S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

01/11/2018 - 20:07

నేడు అన్నివర్గాల వారిలోనూ స్మార్ట్ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్టు మార్కెట్లో రోజురోజుకూ కొత్తరకం స్మార్ట్ ఫోన్లు ప్రత్యక్షమవుతున్నాయి. వీటి ధరలకు సంబంధించి చూస్తే ఎన్నో వ్యత్యాసాలు కనబడుతుంటాయి. సంపన్నులు ఎంత ఖర్చుపెట్టి అయినా అత్యంత ఖరీదైన ఫోన్లు కొంటుంటారు. మధ్యతరగతి వారు మాత్రం స్మార్ట్ఫోన్‌మీద ఎక్కువగా ఖర్చు చేయలేరు.

01/11/2018 - 20:06

చైనా మొబైల్ తయారీ కంపెనీ ఇవోమి సరికొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్లను బడ్టెట్ ధరకే ఇండియాలో ప్రవేశపెట్టింది. ఐ1, ఐఎస్ పేరుతో వీటిని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిందది. ఈ రోజు నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రెండు ఫోన్లు అమ్మకానికి రానున్నాయి. కంపెనీ ఈ రెండు ఫోన్ల ధరలను రూ.5,999, రూ.6,999గా నిర్ణయించింది.

01/11/2018 - 20:05

దక్షిణ కొరియా స్మార్ట్ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్ మరో సరికొత్త స్మార్ట్ఫోన్‌ను ఇండియన్ మార్కెట్‌లో లాంఛ్ చేయబోతోంది. గెలాక్సీ ఎ8 ప్లస్ (2018) పేరుతో ఈ ఫోన్ అందుబాటులో వుంటుంది. దీనికి సంబంధించిన డెడికేటెడ్ పేజీని అమెజాన్ ఇండియా ఇప్పటికే తన వెబ్‌సైట్‌లో లాంఛ్ చేసింది. ఈ పేజీలో పలు టీజర్ వీడియోలతోపాటు నోటిఫై మి ఆప్షన్‌ను కూడా అమెజాన్ అందుబాటులో ఉంచింది.

01/11/2018 - 20:03

టెక్నాలజీ దిగ్గజం ఏసెర్ ఇతర సంస్థలకు సవాల్ విసురుతూ సరికొత్త ల్యాపీని వినిగదారుల కోసం తీసుకువచ్చింది. ఈ ల్యాపీని ఈనెలలోనే అట్టహాసంగా విడుదల చేశారు. 9.98 మి.మి మందంతో దూసుకువచ్చిన ఈ ల్యాపీని ‘స్విఫ్ట్ 7’ పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ల్యాపీని వినియోగదారులు ఎక్కడకైనా సులువుగా తీసుకెళ్ళే అవకాశం వుంది.

01/11/2018 - 20:02

ఇప్పటికే ‘బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్’గా పేరొందిన ఆనర్-7ఎక్స్ త్వరలో రెడ్ కలర్ వేరియంట్‌లో దర్శనమిస్తుంది. ఈ ఫోన్లు లిమిటెడ్ ఎడిషన్‌లో మాత్రమే అందుబాటులో వుంటాయి. వచ్చే నెలలో కోలాహలంగా జరుపుకునే ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రత్యేక మోడల్‌ను విడుదల చేస్తున్నట్లు ఆనర్ సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 4 నుంచి వీటి విక్రయాలు మొదలవుతాయి.

01/11/2018 - 19:59

ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.7,390.

01/11/2018 - 19:57

చైనా మొబైల్ తయారీ దిగ్గజం మిజు తన సరికొత్త స్మార్ట్ఫోన్ ‘మిజు ఎస్6’ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమైంది. ఈనెల 17న ఈ ఫోన్‌ను చైనాలో విడుదల చేస్తారు. 18.9 యాస్పెక్ట్ రేషియోతో ఈ ఫోన్ రానున్నట్లు సమాచారం. ఇందులో శామ్‌సంగ్‌మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ చిప్ సెట్ ఎక్సిన్యోస్ 7872 వాడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ 4 జిబి/32 జిబి ఇంటర్నల్, 4జిబి/64 ఇంటర్నల్ వేరియంట్లలో వచ్చే అవకాశం వుంది.

01/11/2018 - 19:57

మార్కెట్లో బాగా పాపులర్ అయిన మైక్రోమాక్స్ భారత్ సిరీస్ నుంచి మరో సరికొత్త స్మార్ట్ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో లాంఛ్ కాబోతోంది. భారంత్-5 ప్లస్ పేరుతో ఈ ఫోన్ లభిస్తుంది. ప్రస్తుతానికి ఈ స్మార్ట్ఫోన్ మైక్రోమాక్స్ అఫీషియల్ లిస్ట్ అయి ఉంది. ధర, విడుదల తేదీ వంటి వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. శక్తివంతమైన 5000 ఎంఎహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో ఇన్‌బిల్డ్ చేసినట్లు తెలుస్తోంది.

01/04/2018 - 19:54

గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొనాలే తప్ప నిరాశతో నీరసపడకూడదని ‘మహిళా స్టంట్ రైడర్’గా సత్తా చాటుకుంటున్న 22 ఏళ్ల అనమ్ హషీమ్ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. అమ్మాయిలకు ‘రోల్ మోడల్’గా నిలవాలన్నదే తన ఆకాంక్ష అని, మగువలు సాహసం చేస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదని అంటోంది.

01/04/2018 - 19:52

డబ్బులు ఊరికే రావు.. ఇప్పటి వరకూ ఇచ్చింది చాలు..’ అంటూ ఇటీవలి కాలంలో తెగ ప్యాపులర్ అయిన ఓ నగల దుకాణం ప్రకటనను నేటి యువత తమ కోసం కాస్త సవరించుకుని- ‘ఉద్యోగాలు ఊరికే రావు.. ఇప్పటివరకూ కాలక్షేపం చేసింది చాలు.. కాస్త నైపుణ్యం, వైవిధ్యం ఉండాలి..’ అని అనుకోక తప్పదు. ఎందుకంటే డిగ్రీ సర్ట్ఫికెట్లు, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలిచ్చే రోజులు పోయాయి.

Pages