S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

04/28/2016 - 21:20

‘ఇక ఫేస్‌బుక్ మొహం కూడా చూడకూడదు’ అని ఒట్టేసుకున్నారా? ఫర్వాలేదు...మీ లాంటివారు చాలామందే ఉంటారు. ఇలాంటివారిలో నూటికి 99శా తం మంది వారమో, పది రోజులో పోయాక ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టి, మళ్లీ ఫేస్‌బుక్‌లోకి ఎంటరైనవాళ్లే ఉంటారు.

04/28/2016 - 21:18

ఇప్పుడు స్పేస్ మేనేజ్‌మెంట్‌పైనే అందరి దృష్టీ! ఏ వస్తువైనా స్పేస్‌ను తక్కువగా వినియోగించుకునేలా ఉండాలి. అదే వస్తువు ఉభయతారకంగా ఉంటే మరీ మంచిది. ఆ కోవలోకే వస్తుంది-ఇఫోల్డీ. ఇదో చిన్న స్కూటర్ కమ్ సూట్‌కేస్! అదెలా కుదురుతుందనేగా మీ సందేహం? ఈ అసాధ్యాన్ని లండన్‌కు చెందిన తండ్రీకూతుళ్లు జియాన్‌మిన్, సుమీవాంగ్ సుసాధ్యం చేశారు.

04/28/2016 - 21:15

బాస్ ఈజ్ రైట్! ఇది ఉద్యోగులందరికీ అనుభవైక వేద్యం. మీ నుంచి పని ఎలా రాబట్టాలో..ఎంతగా మీ సమర్ధతను వినియోగించుకోవాలో బాసులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. మీ చేత పని చేయించుకోవడంలో అతడి ప్రతిష్ఠ ఇమిడి ఉంటుంది. అందుకే సిబ్బందిని ఎనలేని వత్తిళ్లకు గురిచేస్తారు! బాసులందు కొందరు బాసుల తీరు వేరయా అంటోంది తాజాగా జరిగిన ఓ సర్వే. దీని వివరాల్లోకి వెళితే ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తడమే ఆలస్యం!

04/28/2016 - 21:11

ఇప్పుడందరూ వాడేదీ స్మార్ట్ఫోనే్ల. టచ్‌స్క్రీన్‌పై టైపింగ్ అంత వీజీ కాదు. నాలుగు లైన్లు మెసేజ్ టైప్ చేయాలన్నా ఇబ్బందే. ఇక ఏదైనా పని పడి, ఎవరికైనా అర్జెంటుగా ఓ పది లైన్లు టైప్ చేసి పంపాలంటే తాతలు దిగిరావాల్సిందే. చేతిలో ఇమిడే స్మార్ట్ఫోన్లపై టైప్ చేయడం కూడా అంత సులువేం కాదు. మరి ఈ సమస్యనెలా అధిగమించడం? *

04/21/2016 - 21:41

మన దైనందిన జీవితంలో టెక్నాలజీ ఓ భాగమై పోయింది. ఇమెయిల్స్ చెక్ చేసుకోవడం మొదలు డెస్క్‌టాప్ ముందు కూర్చుని గంటల తరబడి పనిచేయడం వరకూ, కంప్యూటర్ లేనిదే క్షణం గడిచే పరిస్థితి లేని దశకు చేరుకున్నాం. స్మార్ట్ఫోన్ వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు పరిశీలిస్తే, మింగుడుపడని నిజాలెన్నో కనిపిస్తాయి.

04/21/2016 - 21:36

ఎవరు?
పేరు సైదా ఫలక్
ఊరు హైదరాబాద్
వయసు 21 ఏళ్లు

ఏం చదువుకుందో?
డిగ్రీ చేసింది.
ఎంఎ ఇంగ్లీష్ చదువుతోంది

04/21/2016 - 21:33

పడవల్లాంటి కార్లు తయారు చేసే మెర్సిడెస్ బెంజ్ సంస్థ ఈసారి నిజంగానే ఈ అధునాతన పడవను తయారు చేసింది. ఫొటోలో కనిపిస్తున్న పడవ అదే. మెర్సిడెస్ బెంజ్ కంపెనీ...సిల్వర్ యారోస్ మెరైన్ సంస్థతో కలసి రూపొందించిన యారో460 అనే పడవ ఇది. లోపల బెంజ్ కారుకున్న హంగులన్నీ ఉంటాయి. ఎయిర్ కండిషనింగ్ రూమ్స్, టేబుళ్లు, పడకలు, కిచెన్ వంటివన్నీ ఉంటాయి.

04/21/2016 - 21:31

మామిడి ఆకాశ్- ఈ పదిహేడేళ్ల కుర్రాడి పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. విజయవాడలో అయితే మరీను. అమెరికన్ కాలేజ్ టెస్ట్ (ఎసిటి), శాట్‌లలో ‘పర్‌ఫెక్ట్ స్కోర్’ సాధించి అందర్నీ అబ్బురపరిచిన ఆకాశ్‌ది విజయవాడే. చార్టెర్డ్ అకౌంటెంట్స్ అకాడెమీ ‘సూపర్‌విజ్’ చైర్మన్ ఎం గుప్తా, లక్ష్మి దంపతుల కుమారుడతను. అయితే రికార్డులు బద్దలు కొట్టడమనేది అతను ఇప్పుడే మొదలుపెట్టలేదు.

04/21/2016 - 21:26

అందరిలా మీరూ ఇన్‌షర్ట్ చేసుకుని ఓ టై కట్టుకుని వెడితే ఏం బాగుంటుంది? దానికీ ఏదో ఓ ప్రత్యేకత ఉండాలిగా. ఇకపై మీరు పార్టీలకో, ఫంక్షన్లకో వెళ్లాలనుకుంటే ఎంచక్కా ఎల్‌ఇడి యానిమేటెడ్ నెక్ టై కట్టుకుని వెళ్లండి. అందరి కళ్లూ మీమీదే ఉంటాయంటే నమ్మండి! 17 అంగుళాల పొడవైన ఈ నెక్‌టై పై ఎల్‌ఇడి బల్బులు ఉంటాయి. టై వెనకాల చిన్నపాటి బ్యాటరీలు అమర్చి ఉంటాయి.

04/21/2016 - 21:25

మీకు దాహం వేస్తూండవచ్చు. లేదా శరీరం డీహైడ్రేట్ అవుతూ ఉండొచ్చు. ఆ విషయం మీకు తెలియకపోయినా మీరు వేసుకున్న టీ షర్ట్‌కు తెలుస్తుంది. వెంటనే కాసిని మంచినీళ్లు తాగమని మిమ్మల్ని హెచ్చరిస్తుంది- ఇదంతా హాలీవుడ్ మూవీలో సీన్ అనుకుంటున్నారేమో? కానే కాదు. వేరబుల్ టెక్నాలజీలో వస్తున్న వినూత్న మార్పులకు నిదర్శనమిది.

Pages