S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

07/13/2017 - 21:20

స్కేటింగ్ క్రీడలో ఇప్పుడిప్పుడే భారత్ వెలుగులీనుతోంది. చైనాలో నిర్వహించబోయే వరల్డ్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు భారత్ తరపున ఎంపికైన ఇద్దరు స్కేటింగ్ క్రీడాకారులే అందుకు ఉదాహరణ. గుజరాత్‌కు చెందిన మిస్రీ పారిఖ్‌తోపాటు యువ సంచలన స్కేటర్ భవిత మధు ఈ పోటీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

07/06/2017 - 21:59

దేశంలోని యువతకు దిశానిర్దేశం చేస్తూ ప్రత్యేక పుస్తకం రాస్తున్న తొలి ప్రధానిగా నరేంద్ర మోదీ మరో రికార్డును సృష్టిస్తున్నారు. నేటి యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ, వాటికి తగిన పరిష్కారమార్గాలను కూడా ఆయన తన పుస్తకంలో సూచిస్తారు. పరీక్షల ఒత్తిడిని జయించడం, ఏకాగ్రతను సాధించడం, చదువు పూర్తయ్యాక కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం..

07/06/2017 - 21:57

చిన్న పట్టణమైనా, పెద్ద నగరమైనా ఇల్లు మారాలంటే నిజంగా భారీ ప్రహసనమే.. ఎవరైనా ఇల్లు మారాలంటే అనేక వ్యయప్రయాసలు భరించక తప్పని రోజులివి.. తమకు అనువైన ప్రాంతంలో, అందుబాటులో ఉండే అద్దెకు ఇల్లు దొరకడం అంటే మాటలా..? ఇంటిని వెదకడం, అద్దె విషయంలో బేరసారాలు, అడ్వాన్సులు ఇచ్చుకోవడం, సామాన్లంటినీ ప్యాక్ చేసుకోవడం, కొత్త ఇంట్లో చేరడం.. ఇలా వివిధ దశలను అధిగమిస్తేనే గానీ ‘ఇల్లు మారడం’ అసాధ్యం.

07/06/2017 - 21:55

ఎనిమిదేళ్ల ప్రాయంలోనే టెన్నిస్ ర్యాకెట్ పట్టుకున్న హైదరాబాద్ అమ్మాయి భువన కాల్వ (22) అత్యద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అంతర్జాతీయ వేదికలపై భారత పతాకాన్ని రెపరెపలాడిస్తోంది. జాతీయ స్థాయిలో అండర్ 14, అండర్ 16 విభాగాల్లో సత్తా చాటిన ఆమె దేశంలోని పదిమంది అత్యుత్తమ టెన్నిస్ క్రీడాకారిణుల్లో ఒకరిగా ఇప్పటికే గుర్తింపు పొందింది.

07/06/2017 - 21:51

టెన్త్, ఇంటర్ వంటి పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెల్లడైతే చాలు.. ‘టాప్ ర్యాంకుల్ని తమ విద్యార్థులే కైవసం చేసుకున్నారని, అధిక శాతం ఉత్తీర్ణతతో తామే అగ్రగామిగా నిలిచామని కానె్వంట్లు, కార్పొరేట్ కాలేజీలు, కోచింగ్ సంస్థలు ఫ్లెక్సీలు, బ్యానర్లతో చేసే హడావుడికి అంతేలేదు. అయితే, అందరి దృష్టినీ ఆకర్షించాలనుకున్న ఓ కుర్రాడు తన వింత ఆలోచనకు కార్యరూపం ఇచ్చాడు.

07/06/2017 - 21:49

తళుకులీనుతూ ‘ర్యాంప్’ మీద కదలాడిన ఆ మెరుపుతీగ.. ఇపుడు కరాటే విన్యాసాలతో పతకాలను, ప్రశంసలను తన ఖాతాలో వేసుకుంటోంది. ఒకప్పుడు తన అందచందాలతో ‘్ఫ్యషన్ షో’ల్లో అదరగొట్టిన ఆ మోడలింగ్ భామ నేడు యుద్ధవిద్యలో అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. ముంబయికి చెందిన సంధ్యా శెట్టి 2000 సంవత్సరంలో తనకు ఇష్టమైన మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

06/29/2017 - 21:17

ఏ పని చేయాలన్నా ఉసూరుమంటూ ప్రారంభిస్తే అది ఒక్క అడుగు కూడా ముందుకు కదలదు, దాంతో ఎవరైనా సరే మరింత నిరుత్సాహానికి గురై బద్దకం మొదలవుతుంది. ‘తర్వాత చేద్దాంలే’ అనే భావనతో పనులు ఎప్పటికపుడు వాయిదా పడుతుంటాయి. పనులు వాయిదా పడితే ఇంకేముంది? జీవితంలో ఉల్లాసం తగ్గి నిర్వేదం మొదలవుతుంది. అలాంటి వ్యక్తులు సమాజానికి పెద్ద భారంగా మారే ప్రమాదం ఏర్పడుతుంది.

06/29/2017 - 21:14

ఆటలో గెలుపు ఓటములు సహజమే. అయితే, ప్రతిష్ఠాత్మక పోటీలో మొదటే చేతులెత్తేసి.. చెత్తగా ఆడి చిత్తుగా ఓడిపోతే ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. కొద్దిరోజుల క్రితం చాంపియన్‌షిప్ క్రికెట్ ఫైనల్ పోటీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో మన ‘కోహ్లీ సేన’ ఘోర పరాజయం చవిచూశాక సాధారణ జనం సైతం ఆగ్రహంతో రగిలిపోయారు.

06/29/2017 - 21:11

ముంబయి మురికివాడ నుంచి న్యూ యార్క్‌లోని ప్రఖ్యాత నృత్య పాఠశాలలో చేరడం అసాధారణ విషయం.. అయితే, పదిహేనేళ్ల అమీరుద్దీన్ షా ఈ అద్భుతాన్ని సాధించి అందరినీ అబ్బురపరచాడు. ‘కలలు కనడానికి కూడా ధైర్యం ఉండాల’న్న మాటలను పటాపంచలు చేస్తూ, నాట్యరంగంలో భారత్‌కు మంచి పేరు తెస్తానని ఈ కుర్రాడు ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు.

06/29/2017 - 21:07

అబ్బురపరచే ‘యోగ’ విన్యాసాలను ప్రదర్శిస్తూ పదమూడేళ్ల ప్రాయంలోనే ఆమె అద్భుత రికార్డులను సొంతం చేసుకుంది. శరీరాన్ని విల్లులా వంచే ఖుషీ హేమచంద్ర అత్యంత క్లిష్టతరమైన యోగాసనాలను ప్రదర్శిస్తూ ‘ఔరా’ అనిపించుకుంటోంది. కర్నాటకలోని మైసూరుకు చెందిన ఆమె కష్టసాధ్యమైన ఓ ఆసనాన్ని ఒకే నిముషంలో పదమూడు సార్లు ప్రదర్శించింది.

Pages