S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

05/26/2016 - 21:24

టాక్సీ ఫ్యాబ్రిక్...ముంబాయిలో టాక్సీ ఎక్కిన వారిని అశ్చర్యపరుస్తున్న కళ ఇది. ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేసినట్టుగానే కార్లకూ చేయొచ్చు. సీట్ కవర్లకే అద్భుతమైన డిజైన్లు వేయడాన్ని ఎంచుకుని స్థానిక కళాకారులను ప్రోత్సహించడం ధ్యేయంగా మొదలైన టాక్సీ ఫ్యాబ్రిక్‌కి ఇప్పుడు ఆదరణ లభిస్తోంది.

05/19/2016 - 21:46

కాంపౌండ్‌లోకి సర్రున దూసుకొచ్చింది ఆడి ఆర్‌ఎస్5 కారు. అందులోంచి స్టయిల్‌గా దిగాడు హీరో. అది విలన్ డెన్. నేరుగా లోపలికి వెళ్లాడు. తన ఎదురుగా వచ్చి నిలబడిన హీరోను చూసి విలన్ ముందు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత భయపడ్డాడు. హీరో...అదేం గమనించకుండా
విలన్‌ను రఫ్పాడించేసి మళ్లీ అంతే స్టయిల్‌గా

05/19/2016 - 21:42

టీనా దబీ...
ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరిది.
ఏళ్ల తరబడి తపస్సు చేసినవారినే వరించని
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ను మొట్టమొదటి అటెంప్ట్‌లోనే సాధించిందామె.
డిగ్రీలో కాలేజ్ టాపర్
యూనివర్శిటీ గోల్డ్‌మెడలిస్ట్
బెస్ట్ ఆల్ రౌండ్ స్టూడెంట్ అవార్డ్ విజేత
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ విజేత
యుపిఎస్‌సి ఎగ్జామ్‌లో దేశంలోనే టాపర్

05/19/2016 - 21:41

టెక్నాలజీ మానవుడి మనుగడను సులభతరం చేస్తోందా లేక మరింత కష్టాలపాల్జేస్తోందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. నాణేనికి రెండు పార్శ్వాలున్నట్టే, టెక్నాలజీకీ ఉన్నాయి. క్లిష్టతరమైన పనుల్ని సునాయాసంగా చేయడం, ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మలచివేయడం టె క్నాలజీవల్లనే సాధ్యమయ్యాయి కదా! అలాగని వెర్రిపుంతలు వేస్తున్న టెక్నాలజీ వల్ల మానవ విధ్వంసమూ అంతే సునాయాసమవుతోంది.

05/19/2016 - 21:39

మొహమాటం అనేది సార్వజనీనం. ఇక్కడ అక్కడ అని లేదు ఏ దేశమేగినా, ఎందుకాలిడినా మొహమాటస్తులకు కొదవ లేదట. ఇది ఓ సర్వేలో తేలిన నిజం. అయితే సర్వే జరిగింది మాత్రం మొహమాటం మీద కాదు. వ్యక్తుల మనస్తత్వాల మీద. చిన్న చిన్న బహుమతులకు చిన్న పిల్లలు ఆశ పడతారు. చాక్లెట్లకు, స్వీట్లకు ఆశపడే పెద్దవాళ్లుంటారా? ఉండరనే అనుకుంటాం కానీ ఉంటారని ఈ సర్వేలో తేలింది.

05/19/2016 - 21:37

వేరబుల్ టెక్నాలజీలో మరో ముందడుగు పడింది! ఇంతవరకూ స్మార్ట్‌వాచీలు, బెల్ట్‌లు వంటి చిన్న చిన్న పరికరాలకే పరిమితమైన ఈ టెక్నాలజీలోకి ఇప్పుడు రోబోలు ప్రవేశించాయి. దక్షిణ కొరియా దిగ్గజ ఆటో కంపెనీ హ్యుండై మోటార్ గ్రూప్...వేరబుల్ రోబోలను మార్కెట్లోకి తీసుకువస్తోంది. ‘ఐరన్ మాన్’ సినిమాలోలా ఇక ఈ రోబోలను ‘్ధరించడ’మే తరువాయి, వాటితో చిత్రవిచిత్రమైన పనులెన్నింటినో చేయవచ్చు.

05/12/2016 - 21:25

మంత్రాలకు చింతకాయలు రాలవు. ఉంగరాలతో ఆరోగ్యం రాదు అనే కదా మీ అభిప్రాయం? కానీ ఉంగరానికి టెక్నాలజీ జోడిస్తే ఆరోగ్యం అదే వస్తుంది. అదెలాగంటారా? అయితే చదవండి మరి... ఫొటోలో మీరు చూస్తున్న ఉంగరంలోనే అసలు రహస్యమంతా ఉంది. దీనిపేరు ఔరా రింగ్. చూడటానికి స్టైలిష్‌గా ఉన్న ఈ రింగ్‌లో సెన్సర్లు ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యంపై ఎప్పుడూ ఓ కనే్నసి ఉంచుతాయి.

05/12/2016 - 21:23

కన్జూమర్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. అడుగు తీసి అడుగు వేస్తే లెక్క పెట్టేందుకు ఓ గాడ్జెట్, గుండె చప్పుళ్లను రికార్డ్ చేసేందుకో గాడ్జెట్, నిద్ర సరిగా పడుతోందా లేదా అని ఆరా తీసేందుకో గాడ్జెట్....ఇలా రకరకాల గాడ్జెట్లు! అయితే వీటిలోనే చిత్ర విచిత్రమై గాడ్జెట్లూ ఉన్నాయి. టైమ్‌కి నిద్ర లేవకపోతే షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చే గాడ్జెట్ గురించి విన్నారా?

05/12/2016 - 21:20

టెక్నాలజీ విస్తృతమవుతున్న కొద్దీ, భద్రత కూడా పెను సవాల్‌గా పరిణమిస్తోంది. సెల్ ఫోన్ మొదలుకుని, టాబ్లెట్, ఐప్యాడ్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలో మనం నిక్షిప్తం చేసే సమాచారం ఎంతవరకూ సేఫ్? అది ఇతరుల చేతిలో పడితే జరిగే పరిణామాలేమిటి అనే ప్రశ్నలు మన ల్ని వెన్నాడుతూనే ఉన్నాయి. మరోవైపు హ్యాకింగ్ మహమ్మారి పొంచి ఉండనే ఉంది.

05/12/2016 - 21:18

మనం ఎందుకు వెనుకబడి పోతున్నాం..ఎందుకు విజయాల మైలురాళ్లను అధిగమించలేక పోతున్నాం..ఇది వేలాది మందిని వేధించే ప్రశ్న. పరుగు పెట్టడం ఎంత ముఖ్యమో..మనల్ని మనం నిగ్రహించుకోగలిగే రీతిలో పరుగాపడమూ అంతే ముఖ్యం..ఈ రెంటి మధ్య ఉన్న తేడాను గమనిస్తే..అనుక్షణం గమనంలోకి తీసుకుంటే విజయం అందరినీ వరిస్తుంది..విజేతలు వేళ్లపై లెక్క పెట్టే సంఖ్యలో కాదు..ప్రతి ఒక్కరిలోనూ ఉంటారు..
****

Pages