S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

01/13/2016 - 03:45

రక్తప్రసరణ వ్యవస్థ శరీరమంతటికీ రక్తం ద్వారా ఆక్సిజన్, ఆహారాన్ని సరఫరా చేసి ఆ ప్రాంతాలలోని వ్యర్థాలు, కార్బన్ డయాక్సైడ్ బయటకు వెళ్ళడానికి ఎలా సాయం చేస్తోందో, అలాగే నరాల వ్యవస్థ కండరాలు, ఇతర అవయవాల నుంచి కొన్ని తంత్రుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ, వాటికి అవసరమైన ఆజ్ఞల్ని నరాల ద్వారా పంపుతుంటుంది. మెదడు నుంచి వెన్ను ద్వారా శరీరమంతటికి విస్తరించి ఉంటాయి నరాలు.

01/13/2016 - 03:44

ప్ర: ఆహారంలో పులుపు పదార్థాలు, ఊరగాయలు వగైరా ఆమ్ల గుణాలు కలిగినవి ఎక్కువగా తినేవారికి మూత్రంలో ఆమ్లత్వం పెరిగిపోయి మంట ఏర్పడుతుంది. దీన్ని డిజూరియా అంటారు. మూత్రంలో బ్యాక్టీరియా దోషం వలన, సుఖవ్యాధులవలన కూడా ఈ మంట రావచ్చు. మూత్ర పరీక్ష, రక్తపరీక్షలు చేస్తేగానీ కారణం తెలీదు.
-జె.గురుదత్తు, కిర్లాంపూడి

01/13/2016 - 03:43

మెదడు లేక సెంట్రల్ స్పైయిన్ కణాలలో క్రమం లేని పెరుగుదల వస్తే, ఆ ఎదుగుదలను ‘బ్రెయిన్ ట్యూమర్స్’ అంటారు. ఇవి మెదడు పని తీరును దెబ్బతీస్తుంటాయి. మెదడు, కేంద్ర నాడీ మండలానికి సంబంధించిన ట్యూమర్లు దాదాపు 120 రకాలు దాకా ఉన్నాయి. ఎక్కడ ఈ కంతులున్నాయి? అవి మ్యాలిగ్‌నెంటా? బినైనా? అన్న విషయాన్ని బట్టి ఈ వర్గీకరణ జరిగింది.

01/06/2016 - 00:29

హెచ్.బి.వి. వైరస్‌తో ప్రపంచ వ్యాపితంగా 350 బిలియన్ల మంది ఇబ్బంది పడుతున్నారు.

01/06/2016 - 00:27

సాధారణంగా టీకాలు చిన్న పిల్లలకే వేస్తారనుకుంటాం కానీ పెద్దవాళ్ళకీ టీకాలుంటాయి. టెట్నస్ (్ధనుర్వాతం), న్యుమోనియా, ఫ్లూ, హెపటైటిస్, సర్‌వైకల్ కాన్సర్, జోస్టర్‌లకూ, టీకాలని పెద్దవాళ్ళకూ వేస్తారు. 16-25 మధ్య వయస్సుగల వాళ్ళకి కొన్ని ప్రత్యేక టీకాలున్నాయి. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకీ టీకాలున్నాయి.
ధనుర్వాతానికి టీకా

01/06/2016 - 00:26

గొంతువాపుని పట్టించుకోకుండా వదిలిపెడితే చాలా ఇబ్బందులకు దారితీస్తుంది. ఎందుకంటే, గొంతు వాపు చాలా అనారోగ్య ప్రారంభ దశలను సూచిస్తుంది. ప్రధానంగా మెడ వాపుని రెండు రకాలుగా విభజించవచ్చు. మధ్యవాపు వున్నది, ప్రక్కల వాపు వున్నవి. మధ్యవాపు సాధారణంగా థైరాయిడ్ ఇబ్బందులలోను, లింఫోనోడ్ వాచినపుడు, పుట్టుకతో వచ్చే అనారోగ్యాలకి, లాలాజల గ్రంథి సమస్యలకి సంబంధించి ఉంటుంది.

01/06/2016 - 00:25

మీరు చాలాకాలంనుంచి ఎనాల్జెసిస్ వాడుతున్నారా?
కీళ్లు మార్చాలని మీకు సలహా ఇచ్చారా?
అలాంటి పరిస్థితులు తెచ్చుకోకండి, మీ కీళ్ళను పరీక్షించుకోండి!!

01/06/2016 - 00:24

ప్ర:కాడ్ లివర్ ఆయిల్ పిల్లలకు ఇవ్వటం మంచిదేనా? పెద్దలక్కూడా పనిచేస్తుందా? వివరంగా చెప్పగలరు?
-ప్రసాదరావు పంగులూరు, నెప్పల్లి

01/06/2016 - 00:23

ఈ ఆధునిక యుగంలో ప్రపంచ వ్యాప్తంగా మనుషుల్లో అధిక బరువు, స్థూలకాయం ప్రధాన ఆరోగ్య సమస్యలుగా ఉన్నాయి. అధిక బరువున్నవారు 1.2 బిలియన్లుండగా, వారిలో 300 మిలియన్లు మంది స్థూలకాయులుగా వున్నారు. ఈ సమస్య ప్రమాదకరమైన అనారోగ్యాలకు దారితీస్తుంది.

12/29/2015 - 23:36

సాధారణంగా ఫ్లూజ్వరం వాతావరణంలోని తేమ శాతం ఎక్కువగా ఉన్నపుడు తొందరగా వ్యాప్తి చెందుతుంది. అనగా వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఫ్లూజ్వరం వాతావరణంలో మార్పు, రోగనిరోధక శక్తి తక్కువ ఉండటం, వర్షంలో తడవటం మరియు వైరస్ వలన వ్యాప్తి చెందుతుంది.
లక్షణాలు

Pages