S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పాట్ లైట్

11/21/2017 - 19:31

దశాబ్దాలుగా ఎనలేని సంక్షోభానికి కారణమవుతున్న సిరియా అంతర్యుద్ధ పరిస్థితులకు అడ్డుకట్ట వేసే దిశగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్రియాశీలకంగా ముందుకు సాగుతున్నారు. సిరియా వ్యవహారంలో అమెరికా, రష్యాలది భిన్న ధోరణి కావడంతో ఈ సమస్యకు ఏ రకంగా పరిష్కారం అందించాలన్నది అంతుబట్టని పెద్ద సమస్యగానే మారుతూ వచ్చింది.

11/21/2017 - 19:29

దశాబ్దాలపాటు జర్మనీని తిరుగులేని అధికారంతో పాలించిన ఏంజెలా మెర్కెల్ ఇప్పుడు అనూహ్యమైన రాజకీయ సంక్షోభంలో పడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్లమెంటులో మెజారిటీ తగ్గడంతో ఆమె సారథ్యంలోని అధికార పార్టీ మనుగడ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

11/21/2017 - 19:27

మెక్సికో నుంచే శరణార్థుల తాకిడి పెరిగిపోతోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. అందుకే ఇంతవరకూ ఏ అమెరికా అధ్యక్షుడూ సాహసించని రీతిలో అమెరికా, మెక్సికోల మధ్య ఓ పెద్ద గోడనే నిర్మించాలని సంకల్పించారు. అయినా వ్యక్తుల మధ్య బంధాలు, అనుబంధాలకు ఏ గోడలూ అడ్డురావు. ఇక్కడ కనిపిస్తున్న చిత్రం మెక్సికో సరిహద్దులో జరిగిన ఓ వివాహ దృశ్యం.

11/21/2017 - 19:26

రోహింగ్యా ముస్లింల విషయంలో తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొంటున్న మైన్మార్ నాయకురాలు ఆంగ్‌సాంగ్ సూకీ మొత్తం వలస విధానాలపైనే విరుచుకుపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు సంక్షోభంలోనూ అస్థిర రాజకీయ పరిస్థితుల్లోనూ కొట్టుమిట్టాడటానికి ప్రధాన కారణం ఈ అక్రమ వలసదారులేనని సూకీ చెప్పడం సర్వత్రా విమర్శలకు కారణమవుతోంది.

11/15/2017 - 02:48

బతుకు భారంగా మారితే... ఆ భారాన్ని భయం అధిగమిస్తే ప్రాణాలు రక్షించుకునే తెగింపు దానంతట అదే వచ్చేస్తుంది. మైన్మార్‌లో చిన్నాపెద్దా తేడా లేకుండా రోహింగ్యా మైనార్టీ ముస్లింలు ఎదుర్కొంటున్న జీవన్మరణ సమస్య ఇదే. ఉన్నచోట బతికే పరిస్థితి లేదు, మరోచోట మనుగడ సాగించే అవకాశమూ లేదు. అయినా కూడా ప్రాణాలకు తెగించి జీవనం సాగించాల్సిన అనివార్య పరిస్థితి రోహింగ్యా ముస్లింలది.

11/15/2017 - 02:48

దేశ రాజధాని ఢిల్లీ శివారును ఇటు కాలుష్యం, అటు పొగమంచు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గాలి పీలిస్తేనే ప్రాణంపోయే పరిస్థితి అంతా అలముకుందని చెప్పడానికి ఈ ఫోటోను మించిన నిదర్శనం లేదు. ప్రాణవాయువే ప్రాణం తీసే స్థాయికి చేరుకుందంటే ఈ కాలుష్య పాపం ఎవరిది? అయినా బతకు బండి ఆగదు.

11/15/2017 - 02:47

ప్రచ్ఛన్న యుద్ధం సమసి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా మధ్య సయోధ్య అన్నది ఎండమావిగానే కనిపిస్తోంది. ఎంత చేరువో అంత దూరం అన్నట్టుగా ఈ రెండు దేశాల అధినేతలు వ్యవహరించడమే ఇందుకు కారణం. ప్రపంచ ఆధిపత్యం కోసం మళ్లీ రష్యా తహతహలాడుతుంటే అదే తరహాలో తన పట్టును మరింత బిగించేందుకు అమెరికా ఉత్సాహాన్ని చూపిస్తోంది.

11/15/2017 - 02:45

ఐరోపా యూనియన్ నుంచి ఆగమేఘాల మీద వైదొలగిన బ్రిటన్ అంతిమ లక్ష్యాన్ని సాధించుకునే అవకాశం ఉందా? తాజా పరిస్థితులు, పరిణామాలను బట్టి చూస్తే ప్రధాని థెరిసామెకు ఇది కష్ట సాధ్యంగానే కనిపిస్తోంది. నిజానికి ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలన్న దానిపై దేశ ప్రజల్లో ఏ కోశానా ఏకాభిప్రాయం లేదు. స్వల్ప మెజారిటీతోనే ఇందుకు సానుకూలమైన తీర్పు వెలువడిందే తప్ప ప్రజల ఏకగ్రీవ ఆమోదంతో కాదు.

11/15/2017 - 02:45

పదేళ్ల క్రితం అంకురించిన చతుర్భుజ సంకీర్ణ సహకార చర్చలకు ఓ స్పష్టమైన రూపం రాబోతోంది.

11/15/2017 - 02:44

భూమండలాన్ని, అందులో నిబిడీకృతమై ఉన్న సమస్త జీవజాతులను కాపాడుకునేందుకు తక్షణ ప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే ముప్పును కొనితెచ్చుకున్నట్టే అవుతుందని దాదాపు 15వేల మంది శాస్తవ్రేత్తలు ముక్తకంఠంతో హెచ్చరించారు.

Pages