S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పాట్ లైట్

01/02/2018 - 19:47

ఒక్కో దేశానిది ఒక్కో సంప్రదాయ క్రీడ. దేని ప్రత్యేకత దానిదే. ఈ సంప్రదాయాల్లోనే ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. చూసేవారికి వింతగా, విడ్డూరంగా ఉన్నా ఈ క్రీడలో తలమునకలయ్యేవారికి మాత్రం పట్టలేని ఆనందమే. ఇక్కడ కనిపిస్తున్నది స్పెయిన్‌కు సంబంధించిన ఓ క్రీడ. ఎల్స్‌ఎన్‌ఫేరినెట్ అనే సంప్రదాయ ఉత్సవం సందర్భంగా కోడిగుడ్లు, పిండితో నిండిన ప్రాంతాల్లోనే క్రీడోత్సవం జరుపుకొంటారు.

01/02/2018 - 19:46

అమెరికా అధ్యక్షుడి సకల సౌకర్యాల ఆకాశయాన సౌధం ఎయిర్‌ఫోర్స్-1. దాని రాజసం, దర్పం నిరుపమానమే. అమెరికా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లినా ఈ విమానంలోనే వెళ్తారు. అలాంటి ఈ విమానం సంక్షిప్త నమూనాను అమెరికా అధ్యక్షుడు
డొనాల్డ్ ట్రంప్ ఆసక్తిగా వీక్షిస్తున్న దృశ్యమిది. ఇది తాను ప్రయాణించే విమానమే అయినా దాని మినీ రూపాన్ని చూసి
ట్రంప్ ముచ్చటపడుతున్నారు.

01/02/2018 - 19:44

అమెరికా, పాకిస్తాన్‌ల కథ మొదటికొచ్చింది. పాకిస్తాన్ సహాయ, సహకారాలు లేనిదే అఫ్గాన్ కేంద్రంగా పనిచేస్తున్న తాలిబన్, అల్‌ఖయిదా ఉగ్రవాదులను మట్టుబెట్టలేమని భావించిన అమెరికా ఏళ్ల తరబడి తన రవాణా అవసరాల కోసం ఇతర ప్రయోజనాలను తీర్చుకునేందుకు పాకిస్తాన్‌పై ఆధారపడింది. అందులో భాగంగా ఆ దేశానికి బిలియన్ల కొద్దీ డాలర్లను ఎందుకూ అని అడగకుండా ఉదారంగా అందించింది. అందుకు కారణం కూడా చాలా బలమైనదే.

01/02/2018 - 19:42

ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం అన్నది అనుకూల ప్రతికూల వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్న నేపథ్యంలో ప్రధాని థెరిసామె వేయబోయే తదుపరి అడుగు ఏమిటన్నది అంతర్జాతీయంగా ఆసక్తిని కలిగిస్తోంది. ఐరోపా యూనియన్‌లో ఉండడం వల్ల బ్రిటన్‌కు అన్ని విధాలుగా నష్టమేనన్న భావనతో దీన్నుంచి వేరుపడాలంటూ దేశ ప్రజలు మెజారిటీ తీర్పునిచ్చారు.

01/02/2018 - 19:40

భారత్ యుద్ధం చేయాల్సివస్తే అది తొలుత పాకిస్తాన్‌తో కాదు, చైనాతోనే అనేది నిపుణుల అభిప్రాయం. ఆ వాదనకు ఆధారమేనా అన్నట్టు చైనా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. చైనా సామ్రాజ్యవాద కాంక్షకు పాక్ కూడా అండగా నిలుస్తోంది. దొంగచాటుగా పాక్ ఆక్రమించుకున్న గిల్గిత్-బాల్టిస్థాన్‌లోని చాలా భాగాన్ని చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ పేరిట చైనాకు విక్రయిస్తోంది.

12/26/2017 - 19:17

నేపాల్ పరిస్థితి ఇప్పుడు రెండు పెద్ద దేశాల మధ్య ఎటు తేల్చుకోవాలో తెలియని అనిశ్చితి మయంగా మారింది. ఒకపక్క చైనా, మరోపక్క భారత్ ఈ చిరు దేశానికి అత్యంత కీలకమైనవే. ఈ రెండు దేశాల సహాయ సహకారాలు లేనిదే ఈ హిమాలయ ప్రాంత దేశం స్వంతంగా మనుగడ సాగించే అవకాశం లేని పరిస్థితి. ఇప్పటివరకూ ఎలాంటి సమస్య లేకుండా కొంత అటో ఇటోగా రెండు దేశాలతోనూ బంధాన్ని నేపాల్ కొనసాగిస్తూనే వచ్చింది.

12/26/2017 - 19:15

అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిడులు వస్తున్నా ఇటు అమెరికా, అటు ఐక్యరాజ్య సమితి ఒకదాని తర్వాత ఒకటిగా ఆంక్షల కొరడా ఝళిపిస్తున్నా కూడా ఉత్తర కొరియా నాయకత్వం నిమ్మకు నీరెత్తిన చందంగానే వ్యవహరిస్తోదని చెప్పడానికి తాజా ప్రేలాపనలే నిదర్శనం. తమ అణు బలాన్ని చాటుకోవడానికి, అలాగే ఆత్మరక్షణ పేరిట ఉత్తర కొరియా చేస్తున్న క్షిపణి పరీక్షలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కల్లోలాన్ని సృష్టించాయి.

12/26/2017 - 19:13

ఎట్టకేలకు ఓ కొలిక్కి వస్తుందనుకుంటున్న సిరియా సంక్షోభం మళ్లీ మొదటికి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. రష్యా క్రియాశీలక ప్రమేయంతో కొంతమేర తగ్గినట్టే తగ్గిన సిరియా రెబెల్ గ్రూపులు ఇప్పుడు మళ్లీ వితండవాదం మొదలుపెట్టాయి. రష్యా సారథ్యంలో వచ్చే నెల జరగనున్న చర్చల్లో తాము పాల్గొనేదే లేదని చెప్పడం ద్వారా మళ్లీ కథను మొదటికి తెచ్చాయి.

12/26/2017 - 19:11

ప్రకృతి వైపరీత్యాలతో అతలాకుతలం అవుతున్న చిలీలో జంతు రవాణా కూడా సంక్లిష్టంగా మారిపోయింది. చిలీలోని శాంతాలూసియా ప్రాంతమంతా బురదమయం కావడంతో ఓ ఆవును ఇలా హెలికాప్టర్‌కు వేలాడదీసి సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న దృశ్యమిది.

12/26/2017 - 19:09

మానవత్వాన్ని కబళించిన రాక్షసుడికి ఎలా క్షమాభిక్ష పెడతారంటూ పెరూ అధ్యక్షుడు పెడ్రో పాబ్లోపై దేశ ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలకు పాల్పడిన అల్‌బెర్టో ఫ్యూజిమోరీ పాతికేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. అస్వస్థతకు గురికావడంతో మానవతా దృక్పథంతో ఫ్యూజిమోరీకి అధ్యక్షుడు పాబ్లో క్షమాభిక్ష పెట్టారు.

Pages