S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పాట్ లైట్

05/10/2017 - 00:28

అనుకున్నట్టే ఫ్రాన్స్‌లో సరికొత్త రాజకీయ శకం ఆవిష్కృతమైంది. ప్రధాన రాజకీయ పార్టీలను తిప్పికొట్టిన ప్రజలు ఐరోపా యూనియన్ అనుకూల ఇమాన్యుయెల్ మాక్రన్‌కు పట్టం కట్టడం ఊరట కలిగించే అంశం. ఇమిగ్రేషన్ వ్యతిరేక లీపెన్‌ను ఎన్నుకుని ఉంటే రాజకీయంగా గందరగోళ పరిస్థితి తలెత్తి ఉండేది. ఇప్పటికే సభ్య దేశాల నిష్క్రమణ హెచ్చరికలతో అట్టుకుతున్న ఐరోపా యూనియన్ మరింత ఇరకాటంలో పడి ఉండేది.

05/10/2017 - 00:25

బ్రెగ్జిట్ వ్యవహారంలో బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే రోజుకో కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. ఇందుకు సంబంధించిన తతంగాన్ని అధికారికంగా ప్రారంభించినప్పటికీ దేశానికి ప్రయోజనాన్ని కలిగించే రీతిలో ఏవిధంగా ముందుకు వెళ్లాలన్నది అంతుబట్టని వ్యవహారంగా మారింది.

05/10/2017 - 00:14

దీర్ఘకాలం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టనున్న శ్రీలంక పర్యటనకు అనేక విధాలుగా వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే అత్యంత ప్రాధాన్యతతో, విస్తృత లక్ష్యాలతోనే మోదీ 12న లంకకు వెళుతున్నారన్నది స్పష్టం. ఎల్‌టిటిఇ సమస్య లంకలో అంతమైనప్పటి నుంచీ అక్కడ మైనార్టీ తమిళుల ఇబ్బందులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయన్నది వాస్తవం.

05/10/2017 - 00:12

అంటార్కిటికా ఈ భూమిపై వెలసిన ఏకైక హిమఖండం. పర్యావరణ ప్రతికూల ప్రభావం అంటార్కిటికా మంచునూ కరిగించి తరిగిస్తోంది. ఫలితంగా ఒకే మంచుఖండంగా ఉన్న ఈ ప్రాంతం ముక్కలు ముక్కలుగా మారి కొండలుగా గుట్టలుగా రూపాంతరం చెందుతోంది. ఇలా కరిగి కరిగి ఓ హిమ ప్రాంతం కొండలా మారిన దృశ్యమిది. ఇలాంటి చల్లని వాతావరణంలోనే మనుగడ సాగించే పెంగ్విన్‌లకు ఈ హిమమే క్రీడాకేంద్రమైంది.

05/02/2017 - 21:47

గతేడాది లక్షిత దాడులతో దారికి వచ్చినట్టే వచ్చిన పాక్ మరోసారి తన పైశాచికత్వాన్ని చాటుకుంది. పదేళ్ల క్రితం నాటి 26/11దాడి, పఠాన్‌కోట్ వేడి రగులుతూండగానే మరోసారి బరితెగించి భారత సైనికుల్ని అమానుష రీతిలో హతమాచర్చడం ద్వారా తన రాక్షసత్వాన్ని మరోసారి రుజువు చేసుకుంది. సంయమనానికి హద్దుంటుంది. స్నేహానికీ పరిమితి ఉంటుంది..పాక్‌తో ఇవేవీ పొసగవన్న నిజం మరోసారి రుజువైంది.

05/02/2017 - 21:44

అమెరికా అధ్యక్ష పదవిని ఇప్పటివరకూ చేపట్టిన అందరిలోనూ అత్యంత వివాదాస్పదుడిగా పేరుతెచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్ వంద రోజుల పాలన, అదేస్థాయి వివాదాలతోనూ, ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతతోనూ సాగిందనడం అతిశయోక్తి కాదు. గత ప్రభుత్వం తీసుకున్న విధానాలను రద్దు చేయడం, అవి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ వాటి ప్రాధాన్యతను విస్మరించడం అన్నది ఇతర దేశాల్లో ఉంటుందేమోకాని అమెరికా వంటి దేశంలో ఇలాంటి నిర్ణయాలు చాల అరుదే.

05/02/2017 - 21:42

ఒకప్పుడు ప్రపంచంలోనే అపారమైన చమురు నిక్షేపాలతో సంపన్న దేశంగా ఉన్న వెనిజులా ఇప్పుడు అనూహ్య రీతిలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఇంత భారీ చమురు నిక్షేపాలున్న ఏ దేశమైనా ప్రపంచానే్న శాసించే స్థాయికి ఎదుగుతుంది. అన్ని విధాలుగా ప్రజల సంపద పెరుగుతుంది. కాని వెనిజులా పరిస్థితి మాత్రం ఎప్పటికప్పుడు తీసికట్టుగానే మారడం ఆర్థిక విచిత్రమే. తలసరి ఆదాయం దారుణంగా తగ్గిపోయింది.

04/25/2017 - 22:46

పశ్చిమాఫ్రికాలో పిల్లలే మిలిటెంట్ల పావులు ఆత్మాహుతి బాంబర్లుగా ప్రయోగం
ఫలించని యునిసెఫ్ ప్రయత్నాలు అంతర్యుద్ధంతో లక్షలాదిమంది నిరాశ్రయులు

04/25/2017 - 22:43

అక్రమ వలసలను అరికట్టడంలో రాజీ లేదంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపక్ష డెమోక్రాట్లతో అమీతుమీ తేల్చుకునేందుకు ఆయన తాను సిద్ధమంటున్నారు. ముఖ్యంగా మెక్సికోనుంచే ఈ రకమైన వలసల ప్రభావం అత్యధికంగా ఉండటం వల్ల రెండు దేశాల మధ్య సరిహద్దును నిర్మించే వరకూ తాను విశ్రమించేది లేదన్న బలమైన సంకేతాలను ట్రంప్ అందించారు.

04/25/2017 - 22:41

ఫ్రాన్స్ రాజకీయాల్లో ఇదో చారిత్రక ఘటం. సంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలికారు. తొలి రౌండ్‌లో విజేతలుగా నిలిచిన ఐరోపా అనుకూల ఇమాన్యుయెల్ మాక్రన్, ఇమిగ్రేషన్ వ్యతిరేక లీపెన్‌లు మే 7న తుదిపోరుకు సిద్ధమవుతున్నారు. ఇద్దరిదీ భిన్నమైన ఆలోచనలు, విధానాలే!లీ పెన్ గెలిస్తే మరో లేడీ ట్రంప్‌కు ఫ్రాన్స్ పగ్గాలు అప్పగించినట్టే అవుతుందన్న భావన ఇప్పటికే బలంగా ఉంది.

Pages