కేపిలరీల గోడలనుంచి దూరి బయటకు రావచ్చు.

01/03/2017 - 21:46

భారత్‌లో 15 లక్షలమంది తీవ్ర స్థాయిలో ఏరోటిక్ స్టెనోసిస్ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. వారిలో చాలామందికి శస్తచ్రికిత్సకు పరిష్కారం స్థాయిలో వ్యాధి తీవ్రమైందని నిర్థారణ.
సకాలంలో ఏరోటిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ చేయకుంటే వారిలో 50 శాతం మంది రోగులు హార్ట్ ఫెయిల్యూర్, ఛాతిలో నొప్పి వచ్చిన వారిలో రెండు నుంచి ఐదేళ్లు మాత్రమే జీవిస్తున్నారని వెల్లడి.
ప్రమాద కారకాలు

Pages