S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పాట్ లైట్

06/13/2017 - 21:23

అపారమైన చమురు నిక్షేపాలు కలిగిన ఖతార్ సంక్షోభంలో పడింది. సౌదీ అరేబియా సారథ్యంలో బహ్రేన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్టు తదితర గల్ఫ్ దేశాలు తెగతెంపులు చేసుకోవడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సమృద్ధిగా చమురు ఉన్నా ఖతార్ ఆహార అవసరాలు ఇతర దేశాల నుంచి చేసుకునే దిగుమతులపైనే ఆధారపడటం వల్ల ప్రజల దైనందిన జీవితమే దుర్బరంగా మారే పరిస్థితి తలెత్తింది.

06/06/2017 - 21:47

మరోసారి భారత దేశం ప్రపంచ దేశాల దృష్టిలో పడింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు విదేశీ పర్యటనలు జరిపినా అంతర్జాతీయంగా ఎనలేని ఆసక్తి వ్యక్తమవుతూనే ఉంటుంది. తాజాగా జర్మనీ, ఫ్రాన్స్, రష్యా,స్పెయిన్‌లలో జరిపిన పర్యటన అనేక కోణాల్లో ఈ నాలుగు దేశాలకూ భారత్‌ను సన్నిహితం చేయడమే కాకుండా అనేక కీలక ఒప్పందాలు కుదరడానికీ దారితీసింది.

06/06/2017 - 21:45

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశాడు. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచీ రోజుకో కొత్త వాదాన్ని, వివాదాన్ని తెరపైకి తెస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు ఏకంగా పుడమికే మంట పెట్టాడు. భవిష్యత్ తరాల ఆశలపై నిప్పులు చెరిగాడు. నిప్పుల కుంపటిగా మారిన పర్యావరణాన్ని కాలుష్య కాసారంగా మారుస్తూ మానవాళి జీవనానికే పెనుముప్పు కలిగించే ఓ భయానక నిర్ణయాన్ని తృటిలో తీసేసుకున్నాడు.

06/06/2017 - 21:39

2015లో 190 ప్రపంచ దేశాలు ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు...’ అన్న చారిత్రక అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించాయి. వాటి ఉమ్మడి కృషి ఫలితంగానే ప్యారిస్ ఒప్పందం అవతరించింది. వాతావరణ మార్పుల కారణంగా భూమిమీద జీవజాతులన్నీ నశించిపోయే ప్రమాదం అనివార్యం కావడమే అన్ని దేశాలు అత్యవసర ప్రాతిపదికన ప్యారిస్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

06/06/2017 - 21:38

ఏ అంతర్జాతీయ ఒప్పందానికైనా బలమైన నాయకత్వం, స్పష్టమైన మార్గనిర్దేశన, దాని అమలులో ఎదురయ్యే సమస్యలను అధిగమించగలిగే దూరదృష్టి ఎంతో అవసరం. దశాబ్దాల తరబడి అమెరికా వంటి దేశాల అభివృద్ధి ఆకాంక్షల పుణ్యమా అని భూగోళం అగ్నిగోళమే అయింది. భరించలేని ఉష్ణోగ్రతలు నిప్పుల వర్షాన్ని కురిపించే పరిస్థితి తలెత్తింది.

05/30/2017 - 21:57

మోదీ నాలుగు దేశాల పర్యటన వ్యూహం ఇదే
ఐరోపా యూనియన్‌తో సాన్నిహిత్యానికి అవకాశం
రష్యాతో బంధానికీ పూర్వవైభవం?

05/30/2017 - 21:55

బ్రిటన్ ప్రధాని థెరిస్సామేకు ఏదీ అనుకున్నట్టుగా కలిసిరావడం లేదు. బ్రెగ్జిట్ లక్ష్యాలను సాధించాలన్న ఆతృతతో ముందుస్తు ఎన్నికలకు సిద్ధమైన థెరిస్సామే ఇప్పుడు ప్రతిపక్ష లేబర్ పార్టీ నుంచి తీవ్రస్థాయిలోనే సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ముందస్తు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం తమదేనన్న ఆశలు అధికార టోరీలకు రోజురోజుకూ ఆవిరవుతున్నాయి.

05/30/2017 - 21:51

గత కొన్ని వారాలుగా ఐసిస్ మిలిటెంట్లతో ఫిలిప్పీన్స్ సైనిక దళాలు జరుపుతున్న పోరాటం ఓ కొలిక్కివచ్చింది. దీర్ఘకాలంగా మిలిటెంట్ల కబ్జాలో ఉన్న మరావీ పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారీగానే సైన్యం రంగంలోకి దిగింది. ఇరాన్‌తోపాటు అనేక దేశాల్లో మాటువేసిన ఇస్లామిక్ మిలిటెంట్లు అనేక పట్టణాలను స్వాధీనం చేసుకుని శాంతిభద్రతల సమస్యలను సృష్టిస్తున్నారు.

05/30/2017 - 21:48

ఇటీవలే ఫ్రాన్స్ అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకున్న ఎమాన్యుయెల్ మాక్రన్ సారధ్యంలోని పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సునాయాసంగా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐరోపా యూనియన్‌కు అనుకూల వ్యక్తిగా భావిస్తున్న మాక్రన్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఫ్రాన్స్ రాజకీయాలపై పూర్తి పట్టు రావడంతో పాటు పాలనా పరంగా కూడా తాను అనుకున్న రీతిలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం చేజిక్కుతుంది.

05/30/2017 - 21:47

మాంచెస్టర్‌లో జరిగిన ఉన్మాదుల ఘాతుకం ప్రపంచాన్ని కదిలిస్తునే ఉంది. అనేక మంది ప్రాణాలు బలిగొన్న ఆ ఉగ్రవాద కృత్యాన్ని అన్ని దేశాలూ గర్హించాయి. సంఘటన జరిగిన ప్రాంతానికి తండోపతండాలుగా జనం తరలివస్తునే ఉన్నారు. వినూత్న రీతిలో
మృతులకు నివాళులు అర్పిస్తునే ఉన్నారు. సెంట్రల్ మాంచెస్టర్‌లో చోటు చేసుకున్న ఓ దృశ్యమే ఇది!

Pages