S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పాట్ లైట్

10/17/2017 - 18:30

చరిత్రను పరిరక్షించాల్సిన యునెస్కో దానిని వక్రీకరిస్తోందా? యునెస్కోలో సంస్కరణలు అవసరమా? వెస్ట్ బ్యాంకులోని హెబ్రాన్ నగరాన్ని పాలస్తీనా దేశంలోని సాంస్కృతిక వారసత్వ సంస్థగా ప్రకటించి యునెస్కో ఇజ్రాయిల్ ఆగ్రహానికి గురైంది. ఇజ్రాయిల్ మీద ఈగ వాలితే దుడ్డువాలిన చందంగా అమెరికా విలవిలలాడుతుంది. దాంతో అమెరికా కూడా ఆగ్రహం చెందింది.

10/17/2017 - 18:27

రెండేళ్ల క్రితం ఇరాన్‌తో కుదుర్చుకున్న పౌర అణు ఇంధన ఒప్పందానికి అమెరికా ఎసరు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా ఇరాన్ అణు ఒప్పందంపై కారులు మిరియాలు నూరుతూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఏకంగా ఆ ఒప్పందానే్న ధ్రువీకరించడానికి నిరాకరించడంతో ఇరు దేశాల మధ్య కథ మొదటికి వచ్చింది.

10/10/2017 - 19:50

మూడుసార్లు జర్మనీ చాన్సలర్‌గా ఎన్నికై తిరుగులేని అధికారాన్ని, ఆధిపత్యాన్ని చెలాయించిన అంజీలా మెర్కెల్‌కు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చిపడింది. పార్లమెంటులో మెజారిటీ తగ్గడంతో ఆమె ఏమి చేయాలన్నా కూడా మిత్రపక్షాలను సంప్రదిస్తే ముందుకు వెళ్లలేని పరిస్థితి.

10/10/2017 - 19:48

ఎప్పుడు అంతర్జాతీయ యుద్ధం జరిగినా అమెరికాకు వంతపాడే బ్రిటన్ ఇప్పుడు ఉత్తర కొరియా విషయంలోనూ అదే రీతిలో వ్యవహరించబోతోందా? ఇరాక్‌పై యుద్ధం విషయంలో అమెరికా వాదనకు వంతపాడి అనంతరం దేశీయ పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని టోనీ బ్లెయిర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దాంతో అనంతరం యుద్ధానికి ఎప్పుడు అమెరికా సాయం కోరినా బ్రిటన్ అంతకు ముందులాగ పరుగెత్తుకొచ్చే పరిస్థితి లేదు.

10/10/2017 - 19:44

మైన్మార్‌లో నెలకొన్న రోహింగ్యాల సంక్షోభం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఆలస్యంగానైనా దిద్దుబాటు చర్యలను చేపట్టింది. గత రెండు మూడు నెలలుగా మైన్మార్‌నుంచి ప్రాణభయంతో పరుగులు పెడుతున్న మైనారిటీ రోహింగ్యా ముస్లింల విషయంలో ఇటు ఐక్యరాజ్య సమితితో పాటు అన్ని దేశాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి.

10/10/2017 - 19:41

హడలెత్తిస్తున్న ట్రంప్ నిర్ణయాలు ఇలా అయితే మూడో ప్రపంచ యుద్ధమే
ఇమ్మిగ్రేషన్ నుంచి ఉ.కొరియా వరకు అధ్యక్షుడిది ఇదే ధోరణి రిపబ్లికన్ సీనియర్ నేత తీవ్ర వ్యాఖ్యలు

10/03/2017 - 20:40

లాస్ వెగాస్ నరమేధంలో ప్రాణాలు కోల్పోయన 58మందికి సంతాప సూచకంగా, అలాగే ప్రపంచ ఉగ్రవాద ఉన్మత్త కృత్యాలకు నిరసనగా తలమానిక
ఈఫిల్ టవర్ నిలువెత్తు నిరసన కట్టడమే అయంది. ఈ ఘాతుకాలను
గర్హిస్తూ ఈఫిల్ టవర్‌ను చీకటి చేసి నిరసన తెలిపారు

10/03/2017 - 20:34

ప్రపంచంలో అతి కొద్ది దేశాలు మినహా నిత్యం కల్లోలంతో అశాంతితో రగులుతున్న దేశాల సంఖ్యే ఎక్కువ. ముఖ్యంగా మైన్మార్, దక్షిణ సూడాన్, సిరియా తదితర దేశాల విషయానికొస్తే పౌరులే ధైర్యంగా జీవించలేని పరిస్థితి. నిత్యం సాయుధ పోరాటాలు, ఘర్షణలు, సంఘర్షణలు ఆ ప్రజల దైనందిన జీవన వేదనగా మారాయి.

10/03/2017 - 20:31

ముదటి నుంచీ కూడా అమెరికా సమాజానిది తుపాకీ సంస్కృతికి అనుకూలమైన ధోరణే. ఎన్ని ఘాతుకాలు జరిగినా, ఎంతగా రక్తం చిందినా గన్ లైసెన్సుల విషయంలో రాజీపడకుండానే అమెరికా ప్రజలు తమ మనుగడను సాధిస్తున్నారు.

10/03/2017 - 20:26

ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణం మొత్తం పశ్చిమాసియాలోనే ఎడతెగని అశాంతికి ఆజ్యం పోస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ను వెనకేసుకొస్తున్న అమెరికా పాలస్తీనాకు సంబంధించి ఏ రకంగా వ్యవహరిస్తుందన్నది ఎప్పటికప్పుడు ప్రశ్నార్థకమే.

Pages