S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పాట్ లైట్

08/22/2017 - 21:21

విద్వేష ప్రసంగాలు శాంతికి చేటు అంటూ బోస్టన్ ప్రజలు నినదించారు. వేలు కాదు..
లక్షల సంఖ్యలోనే వీధుల్లోకి వచ్చి రెచ్చగొట్టే మాటలను కట్టిపెట్టాలంటూ కదం తొక్కారు.

08/22/2017 - 21:19

నెలల తరబడి సాగించిన పోరాటం అనంతరం మొసూల్ పట్టణాన్ని ఐసిస్ మిలిటెంట్ల నుంచి చేజిక్కించుకోగలిగిన ఇరాకీ దళాలకు వాయవ్య ప్రాంతంలోని తల్ అపార్ అనే ప్రాంతం పెను సవాలుగా మారింది. క్రమంగా ఇరాక్‌లో పట్టును కోల్పోతూ వస్తున్న ఐసిస్ ఉగ్రవాదులు ఈ పట్టణంలో తిష్టవేశారు. దీన్ని రాబట్టుకునేందుకు ఆవిధంగా పూర్తిస్థాయిలో దేశంనుంచి ఐసిస్‌ను తరిమికొట్టేందుకు ఇరాకీ దళాలు వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతున్నాయి.

08/15/2017 - 21:24

ప్రపంచ దేశాలన్నీ ముఖ్యంగా ఐరోపాను శరణార్థుల సంక్షేమం కుదిపేస్తోంది. ఉత్తరాఫ్రికాలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఒకవైపు, ఎంతమాత్రం మనుగడ సాగించలేని దయనీయ వాతావరణం మరొకవైపు కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతున్న శరణార్థులకు ఐరోపా దేశాలే దిక్కవుతున్నాయి. ఆ దిక్కూ ఇప్పుడు మూసుకుపోతోంది.

08/15/2017 - 21:23

సంక్షుభిత లిబియాలో శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణకు రెండేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో కుదిరిన ఒప్పందం అమలుపై రష్యా దృష్టి పెట్టింది. లిబియా సైనిక కమాండర్ ఖలీఫా హఫ్తర్, ఆయన ప్రత్యర్థి, ఐరాస మద్దతుతో కొనసాగుతున్న ప్రధాని ఫేయజ్ అల్ సర్రాజ్‌లు ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికింది.

08/15/2017 - 21:21

గత వారం రోజులుగా అమెరికా, ఉత్తర కొరియాల మధ్య చెలరేగుతున్న వాగ్యుద్ధం అంతిమంగా సమరానికే దారితీస్తుందా? ఇటు కొరియా అధినేత కిమ్ జోంగ్, అటు అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పరం కవ్వించుకుంటూ పరస్పరం రెచ్చగొడుతున్న నేపథ్యంలో అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది అంతుపట్టడం లేదు.

08/16/2017 - 03:56

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ విసిరే ఆధిపత్య పాచికలు, అంతర్జాతీయంగా తన పట్టును పెంచుకోవడానికి అనుసరించే వ్యూహాలను వంటపట్టించుకోవడం అనేది అంత తేలికైన పనికాదు. ఆయన ఎప్పుడు ఏ అడుగు వేస్తారో తన ఆధిపత్య లక్ష్యాలను సాధించుకోవడానికి ఎలాంటి యుక్తులు, కుయుక్తులు పన్నుతారో అంతుబట్టని వ్యవహారమే.

08/08/2017 - 21:14

ఎలాగైనాసరే అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనుకునేవాడికి నిరసనలు, ఉద్యమాలు, ఆందోళనలు ఎంతమాత్రం అడ్డుకావు అని చెప్పడానికి వెనిజులాలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలే నిదర్శనం. నెలల తరబడి సాగిన ఉద్యమాలను అణచివేసి తన ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేసిన అధ్యక్షుడు మదురో మరింతగా తన అధికారాన్ని సంఘటితం చేసుకోవడానికి సన్నద్ధమయ్యారు.

08/08/2017 - 21:12

బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన ఐదు దేశాల కూటమి బ్రిక్స్ తదుపరి శిఖరాగ్ర సదస్సు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ముఖ్యంగా డోక్లామ్ వ్యవహారంలో భారత్‌తో తలెత్తిన ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ సమావేశ ప్రాధాన్యత మరింత పెరిగింది.

08/08/2017 - 21:09

అత్యంత కీలకమైన అంతర్జాతీయ సముద్ర వాణిజ్యమార్గంగా ఉన్న దక్షిణ చైనా మహాసముద్రంపై పూర్తిస్థాయి హక్కులు ఎవరివి? ఇది తమ భూభాగంలో ఉంది కాబట్టి దీనిపై సర్వహక్కులు తమవేనంటూ చైనా చేస్తున్న వాదన నేపథ్యంలో అనేక దేశాల్లో అలజడి మొదలైంది. ముఖ్యంగా ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఇందుకు సంబంధించి తీవ్రస్థాయిలోనే విభేదాలు తలెత్తినట్లుగా తాజా సంకేతాలను బట్టి స్పష్టమవుతోంది.

08/08/2017 - 21:06

భారత్-పాకిస్తాన్‌ల మధ్య అసలు పూర్తి స్థాయి సఖ్యతకు ఆవకాశం ఉందా? భారత ప్రధాని మోదీతో అంతో ఇంతో సత్సంబంధాలు కలిగిన నవాజ్ షరీఫ్ నిష్క్రమణతో పాక్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు ఇందుకు ఎంత మేరకు దోహదం చేసే అవకాశం ఉంది?

Pages