S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పాట్ లైట్

12/26/2017 - 19:06

పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య రగులుతున్న జెరూసలెం చిచ్చు ఆరని మంటలు రేకెత్తిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయంతో ఈ రెండు దేశాల మధ్య మరింతగా వైషమ్యాలను రెచ్చగొడుతోంది. ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం ఈ పరిస్థితికి ప్రత్యక్ష తార్కాణం. శాంతాక్లాజ్ దుస్తులు ధరించిన ఓ పాలస్తీనా నిరసనకారుడు ఇజ్రాయెల్ దళాలపై రాళ్లు విసురుతున్న దృశ్యమిది.

12/19/2017 - 19:36

తమ తమ దేశాల్లో దిక్కూమొక్కూ లేని స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర దేశాలకు తరలిపోతూ మధ్యధరా సముద్రంలో అశువులు బాసిన వారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. ఇలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర దేశాల్లో ఆశ్రయం కోసం సముద్రాలు దాటుతూ మార్గమధ్యంలో చిక్కుకుపోయిన శరణార్థులు వీరు. వీరందరినీ కాపాడేందుకు రంగంలోకి దిగిన ఎంవి ఆక్వారియస్ అనే భారీ నౌక ఇది.

12/19/2017 - 19:35

మైన్మార్‌లో దిక్కూమొక్కూ లేకుండా బంగ్లాదేశ్‌కు పరారైన రోహింగ్యాల స్థితిగతులు మరింత దైనీయంగా మారాయి. వీరిని స్వదేశానికి తరలించే విషయంలో ఒప్పందం కుదిరినా అది ఎప్పుడు అమలవుతుందన్నది ఎండమావి చందమే. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని కాక్స్‌బజార్‌లో ఏర్పాటు చేసిన శరణార్థుల శిబిరంలో వేలాదిగా తలదాచుకుంటున్న

12/19/2017 - 19:33

సిరియా, పశ్చిమాసియా వ్యవహారాల్లో పటిమ చాటుకున్న నేత అమెరికా ప్రతికూల దేశాలు చేరువయ్యే అవకాశం

12/19/2017 - 19:31

విశ్వ ఆవిర్భావం ఓ మిస్టరీ. శతాబ్దాలుగా, దశాబ్దాలుగా సాగుతున్న రోదశీ పరిశోధనలు ఎప్పటికప్పుడు కొత్త అంశాలను ఆవిష్కరిస్తూ ఉన్నాయి. బిగ్‌బ్యాంగ్ అనంతర కాలంలో సమస్త జీవకోటి ఆవిర్భవించిందన్నది శాస్త్ర ప్రపంచం చెబుతున్న విషయం. అయితే శతాబ్దాలపాటు ఈ భూమీదే కాకుండా ఇతర గ్రహాలపై జీవజాతులున్నాయా లేదా అన్నది శాస్తవ్రేత్తలకు ఎనలేని ఉత్కంఠను, ఆసక్తిని కలిగిస్తూనే వచ్చింది.. వస్తోంది కూడా.

12/12/2017 - 19:35

అనుకున్నట్టుగానే పశ్చిమాసియా సమస్య అనూహ్యరీతిలో పరాకాష్ఠకు చేరుకుంది. ఈ జఠిల సమస్యకు శాంతియుత పరిష్కారం ఎండమావి చందమే అయినా దాన్ని ఇంత తీవ్రస్థాయిలో ఇటీవలి కాలంలో ఎవరూ తగిలించలేరు. ఆ పుణ్యాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూటగట్టుకున్నారు. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాల్లోనే కలకలాన్ని, కలవరాన్ని సృష్టించింది.

12/12/2017 - 18:52

నేపాల్‌లో రాచరికం అంతమై ప్రజాస్వామ్యం వేళ్లూనుకునే దశనుంచి నేటి వరకు ఏ కోశానా సుస్థిర పాలన సాగిన దాఖలాలు లేవు. నేపాలీ కాంగ్రెస్, అలాగే ప్రచండ సారథ్యంలోని రాజకీయ కూటములు నువ్వా-నేనా అన్న రీతిలో పైచేయి సాధించుకునేందుకు ప్రయత్నించడంవల్ల ఎప్పటికప్పుడు పరిస్థితి ఎండమావిగానే మారుతూ వచ్చింది. కొత్త రాజ్యాంగాన్ని నిర్మించుకునే విషయంలో ఏళ్లకు ఏళ్లే ఎలాంటి నిర్ణయం లేకుండా సాగిపోయాయి.

12/12/2017 - 18:49

రోదసీకి సంబంధించి మరొక కీలకమైన, సంక్లిష్టమైన మిస్టరీని శాస్తవ్రేత్తలు డీకోడ్ చేశారు. గగతతలం నుంచి భూమిమీదకి పడే శకలాలు మధ్యలోనే ఎందుకు తునాతునకలైపోతాయి? అందుకు దారితీసే కారణం ఏమిటన్నదానిపై విస్తృత పరిశోధనలు జరిపి వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు.

12/05/2017 - 20:07

ఎక్కడైనా మిత్రదేశం గానీ నిధుల దగ్గర కాదంటూ పాక్‌కు చైనా షాక్ ఇచ్చింది. చైనా ఆదుకుంటుందని అన్నివిధాలుగా తమకు వెన్నుదన్నుగా నిలుస్తుందని ఆశించిన పాక్‌కు ఆశనిపాతమే ఎదురైంది. భారత్‌తో కయ్యానికి పాక్‌ను పావుగా వాడుకుంటున్న చైనా తాజా ధోరణి పాక్ పాలకులకు మింగుడు పడటం లేదు.

12/05/2017 - 20:00

పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య రగులుకుంటున్న జెరూసలెం వివాదం ఇప్పుడు టర్కీ-ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. జెరూసలేం హోదా విషయంలో ఏమాత్రం ప్రతికూల పరిణామాలు చోటుచేసుకున్నా ఇజ్రాయెల్‌తో తెగతెంపులు చేసుకోవడానికి తాము వెనుకాడేది లేదని టర్కీ ప్రధాని ఎర్డోగన్ చెప్పడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

Pages