S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పాట్ లైట్

11/07/2017 - 18:45

ఇతర దేశాలతో వ్యూహాత్మక బంధం వన్ బెల్ట్‌కు దీటుగా ప్రత్యామ్నాయానికి కసరత్తు

11/07/2017 - 18:43

చీటికిమాటికి పాకిస్తాన్‌ను వెనకేసుకొచ్చే చైనా ధోరణి ఎప్పుడు ఎలా ఉంటుందో నమ్మలేని పరిస్థితి. 60వ దశకం తొలినాళ్లలో భారత్‌తో జరిగిన యుద్ధానంతర పరిస్థితి నుంచి డ్రాగన్ ఇదే ధోరణి కొనసాగిస్తునే వస్తుంది. అంతర్జాతీయంగా అన్ని రంగాల్లోనూ భారత్ తిరుగులేని శక్తిగా ఎదగడాన్ని జీర్ణించుకోలేకపోతున్న చైనా నాయకత్వం భారత్‌కు అనుకూలంగా ఉన్న దేశాలను తన వైపుతిప్పుకుంటోంది.

11/07/2017 - 18:41

ఉత్తర కొరియాతో అమీతుమీ తేల్చుకోడానికే అమెరికా సిద్ధమవుతోందా? గత కొన్నివారాలుగా ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై చెలరేగుతున్న వివాదం నేపథ్యంలో అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ విస్పష్టంగానే తన భవిష్యత్ లక్ష్యాలను వెల్లడించారు.

11/07/2017 - 18:39

వారాలకు వారాలు, నెలలకు నెలలు గడుస్తున్నా మైన్మార్‌లోని మైనారిటీ రోహింగ్యా ముస్లింల పరిస్థితి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మైన్మార్‌లోని రఖీనా రాష్ట్రానికి పరిమితమైన రోహింగ్యాలపై సైనిక దళాలు చేపడుతున్న చర్యలపై ఐరాస సహా ప్రపంచ దేశాలన్నీ తీవ్ర స్థాయిలో గర్హించాయి.

10/31/2017 - 19:26

భయానక హరికేన్ మారియా ప్రభావానికి ప్యూర్టోరీకో తీవ్రస్థాయిలోనే అతలాకుతలం అయింది. ఈ పెను విలయం సృష్టించిన భీభత్సం నుంచి ఈ కరేబియా దీవి ప్రజలు ఇంకా బయటపడలేదు. ఇది సంభవించి ఆరు వారాలు గడిచినా కూడా కేవలం కొన్ని ఇళ్లకు మాత్రమే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగింది. మిగతా అంతా అంధకారమయంగానే ఇప్పటికీ కొనసాగుతోంది.

10/31/2017 - 19:25

జర్మనీ - పోలాండ్ - చెక్ రిపబ్లిక్‌లను హేవార్ట్ పెనుతుపాను అతలాకుతలం చేస్తోంది. రోడ్డు, రైలు మార్గాలన్నీ ఎక్కడికక్కడ తెగిపోయాయ. ముఖ్యంగా బెర్లిన్‌లోనే ఈ పెను విలయ తాకిడికి అనేక మంది మరణించారు. జర్మనీలోని రేవు పట్టణాలన్నీ జలమయమయ్యాయ. తీవ్ర గాలులకు చెట్లకు చెట్లే విరిగిపడ్డాయ. చెక్ రిపబ్లిక్‌లో కూడా అనేక ప్రాంతాల్లో ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.

10/31/2017 - 19:23

అసమ్మతి స్వరాలుంటేనే ఎక్కడైనా సమస్య. అలాగే వ్యతిరేకులను పోగుచేసే వ్యూహాత్మక ప్రత్యర్థులుంటేనే ఇబ్బందులు మొదలవుతాయి. ఈ రెండూ లేకుండా జిన్‌పింగ్ వ్యూహాత్మక రీతిలోనే అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ పావులు కదిపారు. అలాగే ఇటు మావో, అటు డెంగ్‌లతో సరిసమానంగా హోదాను సంతరించుకుంటూ సరికొత్త సామ్యవాద సిద్ధాంతాలతో తన పేరును పార్టీ నియమావళిలో నిక్షిప్తం చేసుకోగలిగారు.

10/31/2017 - 19:18

వాతావరణంలో పెరిగిపోయిన కార్బన్ డై ఆక్సైడ్
లక్షలాది సంవత్సరాలుగా కనివీని ఎరుగని పరిణామం
సముద్ర ఉపరితలం పెరిగిపోయే ప్రమాదం
అదే జరిగితే భూగోళం నిప్పుల కొలిమే

10/31/2017 - 19:16

వివాదాస్పదంగా మారిన కెన్యా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా కెన్యట్టా అంతిమంగా ఎన్నిక కావడం గత కొన్ని రోజులుగా సాగుతున్న హింసాత్మక పరిణామాలకు తెరిదించింది. తొలి ఎన్నిక వివాదాస్పదం కావడంతో రెండోసారి కూడా అధ్యక్ష ఎన్నికలకు నిర్వహించాల్సి రావడంతో దేశంలో శాంతిభద్రతల సమస్య తలెత్తింది. ఉత్కంఠ, ఉద్వేగం, హింస మధ్య అధ్యక్షుడు కెన్యట్టానే విజేతగా నిలిచినట్లు ప్రకటించారు.

10/24/2017 - 18:47

సెల్ఫీ అన్నది ఓ జాడ్యంగా మారింది. ఓపక్క ప్రాణాలు పోయే పరిస్థితులు కమ్ముకుంటున్నా పెను తుపాన్లు, విలయాలు చుట్టూ అలుముకుంటున్నా ఈ సెల్ఫీ సాహసం మరింత పేట్రేగిపోతోంది. తమది సాహసమో, దుస్సాహసమో, ప్రాణాలకు తెగించే ఉత్సాహమో తెలియక అనేకమంది ఈ సెల్ఫీల మోజులో కొట్టుకుపోతున్నారు.

Pages