S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

01/31/2017 - 22:03

ప్రశ్న: మూత్రానికి వెడ్తుంటే కారం చల్లినట్టు మంట పుడుతోంది. ఒళ్లంతా మంటలుగానే ఉంటుంది. పరీక్ష చేయిస్తే ఏ జబ్బూ లేదన్నారు.
-శిలార్ (నందిగామ)

01/24/2017 - 22:46

యాంటి డిప్రెజెంట్స్‌కి, ట్రాంకిలైజర్స్‌కి మధ్య చాలా తేడా ఉంది. డిప్రెషన్‌ని తగ్గించడానికి ఉపయోగించే మందులు ‘యాంటి డిప్రెజెంట్స్’! ఇవి ప్రధానంగా రెండు రకాలు. అవి- ట్రైసైక్లిక్స్, మోనో అమైన్ ఆక్సిడేజ్ ఇన్‌వాబేటర్స్. ఎవరైనా డిప్రెషన్‌కి లోనైతే ముందు వాడే మందులు- ట్రైసైక్లిక్స్. ఈ మందువల్ల ఫలితం అంతగా కనిపించనివాళ్ళకి మోనోఅమైన్ ఆక్సిడేజ్ ఇన్‌హిబిటార్స్‌ని వాడతారు.

01/24/2017 - 22:38

స్ర్తిలలో రొమ్ము కాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది ఎందుకు వస్తోందో ఎవరికీ తెలీకపోయినా, రొమ్ము కాన్సర్ ఎందుకు ఎక్కువవుతుందో తెలుసుకోవలసిన అవసరం ఎంతో వుంది.
భారీకాయం, క్రొవ్వులెక్కువగా ఉండే ఆహారాన్ని తినడం కూడా బ్రెస్ట్ కాన్సర్ రిస్క్ ఫాక్టరే! రేడియేషన్ కూడా! హార్మోన్ రీప్లేస్‌మెంట్‌వల్ల ఈ కేన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కుటుంబ చరిత్ర వున్నా జాగ్రత్తపడాలి.

01/24/2017 - 22:36

ప్రస్తుత తరుణంలో క్షణం తీరిక లేని జీవనం, నిత్యం పరుగులు, సమయానుకూలంగా నిద్ర, ఆహారం లేక.. నిలకడ లేని ఆలోచనలతో యంత్రాలతో పరిగెడుతూ.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురై మానవుడు వ్యాధుల బారిన పడుతున్నాడు. ఇలాంటి ఒత్తిడివలన వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనది ఐబిఎస్ (ఇర్రిటబుల్ బోవెల్ సిండ్రోమ్). నేడు ఐబిఎస్‌తో బాధపడుతున్నవారి సంఖ్య అధికంగా పెరిగిపోతోంది. దీనికి గల కారణం అంతర్గత మానసిక ఒత్తిడితోపాటు అధిక పనిభారం.

01/24/2017 - 22:34

అత్యధికంగా దీర్ఘకాలిక అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(సిఒపిడి) వ్యాధిగ్రస్తులు గల దేశాల్లో భారతదేశం ఒకటి. ఈ వ్యాధి ఆయా దేశాల పౌరుల ఆరోగ్యంపై ప్రభావం చూపడమేకాదు, ఆ దేశాల ఆర్థిక హోదాకు అదనపు భారంగా మారుతుంది. వైద్య శాస్త్ర ప్రకారం దీర్ఘకాలిక అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సిఒపిడి) ప్రాణాంతక పరిస్థితి కావడంతోపాటు దానివల్ల సంభవించే మరణాలతోపాటు ఇతర రోగాలను సహజంగా తక్కువ అంచనా వేయడం జరుగుతుంది.

01/24/2017 - 22:32

అచలేషియా: డిస్పేజియా అంటారు. మింగుడు పడడంలో కష్టం ప్రధాన లక్షణం. మొదట్లో ఘన పదార్థాలు మింగుడు పడడం కష్టమవుతుంది. తర్వాత ద్రవాలు కూడా! ఛాతీ నొప్పి వస్తుండవచ్చు. దాంతో మ్రింగడం కష్టమవడం మొదలవుతుంది.
డిఫ్యూజ్ స్పాజ్మ్: ఛాతీ నొప్పి, మింగలేకపోవడంతోపాటు ఛాతీ నొప్పి వెనక్కి వీపుల్లోకి వ్యాపిస్తుంది.

01/24/2017 - 21:24

ప్ర:చాలాకాలంగా షుగరు వ్యాధి ఉన్నది. ఇటీవల తామర అంటుకుంది. డాక్టరుగారికి చూపిస్తే షుగరు వ్యాధి మూలానే వచ్చిందని అన్నారు. ఈ రెండికీ సంబంధం ఉన్నదా? వివరంగా చెప్పగలరు?
జి.డి.వి.ప్రభాకర్, నెల్లూరు

01/17/2017 - 21:25

ఆలూస్ కార్నిలియస్ సెల్సస్ (AULUS CORNELIUS CELSUS) అనే పేరుగల రోమన్ విద్యావేత్త (1వ శతాబ్దం ఎ.డి) ప్లాస్టిక్ సర్జరీ సాంకేతిక మెళకువలకు ఆద్యుడు. దెబ్బతిన్న లేదా గాయపడ్డ అవయవాలను ఈ సర్జరీ ద్వారా పునర్‌నిర్మాణం గావించిన తొలి భారతీయ వైద్య పితామహుడు శుశృతుడు. ఈనాటి ప్లాస్టిక్ సర్జరీకి పోలిన శస్త్ర చికిత్సలు 800 బి.సిలోనే శుశృతుడు చేపట్టారు.

01/17/2017 - 21:22

రక్తనాళాలలో అడ్డంకులవల్ల రక్తప్రసరణ సరిగా జరగక ‘గుండెపోటు’ రావచ్చు. గుండె కండరాలు దెబ్బతినడంవల్ల ‘కార్డియో మయోపతి’ రావచ్చు. అంటే గుండె ముడుచుకుని, రక్తాన్ని నాళాల ద్వారా శరీర భాగాలకి పంపే శక్తి తగ్గుతుంది. కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్స్, విటమిన్ లోపం, హార్మోన్ ఉత్పత్తులు సరిగా లేకపోవడం, ఆల్కహాల్ సేవనం, కొన్ని మందులు వాడడంవల్ల ‘కార్డియో మయోపతి’ రావచ్చు. కొన్ని సందర్భాలో కారణం తెలీదు.

01/17/2017 - 21:19

గత సంవత్సరం నగర ప్రజలను వణికించిన స్వైన్‌ఫ్లూ మహమ్మారి ఏడాది తిరగకముందే మళ్లీ వస్తుండటంతో నగర ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలు తెలుసుకుందాం.
లక్షణాలు
స్వైన్‌ఫ్లూ లక్షణాలు దాదాపుగా ఫ్లూ జ్వరం లక్షణాలను పోలి ఉంటాయి. కండరాల నొప్పులు, నీరసంతో మొదలైన రొంప, తుమ్ములు, దగ్గుతోపాటు గొంతునొప్పి, తలనొప్పి, ఆకలి మందగించడం, వికారం, వాంతులు, విరోచనాలు అవుతుంటాయి.

Pages